ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బ్లాక్‌చైన్ ఆధారిత డిజిటల్ గవర్నెన్స్ పరిష్కారాలను ప్రోత్సహించడానికి బ్లాక్‌చైన్ ఇండియా చాలెంజిని ప్రారంభించిన ఎంఈఐటీవై

నాడు పోస్టు చేయడమైనది: 24 FEB 2026 7:22PM by PIB Hyderabad

బ్లాక్‌చైన్ ఇండియా చాలెంజి’ని ఎలక్ట్రానిక్స్సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవైకార్యదర్శి శ్రీ ఎస్కృష్ణన్ ఐఏఎస్ 2026 ఫిబ్రవరి 23న న్యూఢిల్లీలోని ఎంఈఐటీవైలో ప్రారంభించారుఈ కార్యక్రమంలో ఎంఈఐటీవై అదనపు కార్యదర్శి శ్రీ అభిషేక్ సింగ్ఎంఈఐటీవై సంయుక్త కార్యదర్శి శ్రీ సుదీప్ శ్రీవాస్తవఎంఈఐటీవై గ్రూప్ కోఆర్డినేటర్లు శ్రీమతి సునీతా వర్మశ్రీ మనోజ్ కుమార్ జైన్సైంటిస్ట్ జీఎంఈఐటీవైసీ-డీఏసీ హైదరాబాద్ సెంటర్ హెడ్ శ్రీమతి పిఆర్లక్ష్మీ ఈశ్వరిలతో పాటు ఎంఈఐటీవైసీ-డీఏసీలకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారువేర్వేరు ప్రభుత్వ విభాగాలతో పాటు అంకుర సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి.

 

ఈ చాలెంజిని ఎంఈఐటీవై సహకారంతో సీ-డీఏసీ ద్వారా అమలు చేస్తున్నారుబ్లాక్‌చైన్ ఇండియా చాలెంజి జాతీయ స్థాయిలో చేపడుతున్న కార్యక్రమంఅత్యాధునిక బ్లాక్‌చైన్ ఆధారిత డిజిటల్ గవర్నెన్స్ పరిష్కారాల్ని ఆవిష్కరించడంతో పాటువాటిని పరీక్షించి చూడటానికి భారతీయ అంకుర సంస్థల్ని ప్రోత్సహించడం ఈ చాలెంజి ఉద్దేశం.  ప్రభుత్వ యూజ్ కేసుల కోసం రెగ్యులేటరీ కంట్రోలుతో పాటువిశ్వసనీయమైనఆడిట్‌కు అనువైనజోక్యం చేసుకోవడానికి వీలు ఉండని రీతిలో భద్రతను కల్పించడానికి ప్రాధాన్యాన్ని ఇస్తూఅనుమతి ఆధారిత బ్లాక్‌చైన్ పరిష్కారాల్ని రూపొందించడం కూడా బ్లాక్‌చైన్ ఇండియా చాలెంజి లక్ష్యాలేఎలక్ట్రానిక్ మాధ్యమంలో సేకరణ (-ప్రొక్యూర్‌మెంట్), సరఫరా వ్యవస్థ నిర్వహణప్రజా పంపిణీ వ్యవస్థవిద్యఆరోగ్య సంరక్షణవ్యవసాయంవిద్యుత్తుఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), భూమి రికార్డులుపర్యావరణంస్థిరత్వం వంటి కీలక రంగాల్లో కీలక పాలనసేవల అందజేతలలో ఎదురవుతున్న సవాళ్లపై బ్లాక్‌చైన్ ఇండియా చాలెంజిలో ప్రత్యేకంగా దృష్టి పెడతారుఈ రంగాలు సూచనప్రాయమైనవి మాత్రమే.. వీటి విషయంలో పరిమితులేవీ లేవుప్రస్తావిత రంగాలకు అదనంగా ఇతరత్రా కూడా ప్రభావవంతమైన పరిష్కారాలను ప్రభుత్వ విభాగాల సహకారంతో అంకుర సంస్థలు ప్రతిపాదించేందుకు వీలు ఉంది.
సభను ఉద్దేశించి ఎంఈఐటీవై కార్యదర్శి మాట్లాడుతూబ్లాక్‌చైన్ ప్రభుత్వ సేవల్లో కీలక పాత్రను పోషిస్తుందనీప్రమాణీకరణ యోగ్యతల్ని నిర్ధారించడంతో పాటు అనేక మూలాల నుంచి అందే సమాచారాన్ని ఒకే మూలం ద్వారా విశ్వసనీయంగా మారుస్తుందన్నారుదీంతో పారదర్శకత్వంతో పాటు సామర్థ్యం కూడా పెరుగుతుందని తెలిపారు.  గుర్తించిన 10 యూజ్ కేస్ కేటగిరీలకు అదనంగాప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఏదైనా ఇతర ప్రభావవంతమైన యూజ్ కేసును అంకుర సంస్థలు వెతకవచ్చని ఆయన చెప్పారుఅంకుర సంస్థల సముదాయంలో బ్లాక్‌చైన్ ఇండియా చాలెంజిని విస్తృతంగా వ్యాప్తి చేయడం కోసం పని చేయాల్సిందిగానుప్రభుత్వ విభాగాల్లో ఆచరణీయ పద్దతుల్లో వినియోగించదగిన యూజ్ కేసులను రూపొందించాల్సిందిగాను సీ-డీఏసీఎంఈఐటీవై బృందాలకు ఆయన సూచించారుఆయా యూజ్ కేసుల్ని తరువాత భారత్ అంతటా అమలుపరిచేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.  
ఈ చాలెంజిలో భాగంగాడీపీఐఐటీ గుర్తించిన అంకుర సంస్థలకు ప్రభుత్వ విభాగాల సహకారంతో తమ ఆలోచనలను వాస్తవికప్రభావవంతమైన పరిష్కారాలుగా మార్చడానికి అవకాశం లభిస్తుందిఎంపికైన అంకుర సంస్థలకు ప్రభుత్వ విభాగాల కోసం 10 వేర్వేరు కేటగిరీల పరిధిలో 10 ప్రభావవంతమైన బ్లాక్‌చైన్ ఆధారిత యూజ్ కేసులను అభివృద్ధిపరచడానికి దశల వారీగా ఆర్థిక సహాయాన్ని అందిస్తారుమరిన్ని వివరాల్ని   https://challenge.cdac.in  లో అందుబాటులో ఉంచారు.  
బ్లాక్‌చైన్ ఇండియా చాలెంజిలో పాల్గొని ప్రభుత్వ విభాగాల సహకారంతోఎంపిక చేసిన సేవల రంగాల్ని దృష్టిలో పెట్టుకొని పరిష్కారాలను కనుగొనడానికి నవకల్పనసహిత ఆలోచనలతో ముందుకు రావాల్సిందిగా అర్హత గల అంకుర సంస్థలను ఆహ్వానిస్తున్నారుబ్లాక్‌చైన్ ఇండియా చాలెంజికి సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుకోవడానికి పేర్లను వెంటనే నమోదు చేసుకోవాల్సిందిగా అంకుర సంస్థలను కోరుతున్నారుఅర్హత ప్రమాణాలునమోదు ప్రక్రియఉపయోగానికి సంబంధించిన ఉదాహరణలుమార్గదర్శక సూత్రాలుమేధా సంపత్తి హక్కుల (ఐపీఆర్)తో పాటు ఇతర సంబంధిత వివరాలను తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్  https://challenge.cdac.in ను సందర్శించవచ్చు.

 

***


(రిలీజ్ ఐడి: 2232863) సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी