ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్ 2026.. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల ద్వారా ఏఐ సేవలు విస్తరిస్తున్న తరుణంలో మానవ కేంద్రీకృత పాలనకు ప్రపంచ దేశ నేతల ప్రాధాన్యత


ప్రపంచ దేశాల ఏఐ పాలనపై భారత డిజిటల్ ఆశయాల ప్రభావం: ఎస్టోనియా రిపబ్లిక్ అధ్యక్షుడు అలార్ కారిస్

గ్లోబల్ సౌత్ దేశాల సమ్మిళిత చర్చల ప్రాముఖ్యతను చాటి చెప్పిన ఇండియా ఏఐ సమ్మిట్

प्रविष्टि तिथि: 18 FEB 2026 5:56PM by PIB Hyderabad

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 మూడో రోజున డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల్లో (డీపీఐసురక్షితమైనబాధ్యతాయుతమైన ఏఐ పాలన అంశంపై జరిగిన చర్చలో ప్రపంచ దేశాల నాయకులునిపుణులు పాల్గొన్నారుప్రజాప్రయోజన వ్యవస్థల్లో కృత్రిమ మేథను సురక్షితంగాజవాబుదారీతనంతోఅందరికీ అందుబాటులో ఉండేలా ఎలా అనుసంధానించవచ్చనే అంశాలపై చర్చించారు.

ఆరోగ్యంవిద్యసామాజిక రక్షణప్రభుత్వ పరిపాలన వంటి రంగాల్లో సేవలందించటానికి డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు కీలకంగా మారుతున్న తరుణంలో.. నిర్ణయాధికారాన్నివనరుల కేటాయింపునుహక్కుల వినియోగాన్ని ఏఐ పెద్దఎత్తున ప్రభావితం చేస్తుందని ఈ సమావేశం స్పష్టం చేసిందిఈ క్రమంలో విశ్వసనీయతచట్టబద్ధతజవాబుదారీతనం వంటివి సాంకేతిక చేరికలు మాత్రమే కాదు.. పాలనకు ప్రాథమిక సూత్రాలు.

డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల రంగంలో భారత నాయకత్వాన్ని ఎస్టోనియా రిపబ్లిక్ అధ్యక్షుడు అలార్ కారిస్ ప్రశంసించారుసాంకేతికతపాలనసమ్మిళిత వృద్ధి అంశాల్లో ప్రపంచానికి భారత్ దిశానిర్దేశం చేస్తుందని ఆయన అన్నారుఆధునిక ప్రభుత్వాల సామర్థ్యానికి డీపీఐ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేసిన ఎస్టోనియా రిపబ్లిక్ అధ్యక్షుడు హెచ్.ఈ అలార్ కారిస్.. "డిజిటల్ మౌలిక సదుపాయాలు కేవలం సేవలందించే సాంకేతిక వ్యవస్థే కాదు.. ఆధునిక దేశాల పనితీరుకు ఎంతో కీలకంఈ వ్యవస్థల్లో ఏఐని వినియోగించినప్పుడు.. అల్గారిథమ్పారదర్శకతమానవ పర్యవేక్షణ వంటివి కేవలం అదనపు ఆప్షన్లు కావు.. ప్రజల విశ్వసనీయతచట్టబద్ధతను కాపాడే తప్పనిసరి నిబంధనలుఅని పేర్కొన్నారు.

స్విట్జర్లాండ్ స్టేట్ సెక్రటరీఫెడరల్ ఆఫీస్ ఫర్ కమ్యూనికేషన్స్ అధ్యక్షుడు హెచ్.ఈ బెర్నార్డ్‌ మైసెన్ మాట్లాడుతూ.. ఏఐ ఆధారిత పాలనలో ప్రభుత్వ సంస్థల బాధ్యతను తెలియజేశారు. "ప్రపంచవ్యాప్తంగా సుపరిపాలనకు ఏఐని ఉపయోగించటంలో అంతర్జాతీయ సహకారంసామర్థ్య పెంపుదల కీలకమైన అంశాలుదేశాల మధ్య ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకోవటం వల్ల నేర్చుకోవటానికివృద్ధి చెందటానికి అవకాశముంటుందిగ్లోబల్ సౌత్ దేశాల ఏకాభిప్రాయ చర్చల విలువను ఇండియా ఏఐ సమ్మిట్ చాటిచెప్పిందిడిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు.. మానవ హక్కులుజవాబుదారీతనంసమ్మిళితత్వంపారదర్శకత వంటి అత్యున్నత ప్రమాణాలను ప్రతిబింబించాలిప్రైవేటు సంస్థలు అభివృద్ధి చేసిననిర్వహించిన ఏఐ వ్యవస్థల మద్దతుతో తీసుకునే నిర్ణయాలకు ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలిజవాబుదారీతనం లేనప్పుడునమ్మకం నిలబడదుఅని తెలిపారు.

