సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సినిమా ధ్రువీకరణ ప్రక్రియలో డిజిటల్ మార్పును కొనసాగిస్తున్న సీబీఎఫ్‌సీ.. సినిమాటోగ్రాఫ్ (ధ్రువీకరణ నిబంధనలు) 2024 ప్రకారం బోర్డు సభ్యుల పదవీ కాలం నిర్ణయం

నాడు పోస్టు చేయడమైనది: 13 MAR 2026 5:43PM by PIB Hyderabad

ప్రతి ఏడాది సీబీఎఫ్‌సీ తన వార్షిక నివేదికను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సమర్పిస్తుంది. ఈ సమాచారం మంత్రిత్వ శాఖ సమగ్ర వార్షిక నివేదికలో పొందుపరుస్తుంది. ఈ నివేదిక క్రమం తప్పకుండా ప్రచురించడమే కాకుండా మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ మండలి (సీబీఎఫ్‌సీ) తన బోర్డు సభ్యులతో ఆన్‌లైన్‌లో సమావేశాలను నిర్వహిస్తుంది. 2017 నుంచి ఈ సినిప్రమాణ్‌ అనే అన్‌లైన్‌ వేదిక ద్వారా సినిమా సర్టిఫికేషన్‌ ప్రక్రియ ఎక్కువగా డిజిటల్‌ విధానంలో జరుగుతుంది. దీని ద్వారా దరఖాస్తుల సమర్పణ, పరిశీలన, అనుమతులు ఇవ్వడం వంటివన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. సినిమాల సంఖ్యను బట్టి పరిశీలన కమిటీ, పునఃపరిశీలన కమిటీల సమావేశాలను అవసరమైనప్పుడు నిర్వహించి, సినిమాలకు కాలానుగుణంగా సర్టిఫికేషన్ ఇస్తారు.

బోర్డు సభ్యుల పదవీ కాలం సినిమాటోగ్రాఫ్ చట్టం 1952, దాని కింద రూపొందించిన నియమాల ద్వారా బోర్డు సభ్యుల పదవీకాలం ఉంటుంది. సినిమాటోగ్రాఫ్ (సర్టిఫికేషన్) నియమాలు 2024లోని నియమం 3 ప్రకారం ప్రతి సభ్యుడు కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారం మూడు సంవత్సరాలకు మించకుండా పదవిలో ఉంటారు. కొత్త సభ్యులను వారి స్థానంలో నియమించే వరకు పాత సభ్యుల పదవీ కాలం కొనసాగుతుంది.

రాజ్యసభలో శ్రీ తిరుచ్చి శివ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2240051) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Kannada