యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
జాతీయ సమగ్రత, సాంస్కృతిక అవగాహనను ప్రోత్సహించడానికి మై భారత్ యువజన కార్యక్రమాలు
నాడు పోస్టు చేయడమైనది:
16 MAR 2026 4:43PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా యువతలో జాతీయ సమైక్యత, సాంస్కృతిక అవగాహనను, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే మేరా యువ భారత్ (మై భారత్) అమలు చేస్తున్న యువజన కార్యక్రమాల లక్ష్యం. యువతకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సహచరులతో మాట్లాడుకోవడానికీ, విభిన్న సంస్కృతులను అర్థం చేసుకునేందుకు, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఉపాధి అవకాశాల గురించి అవగాహన పెంచుకోవడానికి ఈ కార్యక్రమాలు వేదికగా నిలుస్తాయి.
ప్రస్తుతం మై భారత్ అమలు చేస్తున్న యువజన కార్యక్రమాల్లో అంతర్ రాష్ట్ర యువజన కార్యక్రమం (ఐఎస్‌వైఈపీ), అంతర్ జిల్లా యువజన కార్యక్రమం (ఐడీవైఈపీ) ఉన్నాయి. వీటితో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహకారంతో గిరిజన యువజన కార్యక్రమం (టీవైఈపీ), కాశ్మీరీ యువజన కార్యక్రమాలను కూడా మై భారత్ నిర్వహిస్తోంది.
2023–24 ఆర్థిక సంవత్సరంలో మై భారత్ వార్షిక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా యువజన కార్యక్రమాలు ఏవీ లేవు. అయితే 2024–25 ఆర్థిక సంవత్సరంలో అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా యువజన కార్యక్రమాలను మై భారత్ వార్షిక కార్యాచరణ ప్రణాళికలో చేర్చారు. 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాల్లో హోం మంత్రిత్వ శాఖ సహకారంతో గిరిజన యువజన (టీవైఈపీ) కాశ్మీరీ యువజన (కేవైఈపీ) కార్యక్రమాలను మై భారత్ విజయవంతంగా అమలు చేసింది.
2024-25లో దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల వివరాలు..
|
S. No.
|
Name of Programme
|
No. of Programmes
Conducted
|
No. of Participants
|
|
|
|
|
1
|
Inter District Youth Exchange Programme (IDYEP)
|
89
|
2247
|
|
|
2
|
Inter State Youth Exchange Programme (ISYEP)
|
58
|
1447
|
|
|
3
|
Tribal Youth Exchange Programme (TYEP)
|
24
|
4787
|
|
|
4
|
Kashmiri Youth Exchange Programme (KYEP)
|
30
|
3438
|
|
|
|
Grand Total
|
201
|
11919
|
|
మై భారత్ నిర్వహించే యువజన కార్యక్రమాల లక్ష్యాలు, ప్రధాన అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
అంతర్ రాష్ట్ర యువజన కార్యక్రమం (ఐఎస్‌వైఈపీ):
వివిధ రాష్ట్రాలకు చెందిన యువత మధ్య జాతీయ సమగ్రత, సాంస్కృతిక మార్పిడి, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఇది క్షేత్రస్థాయి సందర్శనలు, భాష నేర్చుకోవడం, ఆహారపు అలవాట్లను పంచుకోవడం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ పద్ధతుల ద్వారా పరస్పర పరిచయాలకు వేదికగా నిలుస్తుంది.
అంతర్ జిల్లా యువజన కార్యక్రమం (ఐడీవైఈపీ):
వివిధ జిల్లాలకు చెందిన యువత మధ్య ఆలోచనలు, జ్ఞానం, అనుభవాల మార్పిడిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఇందులో పాల్గొనే యువతకు తాము సందర్శించే జిల్లాలోని సంప్రదాయాలు, ఆచారాలు, సాంస్కృతిక వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి తోడ్పడుతుంది. అలాగే అర్థవంతమైన పరస్పర చర్చలు, సహకారాన్ని పెంపొందిస్తుంది.
గిరిజన యువజన కార్యక్రమం (టీవైఈపీ):
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ కార్యక్రమం అమలవుతోంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు చెందిన గిరిజన యువతకు దేశ సాంస్కృతిక వారసత్వంపై అవగాహన కల్పించడం, భిన్నత్వంలో ఏకత్వం స్ఫూర్తిని పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. వారిని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం, జీవన నైపుణ్యాలను పెంపొందించడం, కెరీర్ కౌన్సెలింగ్ అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమ లక్ష్యం.
కాశ్మీరీ యువజన కార్యక్రమం (కేవైఈపీ):
కాశ్మీర్ లోయకు చెందిన యువతకు దేశంలోని ఇతర ప్రాంతాలలో జరుగుతున్న సాంకేతిక, పారిశ్రామిక పురోగతిని పరిచయం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఇది దేశంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు, విద్య, ఉపాధి మార్గాల గురించి వారికి అవగాహన కల్పిస్తుంది.
ఈ కార్యక్రమాల ద్వారా మై భారత్ యువత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, సాంస్కృతిక అవగాహనను పెంచడం, దేశవ్యాప్తంగా ఉన్న యువకుల సమగ్ర అభివృద్ధికి తోడ్పాటును అందిస్తోంది.
ఈ సమాచారాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సోమవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా అందించిన సమాధానంలో తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2240951)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9