డిజైన్ ద్వారానే భద్రతా ప్రమాణాలుండాల్సిన అవసరాన్ని లిథువేనియా వైస్ మినిస్టర్ హెచ్.ఈ టౌరిమాస్ వాలీస్ స్పష్టం చేశారు. "బలమైన ప్రభుత్వ రంగ వ్యవస్థల ద్వారానే బాధ్యతయుతమైన ఏఐ ప్రారంభమవుతుందిడిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల్లో వినియోగించే ఏఐ.. నిఘా కోసమోవివక్ష చూపటానికి సాధనంగా మారకూడదుసాంకేతికత ప్రజలకు సేవ చేయాలి కానీసాంకేతికతకు ప్రజలు బానిసలు కాకూడదువ్యవస్థల రూపకల్పనల్లోనే సమ్మిళితత్వం ఉండాలిఅని వ్యాఖ్యానించారు.

నెదర్లాండ్స్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కృత్రిమ మేథ రాయబారి హెచ్.ఈ హ్యారీ వెర్వీజ్ మాట్లాడుతూ.. డీపీఐలోని ఏఐ పాలన ప్రజాస్వామ్య చట్టబద్ధతకు కీలకమని వివరిస్తూ, "డిజిటల్ మౌలిక సదుపాయాల్లో ఏఐ పాలన.. ప్రజల నమ్మకంప్రజాస్వామ్య చట్టబద్ధతకు సంబంధించిన అంశంమానవ హక్కులుపారదర్శకతజవాబుదారీతనంసమ్మిళితత్వం వంటివి అదనంగా చేర్చుకునే ఐచ్ఛికాలు కావువ్యవస్థ రూపకల్పనలో ఉండాల్సిన ప్రాథమిక సూత్రాలుగౌరవంనిజాయితీ విలువల కంటే సామర్ధ్యం ముఖ్యం కాకూడదుఅని అన్నారు.

ప్రతినిధి బృందాలు అధిపతుల ప్రసంగాల అనంతరం జరిగిన ప్యానెల్ చర్చలో ఆచరణాత్మక పాలనా వ్యవస్థలుప్రక్రియల్లో జవాబుదారీతనంగ్లోబల్ సౌత్ దేశాల్లోని అనుభవాలను విశ్లేషించారుహక్కులను గౌరవించేమానవ కేంద్రీకృత పాలనా వ్యవస్థలపై ప్రధానంగా ఈ చర్చ దృష్టి సారించిందిఇందులో భాగంగా అల్గారిథమిక్ పారదర్శకతప్రభావ అంచనాలుఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలుభాగస్వామ్య రూపకల్పన ప్రక్రియలపై చర్చించారుఅమలు తర్వాత కాకుండా ముందుగానే పాలనపరమైన వైఫల్యాలు ఎదురవుతాయనిసంస్థాగత రూపకల్పనరాజకీయ నిర్ణయాధికార స్థాయిలోనే అంటే ప్రారంభ దశలోనే జవాబుదారీతనం ఉండటం అత్యవసరమని స్పష్టం చేశారు.

ఈ ప్యానెల్‌లో టెక్ గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ప్రోగ్రామ్స్పార్ట్‌నర్‌షిప్స్ హెడ్ ప్రతీక్ వాఘ్రేడెరెచోస్ డిజిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జువాన్ కార్లోస్ లారాగూగుల్ గ్లోబల్ హెడ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అలెగ్జాండ్రియా వాల్డెన్జర్మనీ ఫెడరల్ ఫారిన్ ఆఫీస్‌లోని ఏఐడిజిటల్ టెక్నాలజీస్ ఇన్ ఫారిన్ పాలసీ కోఆర్డినేషన్ స్టాఫ్ డిప్యూటీ హెడ్ నార్మన్ షుల్జ్ పాల్గొన్నారు.

యూరప్గ్లోబల్ సౌత్ దేశాల అనుభవాలను పరిగణలోకి తీసుకునిడిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల్లో వినియోగించే ఏఐ.. ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని బలోపేతం చేయటానికిమానవ హక్కులను కాపాడేందుకుపెద్ద ఎత్తున ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించటానికి సమ్మిళిత ప్రపంచ వేదికలుఉమ్మడి ప్రమాణాలు అత్యవసరమని ఈ సెషన్ స్పష్టం చేసిందివివిధ దేశాలు ప్రభుత్వ వ్యవస్థల్లోకి ఏఐని విస్తరిస్తున్న తరుణంలో సాంకేతిక సామర్థ్యంతో పాటు బాధ్యతాయుతమైన పాలన వృద్ధి చెందాలని ఈ చర్చ స్పష్టం చేసిందిఈ డిజిటల్ పరివర్తనలో ప్రజలుహక్కులువిశ్వసనీయత కీలకంగా ఉండాలని పేర్కొంది.

 

***


(रिलीज़ आईडी: 2230003) आगंतुक पटल : 60
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Kannada