పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బారామతిలో జరిగిన లియర్‌జెట్‌ 45 (వీటీ-ఎస్ఎస్‌కే) విమాన ప్రమాద దర్యాప్తునకు సంబంధించి ఏఏఐబీ విడుదల చేసిన తాజా సమాచారం

प्रविष्टि तिथि: 17 FEB 2026 11:28AM by PIB Hyderabad

జనవరి 28, 2026న బారామతిలో జరిగిన లియర్‌జెట్‌ 45 (వీటీ-ఎస్ఎస్‌కేవిమాన ప్రమాదంపైవిమాన ప్రమాద పరిశోధన సంస్థ (ఏఏఐబీసమగ్ర విచారణ చేపడుతోందిఈ విచారణను విమాన (ప్రమాదాలుసంఘటనల పరిశోధననిబంధనలు-2017, ఐసీఏఓ అనెక్స్ 13 అంతర్జాతీయ ప్రమాణాలుసిపార్సు పద్ధతులకు లోబడి నిర్వహిస్తోంది.

విమానంలో రెండు స్వతంత్ర ఫ్లైట్ రికార్డర్లు ఉన్నాయిఈ రెండూ దీర్ఘకాలం పాటు అధిక వేడికి గురవటంతో ప్రమాద సమయంలో అగ్ని ప్రమాదం వల్ల దెబ్బతిన్నాయి.

ఎల్3-కమ్యూనికేషన్స్ సంస్థ తయారు చేసిన డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (డీఎఫ్‌డీఆర్నుంచి డేటాను ఫ్లైట్ రికార్డర్ లాబొరేటరీలో ఏఏఐబీ విజయవంతంగా డౌన్‌లోడ్ చేసిందిహనీవెల్ సంస్థకు చెందిన కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్)కు ప్రస్తుతం సాంకేతిక పరీక్ష నిర్వహిస్తుందిడేటా వెలికితీతలో ప్రత్యేక సాంకేతిక సహకారం కోసం ఆ పరికరాలను తయారు చేసిన దేశానికి సంబంధించిగుర్తింపు పొందిన ప్రతినిధి సహాయాన్ని కోరింది.

నిష్పక్షపాతంగాపక్కా ఆధారాలతో సమగ్ర విచారణను నిర్వహించేందుకు అన్ని సాంకేతిక పద్ధతులనునిబంధనలను ఏఏఐబీ కచ్చితంగా పాటిస్తోందిఈ విషయంలో పారదర్శకతకు కట్టుబడి ఉన్నామనివిచారణలో పురోగతిని బట్టి తదుపరి వివరాలను వెల్లడిస్తామని సంస్థ తెలిపింది.

నిబంధనలకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగేలా సహకరించాలనిఅప్పటివరకు ఎలాంటి ఊహాగానాలకు అవకాశం ఇవ్వకూడదని అన్ని వర్గాలను ఏఏఐబీ కోరింది.

 

***


(रिलीज़ आईडी: 2229369) आगंतुक पटल : 71
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , Marathi , हिन्दी , Bengali , Tamil , Malayalam