బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేప్టివ్, వాణిజ్య ప్రధాన గనుల నుంచి 2026 ఫిబ్రవరిలో నెల వారీ ఉత్పత్తి, సరఫరా

నాడు పోస్టు చేయడమైనది: 02 MAR 2026 4:27PM by PIB Hyderabad

ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో, కేప్టివ్ బొగ్గు గనులతో పాటు వాణిజ్య ప్రధాన బొగ్గు గనుల నుంచి రికార్డు స్థాయిలో 20.49 మిలియన్ టన్నుల (ఎంటీ) మేర ఉత్పత్తి నమోదు అయింది. సరఫరాలు 17.72 ఎంటీ స్థాయికి చేరాయి. బొగ్గు ఉత్పత్తిలో కిందటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే చెప్పుకోదగినంతగా.. 18.51 శాతం వృద్ధి ఉంది. ఇది ఈ రంగంలో తవ్వకం కార్యకలాపాలు క్రమ క్రమంగా పెరుగుతుండటాన్ని సూచిస్తోంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకూ ఈ గనుల నుంచి మొత్తం బొగ్గు ఉత్పత్తి.. అంతకు పూర్వపు సంవత్సరంలోని ఇదే కాలంతో పోల్చి చూస్తే 11.58 శాతం వృద్ధిని నమోదు చేసింది. కాగా మొత్తం సరఫరాలు ఇదివరకటి సంవత్సరం ఇదే కాలంలో కన్నా 6.78 శాతం మేరకు పెరిగాయి. ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ నిరంతర వృద్ధిని పరిశీలిస్తే కార్యకలాపాల నిర్వహణలో దక్షత, సామర్థ్యాన్ని పెంచే ప్రక్రియ వేగవంతం అవుతూ ఉండడంతో పాటు బొగ్గు తవ్వకం రంగానికి సంబంధించిన వేల్యూ చైన్లో సమన్వయం మెరుగుపడినట్లు తేలుతోంది.
ఈ కథనానికి జతపరిచిన కింది రేఖాచిత్రం నిలకడగా పెరుగుతూ ఉన్న సరళిని ప్రస్ఫుటం చేస్తోంది. ఇది ఉత్పత్తిలోనూ, సరఫరాల్లోనూ క్రమ క్రమంగా మెరుగుదల ఉన్న విషయం స్పష్టం అవుతోంది.
 

 

image.png



విధానం పరంగా వ్యూహాత్మక చర్యలను తీసుకోవడం, పటిష్ఠ పర్యవేక్షణ, ఆసక్తిదారులకు నిరంతరాయంగా మద్దతును అందిస్తుండటం ఈ రంగం పనితీరును మెరుగుపరిచినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రయత్నాలు నిర్వహణ సంబంధిత ఆమోదాలకు వేగాన్ని సంతరించడంలో, ఉత్పత్తి సామర్థ్యాల్ని పెంపొందింపచేయడంలో కీలక పాత్రను పోషించాయి. దీంతో మొత్తంమీద బొగ్గు ఉత్పత్తితో పాటు సరఫరాల్లో పెరుగుదల చోటుచేసుకొంది.
దేశంలో కేప్టివ్, వాణిజ్య ప్రధాన బొగ్గు గనుల తవ్వకాలకు సంబంధించిన పూర్తి సామర్థ్యాన్ని సద్వినియోగపరుచుకొనేందుకు కట్టుబడి ఉన్నట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. రాబోయే కాలంలో ఉత్పత్తి స్థాయులను నిలకడగా పెంచుతూ, సరఫరాకు సంబంధించిన సమస్యల్ని తగ్గించడంతో పాటు, దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ఇంధన అవసరాల్ని తీర్చడంలో ఈ రంగం పోషిస్తున్న కీలక పాత్రను బలోపేతం చేయడంపైన దృష్టిని కేంద్రీకరిస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

 

***


(రిలీజ్ ఐడి: 2234677) సందర్శకుల సూచీ సంఖ్య : : 38
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu