ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

అందరికీ కృత్రిమ మేధ సేవలు అందించాలని స్పష్టం చేసిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026.. సమ్మిళిత, భారీ స్థాయి కృత్రిమ మేధ పరిష్కారాల కల్పనలో గ్లోబల్ ఇంపాక్ట్ చాలెంజి


వాస్తవిక జగతి లోని సవాళ్ల పరిష్కారానికి పోటీ పడుతున్న ప్రపంచ వ్యాప్త నూతన ఆవిష్కర్తలు

గెలిచిన జట్లకు శిఖరాగ్ర సదస్సు ముగింపు కార్యక్రమంలో పురస్కారాలతో, అనుబంధ విస్తారిత వ్యవస్థ చేయూతతో సత్కారం

నాడు పోస్టు చేయడమైనది: 17 FEB 2026 10:08PM by PIB Hyderabad

అందరికీ కృత్రిమ మేధ సేవలు: గ్లోబల్ ఇంపాక్ట్ చాలెంజ్ అంశాన్ని ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’లో రెండో రోజు ప్రధానంగా చర్చించారు. ఇది ఇండియాఏఐ మిషన్‌కు చెందిన ప్రధాన కార్యక్రమాలలో ఒకటి. సామాజిక అభివృద్ధి సాధనకు కీలకంగా ఉన్న రంగాల్లో పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపగల సామర్థ్యాన్ని కలిగివుండే కృత్రిమ మేధ సంబంధిత పరిష్కారాల్ని గుర్తించి, శరవేగంగా అమల్లోకి తీసుకు వచ్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.  ఈ చాలెంజి.. శిఖరాగ్ర సదస్సు సమగ్ర అజెండాలో ఓ భాగం. ఇది సమ్మిళిత, స్థిర, ప్రజాప్రయోజనకర ఫలితాల కోసం కృత్రిమ మేధను ఉపయోగించడం, ప్రజలూ, భూగ్రహమూ, పురోగతీ అనే మౌలిక సిద్ధాంతాల్ని పటిష్ఠపరచడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటిస్తోంది.

వాస్తవిక ప్రపంచానికి ఉపయోగపడే ఫలితాల రూపురేఖల్ని కృత్రిమ మేధ సంబంధిత ప్రతిష్టాత్మక కాంక్షను ఎలా సంతరించాలనే లక్ష్యంతో, ‘ఏఐ ఫర్ ఆల్: గ్లోబల్ ఇంపాక్ట్ చాలెంజ్’ను నిర్వహిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, మొబిలిటీ, వ్యవసాయం, వాతావరణం స్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ, విద్య, అందరికీ ఆర్థిక సేవల అందుబాటు సహా ప్రాధాన్య రంగాల్లో గణనీయ మార్పులను తీసుకురావడంతో పాటు పరిష్కారాల్ని ప్రతిపాదించడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రపంచ వ్యాప్త విద్యార్థుల్నీ, పరిశోధకుల్నీ, అంకుర సంస్థల్నీ, వృత్తినిపుణుల్నీ ఆహ్వానించారు. డిపార్ట్‌మెంట్ ఫర్ ఇండస్ట్రీ ప్రమోషన్, ఇంటర్నల్ ట్రేడ్‌లో భాగంగా ఉన్న ‘స్టార్టప్ ఇండియా’తో పాటు డిజిటల్ ఇండియా భాషిణి విభాగం.. ఈ  రెండు సంస్థల భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న ఈ చాలెంజ్.. రంగంలో మోహరించడానికి సిద్ధంగా ఉన్న, పెద్ద స్థాయులలో ప్రభావాన్ని  చూపగలిగిన నూతన ఆవిష్కరణలపై దృష్టిని కేంద్రీకరించింది.

ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి బలమైన ప్రతిస్పందన వచ్చింది. దీనిలో డొమైన్ నిపుణులు, విధాన రూపకర్తలు, పరిశ్రమ రంగ ప్రముఖులు ఒక కఠినమైన బహుళ అంచెల మూల్యాంకన ప్రక్రియ ద్వారా వందల కొద్దీ సమర్పణల మూల్యాంకనాన్ని పూర్తి చేశారు. అగ్రగామి పదిగా ఎంపికైన పరిష్కారాలు సామాజిక అవసరాల్ని తీర్చే కృత్రిమ మేధ అప్లికేషన్ల విస్తృతికి అద్దం పట్టాయి. వీటిలో.. ఇన్ఫీహీల్ హెల్త్‌టెక్, ఇన్‌ఫియస్ హెల్త్‌కు చెందిన ఈక్విట్‌విన్, వన్ గ్లోబల్ మెడికల్ టెక్నాలజీ (డీబీఏ హీలియం హెల్త్), రిజిలియన్స్360, క్లైమేట్-స్మార్ట్ రుణ మంజూరు కోసం శాట్‌శ్యూర్‌‌కు చెందిన ఫార్మ్ స్కోర్, మెరుగైన మానసిక స్వస్థత కోసం ఉద్దేశించిన వైసాకు చెందిన కాన్వర్సేషనల్ ఏఐ, కిదౌరా ఇన్నొవేషన్స్, మధుమేహ రెటీనోపతీని  పరీక్షించడానికి ఉద్దేశించిన మధునేత్ర్ఏఐ, కార్బ్‌జీఈఎమ్ ఇంక్.తో పాటు బయోమ్ మేకర్స్ ఇంక్.కు చెందిన బీక్రాప్® సాయిల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ ఉన్నాయి.

