సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, పారిశ్రామిక వేత్తల ప్రయోజనం కోసం పలు పథకాలను అమలు చేస్తున్న ఎన్ఎస్ఐసీ
ఎన్ఎస్ఐసీ అమలు చేస్తున్న నేషనల్ ఎస్సీ-ఎస్టీ హబ్ (ఎన్ఎస్ఎస్హెచ్) పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమారు 1,446 మంది ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ఎంఎస్ఎంఈలకు వాణిజ్య కార్యకలాపాల కోసం ముడి సరుకును అందించేందుకు పలు ప్రముఖ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న ఎన్ఎస్ఐసీ
నాడు పోస్టు చేయడమైనది:
12 MAR 2026 4:56PM by PIB Hyderabad
కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎస్ఐసీ) ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాతో సహా దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం, అభివృద్ధి కోసం వివిధ పథకాల ద్వారా సమగ్ర మద్దతును అందిస్తోంది. ఈ పథకాలలో ప్రధానంగా ముడి సరుకు సహాయం, ముడి సరుకు పంపిణీ, మార్కెటింగ్ మద్దతు, రుణ సౌలభ్యం, ఐసీటీ డిజిటల్ సేవలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత అభివృద్ధి మొదలైనవి ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో ఉన్న ఎన్ఎస్ఐసీ శాఖా కార్యాలయాలు కోనసీమ జిల్లాలోని ఎంఎస్ఎంఈల అవసరాలను తీరుస్తాయి.
గత మూడేళ్ల లోనూ, ప్రస్తుత సంవత్సరంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ఎస్ఐసీ పథకాల ద్వారా సహాయం, ప్రయోజనం పొందిన ఎంఎస్ఎంఈలు/పారిశ్రామికవేత్తల సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది:
|
సంవత్సరం
|
సింగిల్ పాయింట్ రిజిస్ట్రేషన్ పథకం
|
గ్లోబల్ ఎంఎస్ఎంఈక మార్ట్ - బీ బీ
|
ముడి సరకు సహాయ పథకం
|
ముడి సరుకు పంపిణీ పథకం
|
బ్యాంక్ అనుసంధాన పథకం
|
బిల్లు రాయితీ పథకం
|
|
2022-23
|
186
|
72
|
83
|
4
|
2
|
-
|
|
2023-24
|
159
|
102
|
81
|
6
|
2
|
1
|
|
2024-25
|
144
|
96
|
82
|
2
|
2
|
1
|
|
2025-26
(28 ఫిబ్రవరి 2026వరకు)
|
117
|
191
|
78
|
6
|
7
|
1
|
గత మూడేళ్లలోనూ, ప్రస్తుత సంవత్సరంలోనూ ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఎస్ఐసీ కార్యక్రమాల కింద పథకాల వారీగా మంజూరైన నిధుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
(రూ. లక్షల్లో)
|
సంవత్సరం
|
ముడి సరకు సహాయ పథకం
|
ముడి సరుకు పంపిణీ పథకం
|
బ్యాంక్ అనుసంధాన పథకం
|
బిల్లు రాయితీ పథకం
|
|
2022-23
|
26143.34
|
364.00
|
38.75
|
-
|
|
2023-24
|
22334.37
|
435.73
|
330.00
|
400.00
|
|
2024-25
|
23159.96
|
477.86
|
51.00
|
283.13
|
|
2025-26
28 ఫిబ్రవరి 2026 వరకు
|
28244.08
|
363.98
|
416.00
|
627.15
|
హైదరాబాద్‌లోని ఎన్ఎస్ఐసీ టెక్నికల్ సర్వీస్ సెంటర్ (ఎన్టీఎస్సీ) ద్వారా గత మూడేళ్లలోనూ, ప్రస్తుత సంవత్సరంలోనూ (28 ఫిబ్రవరి 2026 వరకు) ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన వ్యవస్థాపకత, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
|
సంవత్సరం
|
కార్యక్రమాల సంఖ్య
|
అభ్యర్థుల సంఖ్య
|
|
2022-23
|
01
|
20
|
|
2023-24
|
01
|
100
|
|
2024-25
|
02
|
479
|
|
2025-26
28 ఫిబ్రవరి 2026 వరకు
|
09
|
1161
|
సూక్ష్మ, చిన్న పరిశ్రమల కోసం రూపొందించిన పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ (ప్రభుత్వ కొనుగోలు విధానం) ప్రకారం, ప్రభుత్వ రంగ సంస్థలు చేసే మొత్తం కొనుగోళ్లలో 4% వాటాను ఎస్సీ/ఎస్టీ యాజమాన్యంలోని సంస్థల నుంచే సేకరించాలనే నిబంధన ఉంది. దీనిని అమలు చేయడం, ఎస్సీ/ఎస్టీ వర్గాల్లో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం ఎన్ఎస్ఐసీ భారత ప్రభుత్వం తరపున నేషనల్ ఎస్సీ-ఎస్టీ హబ్ (ఎన్ఎస్ఎస్హెచ్) పథకాన్ని అమలు చేస్తోంది. ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్లాంట్ యంత్రాలు, పరికరాల కొనుగోలు కోసం తీసుకునే సంస్థాగత రుణంపై ప్రత్యేక క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ ద్వారా రూ. 25 లక్షల వరకు సబ్సిడీ అందించడం; నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య పెంపుదల కార్యక్రమాల, ప్రత్యేక మార్కెట్ సహాయ పథకం ద్వారా మార్కెట్ అనుసంధానం; పోటీతత్వాన్ని పెంపొందించడానికి టెస్టింగ్ ఫీజులు, ఎగుమతి ప్రోత్సాహక మండళ్ల సభ్యత్వ రుసుము, ప్రభుత్వం ప్రోత్సహించే ఇ-కామర్స్ పోర్టల్స్ రుసుముల రీయింబర్స్‌మెంట్ వంటివి ఇందులో ఉన్నాయి. గత మూడేళ్లలోనూ, ప్రస్తుత సంవత్సరంలోనూ ఆంధ్రప్రదేశ్ నుంచి 1,446 మంది ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఈ పథకం కింద ప్రయోజనం పొందారు.
ఆంధ్రప్రదేశ్‌లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే ఎంఎస్ఎంఈలకు ముడి సరుకును సరఫరా చేయడం కోసం ఎన్ఎస్ఐసీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్), బిటారా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సిమెంట్, శ్రీ కన్యా స్టీల్ కార్పొరేషన్లతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది:
ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాతో సహా ఇతర ప్రాంతాలలో తన సేవల విస్తృతిని, ప్రభావాన్ని పెంచడానికి ఎన్ఎస్ఐసీ ఈ క్రింది పలు చర్యలను చేపట్టింది:
-
ఎంఎస్ఎంఈలకు ఎన్ఎస్ఐసీ పథకాల గురించి తెలియజేయడానికి అవగాహన కార్యక్రమాలు, టీమ్ ఇనిషియేటివ్ వర్క్‌షాప్‌లు, ప్రచారాలు, సెమినార్ల నిర్వహణ.
-
ఎంఎస్ఎంఈల ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి రుణాలు, ముడి సరుకు సహాయాన్ని అందించడం.
-
భాగస్వామ్య సంస్థల ద్వారా వ్యవస్థాపకత అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కార్యక్రమాల నిర్వహణ
-
ప్రభుత్వ కొనుగోళ్లలో ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యాన్ని పెంపొందించడం కోసం నేషనల్ ఎస్సీ-ఎస్టీ హబ్ పథకాన్ని అమలు చేయడం.
-
వాణిజ్య ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు మొదలైన వాటి ద్వారా మార్కెట్ అనుసంధానాలను పెంపొందించడం.
-
మద్దతు సేవలను సమర్థవంతంగా అందించడం కోసం రాష్ట్ర సంస్థలు, జిల్లా యంత్రాంగంతో సహకారం.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజే ఈరోజు లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు.
***
(రిలీజ్ ఐడి: 2239225)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5