ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
డీఎల్ఐ పథకం ద్వారా ఏ సిరీస్-ఏ ఫండింగ్ రౌండ్‌లో 10 మిలియన్ డాలర్లు సమీకరించిన చిప్ డిజైన్ స్టార్టప్ వెర్వ్‌సెమీ మైక్రోఎలక్ట్రానిక్స్
ప్రభుత్వ మద్దతుతో బీఎల్‌డీసీ ఫ్యాన్లు, ఈవీలు, డ్రోన్ల కోసం మోటార్ కంట్రోలర్ చిప్ డిజైన్లను, ఏవియానిక్స్, అంతరిక్ష రంగం కోసం డేటా అక్విజిషన్ చిప్ డిజైన్లను సిద్ధం చేసిన వెర్వ్‌సెమీ
140కు పైగా సెమీకండక్టర్ ఐపీలు, 25 రకాల చిప్‌లు, 10 మంజూరైన పేటెంట్లు,
5 ట్రేడ్ సీక్రెట్లతో బలమైన పోర్ట్‌ఫోలియో కలిగిఉన్న వెర్వ్‌సెమీ
నాడు పోస్టు చేయడమైనది:
18 FEB 2026 4:49PM by PIB Hyderabad
ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో సెమీకండక్టర్ చిప్ డిజైన్ అత్యంత కీలకమైనది. ఇది సిస్టమ్ ఆర్కిటెక్చర్, పనితీరు, నిర్వహణ సామర్థ్యం, భద్రతను నిర్ణయిస్తుంది. మొత్తం విలువలో సగం వరకు వాటా కలిగి ఉండటమే కాకుండా, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ ఖర్చులో (బిఓఎం) 15–35% వరకు ఉంటుంది.
దేశ వ్యూహాత్మక సాంకేతిక లక్ష్యాలలో డిజైన్ కీలక పాత్రను గుర్తిస్తూ, సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ కింద 'డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్'(డీఎల్ఐ) పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందడానికి 24 స్వదేశీ స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈల సెమీకండక్టర్ డిజైన్ ప్రాజెక్టులకు అనుమతి లభించింది. ఈ కంపెనీలు శాటిలైట్ కమ్యూనికేషన్స్, డ్రోన్లు, సర్వైలెన్స్ కెమెరాలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) పరికరాలు, ఎల్ఈడీ డ్రైవర్లు, ఏఐ సిస్టమ్స్, టెలికాం పరికరాలు, స్మార్ట్ మీటర్ల వంటి వివిధ రకాల వ్యూహాత్మక, వాణిజ్య అవసరాల కోసం చిప్‌లను అభివృద్ధి చేస్తున్నాయి.
400కు పైగా సంస్థలు (100కు పైగా స్టార్టప్‌లు, 300 విద్యా సంస్థలు) బెంగళూరు సి-డాక్ (సి- డీఏసీ) లోని అత్యాధునిక చిప్ డిజైన్ టూల్స్ వాడుకునే సదుపాయాన్ని పొందాయి. మొత్తంగా 2.25 కోట్ల గంటల పాటు ఈ టూల్స్ వినియోగం జరిగింది. ప్రపంచంలోనే అత్యధిక వినియోగదారులు ఉన్న కేంద్రాలలో ఇది ఒకటిగా నిలిచింది.
వెర్వ్‌సెమీ మైక్రోఎలక్ట్రానిక్స్
వీటిలో, వెర్వ్‌సెమీ మైక్రో ఎలక్ట్రానిక్స్ భారత ప్రభుత్వ డీఎల్ఐ పథకం కింద అనుమతి పొందిన మొదటి సంస్థగా, అలాగే చిప్స్ టు స్టార్టప్ (సీ2ఎస్) ప్రోగ్రామ్ మద్దతు కలిగిన సంస్థగా నిలిచింది. అంతర్జాతీయ సెమీకండక్టర్ కంపెనీలలో పనిచేసిన అనుభవజ్ఞులు 2017లో ఈ సంస్థను స్థాపించారు.
ఈ సంస్థ 140కు పైగా ఐపీలు, 25 ఐసీ ఉత్పత్తులు, 10 పేటెంట్లు, 5 ట్రేడ్ సీక్రెట్స్ కలిగి ఉంది. ఇది అంతరిక్షం, రక్షణ, పారిశ్రామిక, స్మార్ట్ ఎనర్జీ అవసరాల కోసం చిప్‌లను అభివృద్ధి చేస్తోంది. మరిన్ని వివరాలు https://vervesemi.com/ లో చూడవచ్చు.
వెర్వ్‌సెమీ రూపొందించిన కొన్ని ముఖ్యమైన చిప్‌లు కింద చూడవచ్చు.
|
#
|
చిప్
|
ఫౌండ్రి
|
అప్లికేషన్
|
స్థితి
|
లక్షిత ఉత్పత్తి షెడ్యూల్
|
|
1
|
డేటా అక్విజిషన్ యావియో నిక్ చిప్
(మల్టీ-ఫంక్షన్
|
55nm, యూ ఎంసీ
|
గుర్తించిన అంతరిక్ష రంగ వినియోగదారు
|
తయారీ పూర్తయి, ప్రస్తుతం వినియోగదారుల పరిశీలనలో ఉన్నాయి.
|
2027-Q1
|
|
2
|
బీఎల్డీసి కంట్రోలర్ చిప్ సెట్. చిప్-1 (స్వదేశీ రిస్క్-వి మైక్రోప్రాసెసర్), చిప్-2 (డీసీ-డీసీతో కూడిన క్వాడ్ గేట్ డ్రైవర్ చిప్), చిప్-3 (పవర్ మాస్‌ఫెట్) ద్వారా 90% స్వదేశీ పరికరాల జాబితాతో(బీఓఎం) ఇవి రూపొందాయి.
|
110ఎన్ఎం , యూఎంసీ
|
ఫ్యాన్, ఎక్సాస్ట్, సోలార్, పవర్ ఇన్వెర్టర్
|
తయారీ దశలో ఉన్న కంట్రోలర్ చిప్. గేట్ డ్రైవర్-మాస్‌ఫెట్ చిప్ తయారీ పూర్తయి, ప్రస్తుతం వినియోగదారుల పరిశీలనలో ఉంది..
|
2026 -Q4
|
|
3
|
రిస్క్-వి మైక్రోప్రాసెసర్‌ను ఉపయోగించి రూపొందించిన అత్యంత ఖచ్చితమైన మోటార్-కంట్రోల్ చిప్.
|
55nm, UMC
|
Drones, EV and industrial automation
|
Fabricated and undergoing testing
|
2026 -Q3
|
|
4
|
ఎనర్జీ మీటరింగ్ చిప్
|
180 ఎన్ఎం. టీఎస్ఎం సీ
|
ఎనర్జీ మీటర్
|
తయారీ పూర్తయి, ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది.
|
2026 -Q4
|
|
5
|
బ్రిడ్జి అప్లికేషన్స్ చిప్
|
180ఎన్ఎం, టీఎస్ఎంసీ
|
వేయింగ్ స్కేల్, ఫోర్స్ టచ్ అప్లికేషన్.
|
తయారీ పూర్తయి, ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది.
|
2026 -Q3
|
పెట్టుబడిదారులకు భరోసా - గ్లోబల్ సొల్యూషన్స్‌ను విస్తరించడానికి భారత డీప్-టెక్ ఆవిష్కరణలకు మద్దతు.
పెట్టుబడిదారు ఆశిష్ కచోలియా, యునికార్న్ ఇండియా వెంచర్స్ నేతృత్వంలో జరిగిన సిరీస్-ఏ ఫండింగ్ రౌండ్‌లో వెర్వ్‌సెమీ 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 90 కోట్లు) నిధులను సేకరించినట్లు ఈరోజు ప్రకటించింది. రూట్స్ వెంచర్స్, కేపర్రైజ్ ఫినా, ఎంఏఐక్యూ గ్రోత్ స్కీమ్ కూడా ఇందులో పాల్గొన్నాయి.
ఈ నిధులు మూడు వ్యూహాత్మక రంగాలలో వినియోగం అవుతాయి. మొదటిది- ఇండస్ట్రియల్, స్మార్ట్ ఎనర్జీ, మోటార్ కంట్రోల్, ఏవియానిక్స్ అప్లికేషన్ల కోసం మెషిన్ లెర్నింగ్ ఆధారిత అనలాగ్ సిగ్నల్ చైన్ చిప్ పోర్ట్‌ఫోలియోను వాణిజ్యపరంగా వేగవంతం చేస్తారు. ఇందులో అత్యాధునిక డేటా కన్వర్టర్లు, ఇంటెలిజెంట్ పవర్ సెన్సింగ్ సొల్యూషన్స్ ఉన్నాయి.
రెండోది - ప్రస్తుతం ఉన్న సిలికాన్ (చిప్స్) ఉత్పత్తికి సిద్ధం చేయడం, వాటి నాణ్యతను ధ్రువీకరించడం కోసం ఈ పెట్టుబడిని ఉపయోగిస్తారు. దీనితో పాటు, ప్రపంచవ్యాప్త వినియోడారులకు సేవలు అందించడానికి ఇంజనీరింగ్, అప్లికేషన్స్ బృందాలను విస్తరించనున్నారు.
మూడవదిగా, కంపెనీ తన ఐపీ పోర్ట్‌ఫోలియోను విస్తరించడంతో పాటు, నెక్స్ట్ జనరేషన్ ప్రెసిషన్ అనలాగ్ ఆర్కిటెక్చర్స్‌లో పరిశోధన, అభివృద్ధిని బలోపేతం చేయనుంది. అదే సమయంలో ఆసియా, అమెరికా, ఇతర కీలక సెమీకండక్టర్ మార్కెట్లలో తన ఉనికిని చాటుకుంటూ, ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఓఈఎంలు), సిస్టమ్ కంపెనీలతో నేరుగా భాగస్వామ్యాలను ఏర్పరచుకోనుంది.
