శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘‘ఏఐ ఆధారిత స్మార్ట్ యోగా మ్యాట్ వాణిజ్యీకరణకు వెల్‌నెసిస్ టెక్నాలజీస్ కు టీడీబీ-డీఎస్‌టీ తోడ్పాటు’’

నాడు పోస్టు చేయడమైనది: 10 MAR 2026 2:47PM by PIB Hyderabad

భారతదేశంలో డీప్-టెక్ అంకుర సంస్థల రంగాన్ని ప్రోత్సహించడంలోస్వదేశీ ఆవిష్కరణలను ప్రయోగ దశ నుంచి మార్కెట్టుకు చేర్చడంలో తమ నిబద్ధతను భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు (టీడీబీ), సైన్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీపునరుద్ఘాటించాయిదీనిలో భాగంగా వినూత్న ఆవిష్కరణ అయిన యోగిఫై స్మార్ట్ యోగా మ్యాట్‌ వాణిజ్యీకరణ నిమిత్తం బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ వెల్‌నెసిస్ టెక్నాలజీస్ కు ఆర్థిక సాయాన్ని పెంచింది.

దేశీయంగా తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడంభారత్‌లో అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత వెల్‌నెస్ టెక్నాలజీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడమే ‘‘స్వతంత్రస్వయం సమృద్ధమైన వ్యవస్థలతో యోగిఫై స్మార్ట్ సెన్సర్ ఫ్యాబ్రిక్ మ్యాట్ వాణిజ్యీకరణ’’ ప్రాజెక్టు లక్ష్యంప్రివెంటివ్ హెల్త్‌కేర్డిజిటల్ వెల్‌నెస్ సాంకేతిక పరిజ్ఞానాలనుఆత్మనిర్భర భారత్ ద్వారా తయారీలో స్వావలంబనను ప్రోత్సహించాలనే భారత ప్రభుత్వం దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంది.

అత్యాధునిక సెన్సర్ టెక్నాలజీని కృత్రిమ మేధతో ఏకీకరించి యోగిఫై స్మార్ట్ యోగా మ్యాట్‌ను రూపొందించారుఇది అనుసంధానించిన మొబైల్ అప్లికేషన్ ద్వారా వాస్తవ సమయంలో భంగిమకు సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌నునిర్దేశిత యోగా పాఠాలనుప్రదర్శనకు సంబంధించిన పూర్తి విశ్లేషణను అందిస్తుందిడిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్నిప్రాచీన యోగ శాస్త్రంతో మిళితం చేయడం ద్వారా భారత దేశ అంకుర సంస్థల రంగంలో నూతనంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ ఆధారిత ప్రివెంటివ్ వెల్‌నెస్ అనే కొత్త విభాగాన్ని ఈ ఉత్పత్తి ప్రతిబింబిస్తోంది.

ఆరోగ్య సంరక్షణ పట్ల అవగాహనయోగాకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ హెల్త్వెల్‌నెస్ సాంకేతిక పరిజ్ఞానాల్లో వేగవంతమైన వృద్ధిని భారత్ చూస్తోందిసంప్రదాయ పద్ధతులను అంతర్జాతీయ ఉత్పత్తులుగా మార్చే డీప్-టెక్ సాంకేతిక సామర్థ్యాలను భారతీయ అంకుర సంస్థలు ఎలా ఉపయోగించుకుంటున్నాయో యోగిఫై లాంటి ఆవిష్కరణలు తెలియజేస్తున్నాయి.

ఒప్పందంపై సంతకం చేసిన సందర్భంగా టీడీబీ సెక్రటరీ శ్రీ రాజేష్ కుమార్ పాఠక్ మాట్లాడారు. ‘‘అంతర్జాతీయంగా సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేస్తున్న భారతీయ అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు టీడీబీ కట్టుబడి ఉందిఆధునిక సాంకేతికతల ద్వారా భారతదేశ పురాతన సంప్రదాయ యోగాను బలోపేతం చేయవచ్చని యోగిఫై లాంటి ఆవిష్కరణలు తెలియజేస్తున్నాయిఅలాగే భారతీయ విజ్ఞాన వ్యవస్థలను ప్రపంచస్థాయికి చేరుస్తూనేఆరోగ్య సంరక్షణను పెంపొందించే డిజిటల్ వెల్‌నెస్ పరిష్కరాలను రూపొందిస్తున్నాయి’’ అని వివరించారు.

టీడీబీ అందిస్తున్న తోడ్పాటును వెల్‌నెసిస్ టెక్నాలజీస్ ప్రమోటర్లు ప్రశంసించారుయోగిఫై స్మార్ట్ యోగా మ్యాట్‌ను ప్రపంచానికి చేరువయ్యేలా ఉత్పత్తిని విస్తరించడానికి తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ఈ సహాయం వేగవంతం చేస్తుందన్నారుఅదే సమయంలో సాంకేతిక ఆధారిత ఆరోగ్య పరిష్కారాల్లో పెరుగుతున్న భారత్ నాయకత్వ స్థాయిని సూచిస్తుందని తెలియజేశారు.


 

***


(రిలీజ్ ఐడి: 2237590) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , हिन्दी