రక్షణ మంత్రిత్వ శాఖ
నౌకాదళ ఆయుధ విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ బీపీ సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
02 MAR 2026 5:52PM by PIB Hyderabad
నౌకాదళ ఆయుధ విభాగం డైరెక్టర్ జనరల్ గా (డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ఆర్మమెంట్ -డీజీఓఎన్ఏ ) గా శ్రీ బీపీ సింగ్ 2026 మార్చి 01న న్యూఢిల్లీలోని నౌకాదళ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 1994 బ్యాచ్ ఇండియన్ నేవల్ ఆర్మమెంట్ సర్వీస్ (ఐఎన్ఏఎస్) అధికారి అయిన శ్రీ సింగ్ 2026 ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేసిన శ్రీ దివాకర్ జయంత్ స్థానంలో నియమితులయ్యారు.
పాట్నా లోని బీహార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ప్రస్తుతం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందిన శ్రీ బీపీ సింగ్‌కు నౌకాదళ ఆయుధ విభాగంలో మూడు దశాబ్దాలకు పైగా విశేష అనుభవం ఉంది. డీజీఓఎన్ఏగా నియమితులు కావడానికి ముందు, ఆయన ముంబయిలోని నేవల్ ఆర్మమెంట్ డిపో (ఎన్ఏడీ) చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. అక్కడ ఆయన కీలకమైన కార్యకలాపాలు, రవాణా వ్యవస్థ, మౌలిక సదుపాయాల రూపకల్పన వంటి బాధ్యతలను నిర్వహించారు.
శ్రీ బి.పి. సింగ్ విశాఖపట్నం, ముంబయి, ట్రోంబే నేవల్ ఆర్మమెంట్ డిపో వంటి కీలక విభాగాల్లో పలు ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. న్యూఢిల్లీలోని నౌకాదళ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ఆర్మమెంట్ విభాగంలో కూడా ఆయన పనిచేశారు. అక్కడ ఆయుధ రంగంలో విధానాల రూపకల్పన, వ్యూహాత్మక ప్రణాళికలకు తన వంతు సహకారం అందించారు. అలువా ఎన్ఏడీ చీఫ్ జనరల్ మేనేజర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించి, నిర్వహణా సామర్థ్యాన్ని, డిపో నిర్వహణ పద్ధతులను మరింత బలోపేతం చేశారు.
భారత నౌకాదళానికి చెందిన సాధారణ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, గైడెడ్ వెపన్ సిస్టమ్స్ నిర్వహణలో శ్రీ సింగ్ కు అపారమైన అనుభవం ఉంది. సంక్లిష్టమైన ఆయుధ వ్యవస్థల కొనుగోలు, నిల్వ, నిర్వహణ, భద్రత, రవాణా వ్యవస్థ, జీవిత కాల మద్దతు (లైఫ్-సైకిల్ సపోర్ట్) వంటి అంశాలలో ఆయనకున్న నైపుణ్యం కార్యకలాపాల సంసిద్ధతను గణనీయంగా మెరుగుపరిచింది.
ప్రఖ్యాత నేషనల్ డిఫెన్స్ కాలేజీ (ఎన్డీసీ - 60) పూర్వ విద్యార్థి అయిన శ్రీ బీపీ సింగ్ వ్యూహాత్మక, జాతీయ భద్రతా అంశాలలో పొందిన ఉన్నత స్థాయి శిక్షణ ఆయన నాయకత్వ పటిమను మరింత పెంచింది.
***
(రిలీజ్ ఐడి: 2234684)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5