జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎం మిత్ర పార్కులు

నాడు పోస్టు చేయడమైనది: 17 MAR 2026 1:57PM by PIB Hyderabad

తమిళనాడు (విరుదునగర్), తెలంగాణ (వరంగల్), గుజరాత్ (నవసారి), కర్ణాటక (కలబురగి), మధ్యప్రదేశ్ (ధార్), ఉత్తరప్రదేశ్ (లక్నో), మహారాష్ట్ర (అమరావతి)... ఈ ఏడు ప్రాంతాల్లో ప్రధానమంత్రి మెగా సమీకృత జౌళి ప్రాంత, వస్త్ర రంగ పార్కుల (పీఎం మిత్ర) ఏర్పాటును ప్రభుత్వం ఖరారు చేసింది. రూ. 4,445 కోట్ల వ్యయంతో 2027-28 వరకు ఏడేళ్ల కాలానికి వీటిని అభివృద్ధి చేయనున్నారు.

మొత్తం 13 రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 18 ప్రతిపాదనలు అందాయి. ఒక పారదర్శకమైన పోటీ ఆధారిత ఎంపిక విధానం (ఛాలెంజ్ మ్యాట్రిక్స్)లో వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను విశ్లేషించిన అనంతరం.. పైన పేర్కొన్న 7 ప్రాంతాలను పీఎం మిత్ర పార్కుల ఏర్పాటు కోసం ఖరారు చేశారు.

రాష్ట్రాల వారీగా సేకరించిన భూమి, భూ అభివృద్ధి, ప్రధాన మౌలిక సదుపాయాల ప్రస్తుత స్థితిగతుల వివరాలు ఇలా ఉన్నాయి:-

రాష్ట్రం

సేకరించిన భూమి

 (ఎకరాల్లో)

ప్రధాన, బాహ్య మౌలిక సదుపాయాలకు సంబంధించి భూమి అభివృద్ధి ప్రస్తుత స్థితి (2026 జనవరి 31 వరకు)

మధ్యప్రదేశ్

2,158

కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధితోపాటు/లేదా బాహ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.817.19 కోట్ల విలువైన పనులు అమలులో ఉన్నాయి.

తమిళనాడు

1,052

కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధితోపాటు/లేదా బాహ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.577.8 కోట్ల విలువైన పనులు అమలులో ఉన్నాయి.

గుజరాత్

1,142

కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధితోపాటు/లేదా బాహ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ. 496.4 కోట్ల విలువైన పనులు అమలులో ఉన్నాయి.

కర్ణాటక

1,000

కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధితోపాటు/లేదా బాహ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ. 50.9 కోట్ల విలువైన పనులు అమలులో ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్

1,000

కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధితోపాటు/లేదా బాహ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.990.71 కోట్ల విలువైన పనులు అమలులో ఉన్నాయి.

మహారాష్ట్ర

1,020

కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధితోపాటు/లేదా బాహ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.685.18 కోట్ల విలువైన పనులు అమలులో ఉన్నాయి.

తెలంగాణ

1,327

కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధితోపాటు/లేదా బాహ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.759.99 కోట్ల విలువైన పనులు అమలులో ఉన్నాయి.

 

పీఎం మిత్ర పార్కు పథకంలోని అభివృద్ధి మూలధన మద్దతు (డీసీఎస్) విభాగం కింద.. మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్రలకు మొత్తం రూ. 160 కోట్లు విడుదలయ్యాయి. దానితోపాటు పార్కు ద్వారాల వరకు బహిర్గత మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 2,160.17 కోట్ల విలువైన పనులను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి. ఇప్పటివరకు దీనిపై రూ. 564.72 కోట్లు వెచ్చించారు.

మధ్యప్రదేశ్‌లోని పీఎం మిత్ర పార్కులో 1,130.28 ఎకరాల భూమిని పెట్టుబడిదారులకు కేటాయించగా, ఇక్కడ ప్రతిపాదిత పెట్టుబడి రూ. 21,436.91 కోట్లుగా ఉంది. తమిళనాడులో పెట్టుబడిదారులకు 190.44 ఎకరాల భూమిని కేటాయించగా, ఇక్కడ ప్రతిపాదిత పెట్టుబడి రూ. 2,192.21 కోట్లుగా ఉంది. తెలంగాణలో ఇప్పటివరకు రూ. 3,862 కోట్ల పెట్టుబడి పనులు ప్రారంభం కాగా, ఇప్పటికే 540.41 ఎకరాల భూమిని కేటాయించారు. అన్ని పార్కుల్లో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ. 63,177 కోట్ల పెట్టుబడికి ఆసక్తి వ్యక్తీకరణ జరిగింది. ఈ పార్కులు పూర్తయితే.. జౌళీ రంగంలోని ప్రతీ దశలో అన్ని విభాగాల ద్వారా ఒక్కో పీఎం మిత్ర పార్కులో దాదాపు మూడు లక్షల (ప్రత్యక్ష/పరోక్ష) ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా. స్థానిక ప్రజలతోపాటు అన్ని వర్గాల ప్రజలకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది.

2027-28 వరకు ఏడేళ్ల కాలానికి పీఎం మిత్ర పార్కుల పథకం ఆమోదం పొందింది.

నిర్దిష్ట రంగాలకు తగిన వస్త్రాలను (టెక్నికల్ టెక్స్‌టైల్స్) రూపొందించడం ద్వారా అదనపు విలువను జోడించడంపై దృష్టి సారించడంతోపాటు, రాష్ట్రాల మధ్య పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తూ మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి.. 2026-27 కేంద్ర బడ్జెటులో గౌరవ ఆర్థిక శాఖ మంత్రి ప్రకటన చేశారు.

పథకానికి సత్వర అనుమతులు లభించేలా చూసేందుకు, వేగంగా అమలు చేయడానికి.. రాష్ట్ర ప్రభుత్వాలు - ఇతర భాగస్వాములతో సంప్రదింపుల ప్రక్రియను కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అంతేకాకుండా పథకం మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, మూల్యాంకన ప్రమాణాలపై చర్చించడం కోసం ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది.

లోకసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2241206) సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी