ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

బాధ్యతాయుత ఆవిష్కరణల పట్ల భారత దార్శనికత ప్రపంచ భవిష్యత్ ఏఐ ప్రయాణానికి మార్గదర్శి


ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో భారత ఏఐ గవర్నెన్స్ విజన్‌ను ఆవిష్కరించిన శ్రీ అశ్వినీ వైష్ణవ్

బాధ్యతాయుత ఏఐ కోసం కార్యాచరణ ప్రణాళికలను అందించనున్న వర్కింగ్ గ్రూపులు

నాడు పోస్టు చేయడమైనది: 18 FEB 2026 7:43PM by PIB Hyderabad

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 3వ రోజు ప్రారంభ సమావేశం సదస్సు వర్కింగ్ గ్రూపుల ద్వారా కీలకమైన ఫలితాల గురించిన సంభాషణలతో ప్రారంభమైందిఇది ప్రపంచ ఏఐ ప్రాధాన్యాల కోసం సహకారాత్మక చర్యలకు వేదికను అందించిందిప్రజలుభూమిపురోగతి వంటి సూత్రాల మార్గనిర్దేశంలో ఈ సదస్సు ఏడు థీమాటిక్ వర్కింగ్ గ్రూపులు (చక్రాలుకేంద్రంగా తన ఎజెండాను రూపొందించిందిఈ సమూహాలు గత కొద్ది నెలలుగా ప్రపంచ ఏఐ ప్రాధాన్యాల కోసం సహకారాత్మక చర్యలను కొనసాగించే లక్ష్యంతో కేంద్రీకృత ఏఐ ఫలితాలపై చర్చించాయి.

ప్రారంభ సమావేశంలో ప్రసంగించిన గౌరవ కేంద్ర ఎలక్ట్రానిక్స్సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్, "ఈ ఇంపాక్ట్ సదస్సును మించి మనం ముందుకు సాగి మన ఎజెండాను నిర్దేశించుకుంటున్నప్పుడుఏడు అద్భుత ఇతివృత్తాలను కలిగిన ఈ వర్కింగ్ గ్రూపుల ఫలితాలు మనం ముందుకు సాగడానికి మార్గదర్శక దీపాలుగా పనిచేస్తాయిరాబోయే రోజుల్లో మన సహకారంఆవిష్కరణలుబాధ్యతాయుత ఏఐ వ్యవస్థలను నిర్మించడం కొనసాగించాల్సిన తీరును అవి రూపొందిస్తాయిఅని అన్నారు.

ఎలక్ట్రానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్కృష్ణన్ మాట్లాడుతూ, “ఈ సమయాన్ని మనం జాగ్రత్తగా ఆశావాదంతో సమీపిస్తున్నాంఏఐ సామర్థ్యాన్ని స్వీకరిస్తూనే ప్రమాదాలుప్రమాణాలుపాలనమరీ ముఖ్యంగా ఏఐ చర్చను రూపొందించడంలో అన్ని ప్రపంచస్థాయి గళాలకు సాధికారత కల్పించేలా చూసుకుంటున్నాం” అన్నారు.

ప్రారంభ సమావేశం తర్వాత ఒక క్లోజ్డ్ డోర్ సమావేశం జరిగిందిఈ సమావేశంలో వర్కింగ్ గ్రూప్ డెలివరీలను గురించి వాటాదారులతో మరింత లోతుగా చర్చించారుఈ చర్చల ద్వారా పొందిన అభిప్రాయాలుసిఫార్సులను రాబోయే రోజుల్లో అధికారికంగా వెల్లడిస్తారు.

ప్రపంచస్థాయి నైపుణ్యంభాగస్వామ్య దృక్పథాలను కార్యాచరణ ప్రణాళికలుగా మార్చడానికి భారత్ చేస్తున్న కృషిని ఈ ఏడు థీమాటిక్ చక్రాలు ప్రతిబింబిస్తాయిఅవి మానవ మూలధనం... సామాజిక సాధికారత కోసం సమ్మిళితత్వం... సురక్షితమైనవిశ్వసనీయమైన ఏఐ... సమర్థతఆవిష్కరణలు-సామర్థ్యం... సైన్స్ఏఐ వనరుల ప్రజాస్వామ్యీకరణ... ఆర్థిక వృద్ధిసమాజ హితంల కోసం ఏఐ.

ఈ వర్కింగ్ గ్రూపులు ప్రభుత్వంవిద్యాసంస్థలుపరిశ్రమలుపౌర సమాజంఅంతర్జాతీయ భాగస్వాముల నుంచి నిపుణులను నియమించుకున్నాయినెలల తరబడి సంప్రదింపులుఆధారాల ఆధారిత సంభాషణల ద్వారా ఆచరణీయ ఫలితాలను రూపొందిస్తున్నాయిఏఐ విధానంఆచరణలో విజన్ నుంచి అమలు వరకు సదస్సు పరివర్తనను బలోపేతం చేస్తున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2230004) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Kannada , Malayalam