వెర్వ్‌సెమీలో జరిగిన ఈ పెట్టుబడి ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేస్తోంది: డీఎల్ఐ పథకం ద్వారా అందుతున్న నిర్మాణాత్మక మద్దతు, పెట్టుబడిదారులలో నమ్మకాన్ని బలపరిచింది. ఇది కంపెనీల వాణిజ్య సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, డీఎల్ఐ ఆమోదం పొందిన సంస్థలలో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులను చురుకుగా ప్రేరేపిస్తోంది.
ప్రకటన నుంచి ఆచరణ వరకు: సాకారమవుతున్న భారత డిజైన్ ఆధారిత సెమీకండక్టర్ దార్శనికత
ఫ్యాన్లు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వంటి వాటి కోసం ఉద్దేశించిన బీఎల్డిసి మోటార్ కంట్రోలర్ ప్రాజెక్టును 2025 మార్చి 20న కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ వెర్వ్‌సెమీ సంస్థకు అందజేశారు.
భారతదేశం ఒక ఉత్పత్తి దేశంగా ఎదగాలంటే మనం సామూహికంగా మూడు విధానాలను అవలంబించాలని అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మొదటిది, సేవా దేశంగా (సర్వీస్ నేషన్) గా భారత్ ఇప్పటికే గొప్ప విజయాన్ని సాధించింది. అయితే, ఇప్పుడు మనం తదుపరి దశకు చేరుకోవాలి. స్వదేశీ సాఫ్ట్‌వేర్ హార్డ్‌వేర్ పరిష్కారాలను అభివృద్ధి చేయడం ఆ దిశగా ఒక ముఖ్యమైన అడుగు. రెండోది- ఆవిష్కరణలు అనేవి కేవలం కొన్ని సంస్థలకే పరిమితం కాకుండా విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, విద్యార్థులు పరిశోధకులతో కూడిన ఒక విస్తృతమైన వ్యవస్థ ద్వారా ఉద్భవించాలి. మూడవది - అభివృద్ధి విధానం అనేది క్రమవద్ధతిలో సాగాలి. సాంకేతికతలోని అన్ని విభాగాలకు అందాలి. ఇది బీఎల్డిసి మోటార్ కంట్రోలర్ల వంటి భారీ స్థాయిలో వినియోగించే చిప్‌ల నుంచి , ఆర్ఐఎస్ సీ- వీ ఆర్కిటెక్చర్ వంటి వ్యూహాత్మక వేదికల వరకు విస్తరించాలి. దీనివల్ల మన దేశంలోనే సొంతంగా సీపీయూలు, జీపీయూలు, స్థిరమైన సాంకేతిక ఉత్పత్తులను డిజైన్ చేసుకునే సామర్థ్యం లభిస్తుంది.
ముగింపు
మంత్రి ఈ ప్రకటన చేసిన ఏడాదిలోపే, పెట్టుబడులను ఆకర్షించడంలో, వినియోగదారుల ఆదరణ పొందడంలో వెర్వ్‌సెమీ సాధించిన పురోగతి డీఎల్ఐ మద్దతు ఉన్న సంస్థలు మల్టిపుల్ చిప్ టేప్-అవుట్లు, సిలికాన్-ప్రూవెన్ డిజైన్‌లు, పేటెంట్లు, పునర్వినియోగపరచదగిన ఐపీలు, శిక్షణ పొందిన ప్రతిభ, కార్యాచరణ డిజైన్ మౌలిక సదుపాయాలను అందిస్తున్నాయని నిరూపిస్తోంది. ఇది క్షేత్రస్థాయిలో స్పష్టమైన ప్రభావాన్ని చూపుతోంది.
ఈ వ్యవస్థ ఉత్పత్తి దశలోకి ప్రవేశిస్తున్న తరుణంలో, సిలికాన్ ధృవీకృత డిజైన్‌లు భారీ స్థాయి తయారీ, వినియోగం వైపు కదులుతాయి. ఇది భారతీయ కంపెనీలను విశ్వసనీయమైన ప్రపంచ సరఫరాదారులుగా నిలబెట్టడమే కాకుండా, దేశీయ సరఫరా వ్యవస్థలను, స్వయం సమృద్ధిని బలోపేతం చేస్తుంది.
దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, సరఫరా శ్రేణిలో అంతరాయాలను తట్టుకోగల సామర్థ్యాన్ని పెంచడం, రక్షణ, టెలికాం, ఏఐ, మొబిలిటీ వంటి రంగాలకు అవసరమైన కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచడం ద్వారా డీఎల్ఐ పథకం భారత్ ను వ్యూహాత్మక చిప్ డిజైన్ విభాగంలో పటిష్టంగా నిలబెడుతోంది. దీని ద్వారా దేశం దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని సాధించేందుకు మార్గం సుగమమవుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2230009)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7