రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2026 ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారుల టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు నిలిపివేసే అవకాశం


జాతీయ రహదారుల టోల్ ప్లాజాల వద్ద అన్ని చెల్లింపులు ఇకపై కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) వంటి డిజిటల్ పద్ధతుల ద్వారా మాత్రమే స్వీకరణ

నాడు పోస్టు చేయడమైనది: 20 FEB 2026 5:01PM by PIB Hyderabad

సంపూర్ణ డిజిటల్ జాతీయ రహదారి టోల్ వ్యవస్థను అభివృద్ధి చేసే లక్ష్యంతో 2026 ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల టోల్ ప్లాజాలలో నగదు లావాదేవీలను పూర్తిగా నిలిపివేయాలని ఎన్‌హెచ్ఏఐ యోచిస్తోందిఇది అమలులోకి వచ్చిన తర్వాత జాతీయ రహదారుల టోల్ ప్లాజాల వద్ద అన్ని టోల్ చెల్లింపులను కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్వంటి డిజిటల్ పద్ధతుల ద్వారా మాత్రమే స్వీకరించనున్నారుఎలక్ట్రానిక్ టోల్ సేకరణలో ఇప్పటివరకు సాధించిన పురోగతిని మరింత బలోపేతం చేయడానికి.. జాతీయ రహదారి టోల్ ప్లాజా కార్యకలాపాల సామర్థ్యంవిశ్వసనీయతను మెరుగుపరచడానికి ఈ ప్రతిపాదిత మార్పు తీసుకురానున్నానుదీని‌వల్ల లేన్ల సామర్థ్యం పెరగడంటోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గడంటోల్ లావాదేవీలలో మరింత పారదర్శకత రావటంతో జాతీయ రహదారి వినియోగదారులకు 'ప్రయాణ సౌలభ్యంమెరుగుపడుతుంది.

గత కొన్ని సంవత్సరాలుగా ఫాస్టాగ్ వినియోగం 98 శాతానికి పెరిగిందిఇది దేశంలోని టోల్ వసూలు పద్ధతులను గణనీయంగా మార్చివేసిందిప్రస్తుతం అత్యధిక శాతం టోల్ లావాదేవీలు వాహనాలకు అమర్చిన ఆర్ఎఫ్ఐడీ ఆధారిత ఫాస్టాగ్ ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే జరుగుతున్నాయిఇది టోల్ ప్లాజాల వద్ద అంతరాయం లేనిస్పర్శ రహిత ప్రయాణాన్ని సులభతరం చేస్తోందిజాతీయ రహదారి టోల్ ప్లాజాల వద్ద యూపీఐ ద్వారా చెల్లించే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారుదీనివల్ల దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి తక్షణసులభతరమైన డిజిటల్ చెల్లింపు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

జాతీయ రహదారి రుసుం నిబంధనల ప్రకారం టోల్ ప్లాజాలోకి ప్రవేశించే వాహనానికి పని చేసే ఫాస్టాగ్ లేకపోతే వాహనదారుడు నగదు రూపంలోవర్తించే సాధారణ టోల్ రుసుం కంటే రెండు రెట్లు చెల్లించాల్సి ఉంటుందిఒకవేళ వాహనదారులు నగదుకు బదులుగా యూపీఐ ద్వారా చెల్లిస్తే సంబంధిత వాహనానికి వర్తించే రుసుంతో పోల్చితే కేవలం 1.25 రెట్లు మొత్తం మాత్రమే చెల్లించాల్సి ఉంటుందినగదు లావాదేవీలపై ఆధారపడటాన్ని తగ్గించడానికిటోల్ సేకరణ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యానికి ఈ చర్యలు ఎంతగానో దోహదపడ్డాయి.

టోల్ ప్లాజాల స్థాయిలో నిర్వహించిన సమీక్ష ప్రకారం నగదు చెల్లింపులు ట్రాఫిక్ రద్దీకిరద్దీ సమయాల్లో వాహనాలు ఎక్కువ సేపు వేచి ఉండాల్సి రావడంలావాదేవీలకు సంబంధించిన వివాదాలూ తలెత్తుతున్నాయని తేలిందిదేశవ్యాప్తంగా వివిధ జాతీయ రహదారులుఎక్స్‌ప్రెస్‌ రహదారులపై ఉన్న 1,150 కి పైగా టోల్ ప్లాజాల వద్ద నగదు రహితమైన పూర్తి డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు చేయడం ద్వారా నిర్వహణ సామర్థ్యం పెరుగుతుందిఇది ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడమే కాకుండా ప్రయాణంలో జాప్యాన్ని తగ్గించి జాతీయ రహదారి వినియోగదారులందరికీ మెరుగైన అనుభూతిని అందిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2231074) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Malayalam