ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో రియల్-టైమ్ సంజ్ఞా భాష అనువాదంతో ఏఐ- ఆధారిత వాడుకను ప్రస్తావించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 19 FEB 2026 6:14PM by PIB Hyderabad

ఈ రోజు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృత్రిమ మేధ యుగంలో యాక్సెసిబిలిటీసమ్మిళితత్వం పట్ల భారత్ అచంచలమైన నిబద్ధతను స్పష్టం చేశారు.

ఏఐ సాంకేతికత ద్వారా సంజ్ఞా భాషలో రియల్-టైమ్ అనువాదం ప్రారంభమైందిదీని ద్వారా దివ్యాంగులు ఈ కార్యకలాపాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనగలరువిభజలను అనుసంధానించేపౌరులందరినీ శక్తిమంతం చేసే ఆవిష్కరణలకు భారత్ మద్దతునిస్తూనే ఉంటుందని శ్రీ మోదీ తన ప్రసంగంలో ఉద్ఘాటించారు.

ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

"ఏఐ ఇంపాక్ట్ సదస్సు సందర్భంగా నా ప్రసంగంలో ఏఐని ఉపయోగించి సంకేత భాషలో రియల్-టైమ్ అనువాదం గురించి నేను ప్రస్తావించానుఇది ఏఐ రంగంలో యాక్సెసిబిలిటీసమ్మిళితత్వాల పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుందిసాంకేతికతనుప్రజల మధ్య అభిప్రాయాల బదిలీని దివ్యాంగులకూ అందుబాటులో ఉంచేందుకు సదా మేం కృషి చేస్తాం."

 

***


(రిలీజ్ ఐడి: 2230495) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam