ఔషధాల విభాగం
రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ: ఔషధ విభాగం నకిలీ మందుల విక్రయం
నాడు పోస్టు చేయడమైనది:
13 MAR 2026 3:52PM by PIB Hyderabad
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం ఇచ్చిన సమాచారం మేరకు.. నకిలీ, కల్తీ, నాణ్యతా ప్రమాణాలు లేని ఔషధాల తయారీ, విక్రయం, పంపిణీ వంటివి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం-1940, డ్రగ్స్ రూల్స్-1945 ప్రకారం శిక్షార్హమైన నేరం. ఇలాంటి సందర్భాల్లో చర్యలు తీసుకోవటానికి సంబంధిత లైసెన్సింగ్ అధికారులకు పూర్తి అధికారం ఉంటుంది.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం ఇచ్చిన సమాచారం ప్రకారం.. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం-1940, దాని నిబంధనల మేరకు.. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ), రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పరీక్షలు, విశ్లేషణలకు సరఫరా వ్యవస్థల నుంచి ఔషధాల నమూనాలను సేకరిస్తారు. ప్రమాణాలకు అనుగుణంగా లేవని (ఎన్ఎస్‌క్యూ), నకిలీ, కల్తీవని తేలిన ఔషధ నమూనాల వివరాలను, రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లు నివేదించిన సమాచారాన్ని డ్రగ్స్ అలర్ట్స్ పేరుతో కేంద్ర ప్రభుత్వ ప్రయోగశాలల ద్వారా సీడీఎస్‌సీఓ వెబ్‌సైట్‌లో ప్రతినెలా అప్‌లోడ్ చేస్తారు. ప్రజలందరికీ సమాచారాన్ని అందుబాటులో ఉంచటమే దీని ప్రధాన ఉద్దేశం.
ఇలాంటి సందర్భాల్లో ఆయా ఔషధాలను వెనక్కి తీసుకోవాలని (లేబుల్ లో పేర్కొన్న వివరాల ప్రకారం) సంబంధిత తయారీదారులను ఆదేశిస్తారు. అనంతరం విచారణ ఫలితాల మేరకు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, దాని నిబంధనల ప్రకారం సంబంధిత లైసెన్సింగ్ అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు.
డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, దాని నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మందుల వివరాలు సంవత్సరాల వారీగా ఇలా ఉన్నాయి:
|
సంవత్సరం
|
నిషేధించిన ఔషధాల సంఖ్య
|
|
|
|
|
2021
|
ఏమీ లేవు
|
|
|
|
|
2022
|
ఏమీ లేవు
|
|
|
|
|
2023
|
మానవులు వినియోగించే 14, జంతువులకు వినియోగించే 02 ఔషధాలు
|
|
|
2024
|
మానవులు వినియోగించే 157, జంతువులకు వినియోగించే 01 ఔషధాలు
|
|
|
2025
|
మానవులు వినియోగించే 01, జంతువులకు వినియోగించే 36 ఔషధాలు
|
|
డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం-1940 ప్రకారం.. నకిలీ మందుల తయారీ, విక్రయం, పంపిణీని నిషేధించారు. సెక్షన్ 17బీ ప్రకారం.. ఒక ఔషధాన్ని మరో ఔషధం పేరుతో తయారు చేసినప్పుడు, మోసగించే ఉద్దేశంతో అసలు మందును పోలి ఉన్నప్పుడు, తయారీదారుడి పేరు తప్పుగా ముద్రించినప్పుడు, కల్పిత తయారీదారుడి పేరుతో ఔషధాలని తయారు చేసినప్పుడు, ఔషధంలోని పదార్థాలను పూర్తిగా లేదా పాక్షికంగా ఇతర పదార్థాలతో భర్తీ చేసిన సందర్భాల్లో ఔషధాన్ని నకిలీదని పరిగణిస్తారు. సెక్షన్ 18 ప్రకారం.. సరైన అనుమతులు తీసుకోకుండా ఇలాంటి ఔషధాలను తయారు చేయటం, విక్రయించటం, నిల్వ చేయటం, పంపిణీ చేయడం నిషేధం. నకిలీ ఔషధాల తయారీని అరికట్టేందుకు.. లైసెన్సింగ్, లేబులింగ్, తనిఖీ, తయారీ ప్రమాణాలను నియంత్రించటం ద్వారా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనలు-1945 ఈ నియమాలకు మద్దతిస్తున్నాయి.
ఈ చట్టంలోని సెక్షన్ 27.. నకిలీ మందుల తయారీ, విక్రయానికి సంబంధించిన శిక్షలను తెలియజేస్తుంది. నకిలీ ఔషధాల వల్ల మరణం సంభవించినా, శారీరక హాని కలిగినా, నేరస్తుడికి కనీసం 10 ఏళ్ల శిక్ష పడుతుంది. ఇది జీవితఖైదుకు పొడిగించే అవకాశం ఉంటుంది. దీనితో పాటు కనీసం రూ.10 లక్షల జరిమానా, సీజ్ చేసిన ఔషధాల విలువకు మూడు రెట్లు జరిమానా విధించవచ్చు. ఇతర సందర్భాల్లో నిందితులకు కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష, జీవితఖైదు విధించే అవకాశముంది. దీనితో పాటు కనీసం రూ.3 లక్షల జరిమానా లేదా పట్టుబడిన ఔషధాల విలువలకి మూడు రెట్లు జరిమానా విధిస్తారు. అదనంగా సెక్షన్లు 31, 34 ప్రకారం.. ఆ ఔషధాలను, వాటికి సంబంధించిన ఇతర సామగ్రిని ప్రభుత్వం జప్తు చేసుకుంటుంది. ఈ నేరానికి బాధ్యులైన కంపెనీ అధికారులపైనా చర్యలు తీసుకుంటారు. నకిలీ ఔషధాలకు సంబంధించిన నేరాలు కాగ్నిజబుల్, నాన్-బెయిలబుల్ వర్గంలోకి వస్తాయి. ఇది నకిలీ మందుల తయారీదారులపై కఠినమైన చర్యల అమలును తెలియజేస్తుంది.
రసాయనాలు, ఎరువుల సహాయమంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ ఇవాళ లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2240047)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11