image.png
‘‘అభివృద్ధి కోసం తపిస్తున్న దేశాల్లో ప్రగతికి ఊతాన్నిచ్చే ఉద్దేశాలను ముందుకు తీసుకు పోవడానికి కృత్రిమ మేధను సద్వినియోగపరుచుకోవడం’’ అంశంపై బృంద చర్చ దృశ్యం.

సవాలును పూర్తి చేయడంలో భాగంగా ‘‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రగతికి ఊతాన్నిచ్చే ఉద్దేశాలను ముందుకు తీసుకు పోవడానికి కృత్రిమ మేధను సద్వినియోగపరుచుకోవడం’’ అంశంపై ఓ ఉన్నత స్థాయి బృంద చర్చను నిర్వహించారు. ఈ చర్చలో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు ప్రాజెక్ట్ లీడరు శ్రీ  గౌరవ్ ఝా, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీలో ఎస్‌టీఐ, డీఎక్స్ కార్యాలయ సీనియర్ డైరెక్టరు శ్రీ టోమొయుకీ యామాదా, ఐడియాబాజ్ సహ వ్యవస్థాపకుడు, సీఓఓ శ్రీ ముదిత్ కుమార్, ఏంత్రోపిక్‌లో గ్లోబల్ ఇంపాక్ట్ లీడ్ కర్ట్‌నీ  ఓడానెల్, బీ క్యాపిటల్‌కు చెందిన జనరల్ పార్ట్‌నర్ శ్రీ కరణ్ మోహ్‌లా, ఇండియాఏఐ మిషన్ గవర్నింగ్ బోర్డు శ్రీ రమణన్ రామనాథన్‌ పాలుపంచుకున్నారు. చర్చ సందర్భంగా ప్రారంభిక దశలోని కృత్రిమ మేధ రంగ అంకుర సంస్థల ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు. దీంట్లో డిజైన్ భాగస్వాముల్ని సురక్షితంగా ఉంచడం, వాణిజ్య పరమైన గిరాకీని ప్రామాణీకరించడం, అధిక నాణ్యత కలిగివుండే డేటాసెట్ల వరకు చేరుకోవడం భాగంగా ఉన్నాయి. నూతన ఆవిష్కర్తలకూ, మార్కెట్లకూ మధ్య ఒక ప్రధాన సంధానకర్త భూమిక ప్రభుత్వానిదని వక్తలు స్పష్టం చేశారు. సమ్మిళిత అభివృద్ధిని సాధించడం కోసం బాధ్యతాయుత కృత్రిమ మేధను ప్రోత్సహించానికి ఆంక్షలంటూ ఉండని ప్లాట్‌ఫారాలు, సహకార పూర్వక అనుబంధ విస్తారిత వ్యవస్థలతో పాటు నమ్మకం ప్రధానంగా పని చేసే ప్రణాళికలు ఎంతయినా అవసరమని వారు ఉద్ఘాటించారు.
తుది పోటీకి ఎంపికైన వర్గాల పేర్లను ప్రకటించి, ఈ చాలెంజిని ముగించారు. ఈ వర్గాలు వాటి పరిష్కారాల్ని సమ్మిట్ గ్రాండ్ ఫినాలేతో పాటు పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో నివేదిస్తాయి. గెలిచిన జట్లు రూ.2.50 కోట్ల వరకూ ఆర్థిక ప్రోత్సాహకాలను అందుకోనున్నాయి. దీంతో పాటు జాతీయ స్థాయిలోనూ, ప్రపంచ స్థాయిలోనూ సామర్థ్యాన్ని పెంచడానికి వాటికి మార్గదర్శకత్వాన్నీ, ప్రయోగాత్మక అవకాశాల్నీ, వ్యూహాత్మక భాగస్వామ్యాల్నీ, అనుబంధ విస్తారిత వ్యవస్థ పరమైన సహాయాన్నీ అందిస్తారు.
‘ఏఐ ఫర్ ఆల్: గ్లోబల్ ఇంపాక్ట్ చాలెంజ్’ వంటి కార్యక్రమాల ద్వారా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 చర్చల్నీ, మోహరింపునీ జత కలిపే ప్రక్రియను కొనసాగిస్తుంది. అంతేకాదు, డిజైన్ ద్వారా సమ్మిళిత, స్థిర ప్రభావాన్ని చూపగల, దీర్ఘకాలం పాటు సార్వజనిక హితంతో ముడిపడిన కృత్రిమ మేధ సంబంధిత పరిష్కారాల్ని ముందుకు తీసుకుపోతూనే ఉంటుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2229574) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Kannada