సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దుర్గ పూజకు ప్రచారం... అంతర్జాతీయ గుర్తింపు

నాడు పోస్టు చేయడమైనది: 09 MAR 2026 3:15PM by PIB Hyderabad

దుర్గ పూజను సాంస్కృతిక శాఖకు చెందిన గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ స్కీములో భాగంగా ప్రపంచమంతటా తీసుకుపోయేందుకు చేసే ఉద్దేశంతో అంతర్జాతీయ సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.
యునెస్కోలో అమూర్త సంస్కృతి కేటగిరీలో నామినేషన్ కోసం దుర్గ పూజ గురించి పరిశోధనడాక్యుమెంటేషన్ ప్రక్రియల్ని పూర్తి చేసి నివేదించడానికి ఈ మంత్రిత్వ శాఖ  2023లో రూ.22,29,244ను కేటాయించింది.
టోక్యోలో నివసించే భారతీయ బెంగాలీ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ‘ఇప్పాన్ షాదన్ హౌజిన్ ఇండోజిన్నో సుదోయి’ సహకారంతో దుర్గ పూజ వేడుకల వీడియోను సంగీత నాటక అకాడమీ (ఎస్ఎన్ఏ) 2025 సెప్టెంబర్లో ప్రజలతో పంచుకుందిదుర్గ పూజా ఉత్సవాన్ని ఇప్పాన్ షాదన్ హౌజిన్ ఇండోజిన్నో సుదోయి అమిత భక్తిశ్రద్ధలతోనూసాంస్కృతికోత్సాహంతోనూ నిర్వహిస్తోందిదీనికి తోడుఢిల్లీ లోని ఎర్రకోటలో 2025 డిసెంబరు నుంచి 13 తేదీల మధ్య అంత ప్రభుత్వ సంఘ సమావేశాల్ని నిర్వహించిన సందర్భంగా సాంప్రదాయిక ‘ధునుచీ నాచ్‌’ను ప్రదర్శించారుఈ నృత్యాన్ని యునెస్కో అధికారులతో పాటు 190కి పైగా దేశాల ప్రతినిధులు చూశారు.
అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తన ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా 2.0’ ప్రచార ఉద్యమ పరిధిని క్రమంగా విస్తరిస్తోందిదీన్లో భాగంగా దుర్గ పూజకు ప్రచారం కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారుదుర్గ పూజను యునెస్కో అమూర్త సాంస్కృతిక వారసత్వంగా గుర్తించిందిదీనికి సంబంధించిన వ్యూహంలో డిజిటల్ మార్కెటింగ్అంతర్జాతీయ ప్రసార మాధ్యమాల్లో కవరేజీతో పాటు విదేశీ సందర్శకుల దృష్టిని ఆకర్షించడానికి సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేయడం వంటివి భాగంగా ఉన్నాయి.
సంగీత నాటక అకాడమీ కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖలో భాగంగా ఉన్న అమూర్త సాంస్కృతిక వారసత్వ నోడల్ ఏజెన్సీగా ఉందిఇది ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసిందిఈ సంఘం దుర్గ పూజ ఉత్సవంతో సంబంధం గల వ్యక్తులుసమూహాలువివిధ సమాజాల చురుకైన భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ప్రజాసంబంధాల్నీ,  క్షేత్రస్థాయి కార్యక్రమాల్నీ పెద్ద ఎత్తున నిర్వహించిందిఆసక్తిదారులతో చేపట్టిన క్షేత్ర స్థాయి సంప్రదింపులు లోతైన పరిశీలనలను అందించాయిదీంతో ఈ సాంస్కృతిక ఆచారానికి సంబంధించిన వివరాలను సమగ్రంగా తెలుసుకొని నివేదికను తయారు చేయడం సాధ్యమైందిఈ ప్రయత్నాలన్నీ దుర్గ పూజ కాలక్రమంలో ఎలా మారుతూ వచ్చిందికళాత్మక శ్రేష్ఠత్వాన్ని సంతరించుకొందిఆచార వ్యవహారాలుసామాజికసాంస్కృతిక పార్శ్వాల తాలూకు వివరాలన్నిటినీ వ్యవస్థీకృతంగా నమోదు చేసిజాతీయ స్థాయిలోనూఅంతర్జాతీయ స్థాయిలోనూ వ్యాప్తి చేయడంలో తోడ్పడతాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతికపర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ రోజు లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2237040) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali