ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిజిలాకర్ నియంత్రణ సమన్వయానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ


డిజిటల్ లాకర్ నిమయాల సమీక్ష, భవిష్యత్తు ప్రణాళిక రూపకల్పన చేయనున్న ప్యానెల్

प्रविष्टि तिथि: 24 FEB 2026 8:02PM by PIB Hyderabad

డిజిలాకర్ నియంత్రణలను సమన్వయం చేయడానికి అత్యున్నత స్థాయి కమిటీని ఎలక్ట్రానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందిప్రస్తుత సాంకేతికచట్టపరమైన పరిస్థితులకు అనుగుణంగా డిజిటల్ లాకర్ నియమాలను న్యాయపరంగా సమీక్షించడంఎంటిటీ లాకర్డిజిటల్ లాకర్ వ్యవస్థ విస్తరణకువాణిజ్యీకరణకు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడం ఈ కమిటీ విధుల్లో భాగంగా ఉన్నాయి.

ఈ కమిటీకి ఎలక్ట్రానిక్స్ఐటీ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి శ్రీ అజయ్ సాహ్ని నేతృత్వం వహిస్తారున్యాయ నిపుణులుసాంకేతిక నిపుణులుపారిశ్రామిక ప్రతినిధులు దీనిలో సభ్యులుగా ఉంటారు.

న్యూఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్‌లో ఉన్న ఎలక్ట్రానిక్స్ నికేతన్ వద్ద 2026, ఫిబ్రవరి 24న కమిటీ మొదటి సమావేశం జరిగిందిపౌరులకు జీవన సౌలభ్యాన్నిసంస్థలకు వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించడం ద్వారా వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడంలో డిజిటల్ లాకర్ వ్యవస్థ దృక్పథంపైపోషించే పాత్రపై కమిటీ సభ్యులు చర్చించారు.

 

***


(रिलीज़ आईडी: 2232865) आगंतुक पटल : 77
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी