ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉక్కు పరిశ్రమలో నిజమైన, ఆచరణాత్మక ఆవిష్కరణల అభివృద్ధికి ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ వేదికగా ఏఐ స్టార్టప్‌లకు ఉక్కు మంత్రిత్వ శాఖ ఆహ్వానం

प्रविष्टि तिथि: 17 FEB 2026 3:30PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని భారత మండపంలో ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖఅనుబంధ ప్రభుత్వ రంగ సంస్థలు భాగస్వామ్యం వహిస్తున్నాయి.

గనులుఉక్కు రంగాల్లోని కీలక సవాళ్లను తెలియజేసేందుకు ఈ సమ్మిట్‌లో ప్రత్యేక స్టాల్‌ను మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందిఉక్కు రంగ విలువ వ్యవస్థ వ్యాప్తంగా సామర్థ్యంఉత్పాదకతసుస్థిరతభద్రతను మెరుగుపరిచేందుకు ఆచరణాత్మకసమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు కృత్రిమ మేథ (ఏఐఆధారిత అంకుర సంస్థలనుఆవిష్కర్తలను ఆహ్వానించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.

భారతదేశ పారిశ్రామిక పరివర్తనను వేగవంతం చేయటానికిసాంకేతిక నాయకత్వాన్ని బలోపేతం చేయటానికిఆవిష్కరణల ఆధారిత వృద్ధిని ప్రోత్సహించటానికి కృత్రిమ మేథను వినియోగించుకోవాలనే గౌరవ ప్రధానమంత్రి దృక్పథానికి అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంది.

ఉక్కు రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించటానికిపరిశ్రమల భాగస్వాములకువర్ధమాన సాంకేతిక సంస్థలకు మధ్య అర్థవంతమైన భాగస్వామ్యాన్ని ఈ వేదిక ద్వారా పెంపొందించాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

 

 

ఈ కార్యక్రమంలో క్రీయాశీలకంగా పాల్గొని ఉక్కు రంగం కోసం వినూత్న పరిష్కారాలను రూపొందించేందుకు సహకరించవలసిందిగా ఏఐ అంకుర సంస్థలనుఆవిష్కర్తలను మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోందిసాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందినఆవిష్కరణలే ప్రాతిపదికగా సాగే స్వావలంబన భారత్ లక్ష్యాన్ని సాధించటంలో ఇటువంటి భాగస్వామ్యాలు కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ సమ్మిట్‌లో భాగంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), ఎన్‌ఎండీసీ వంటి సీపీఎస్‌ఈల చైర్మన్లుమేనేజింగ్ డైరెక్టర్ల (సీఎండీల)తో కలిసి ఉక్కు శాఖ కార్యదర్శిఏఐ స్టార్టప్‌ల‌తో ఒక ప్రత్యేక ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించనున్నారున్యూఢిల్లీలోని భారత మండపంఎగ్జిబిషన్ హాల్ నంబర్ 5లో మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్ నెంబర్ 1లో 18 ఫిబ్రవరి 2026న ఉదయం 11:30 గంటలకు కార్యక్రమం జరగనుందిఉక్కుగనుల రంగాల అవసరాలకు అనుగుణంగా ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించేలా అంకుర సంస్థలను ప్రోత్సహించటంవారి భాగస్వామ్యాన్ని పెంచటం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం.

ఉక్కు రంగానికి ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించటానికిఏఐ విప్లవంలో భాగస్వాములు కావటానికి వినూత్న ఏఐ ఆధారిత పరిష్కారాలతో ముందుకు రావాలని ఆవిష్కర్తలను మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తుంది

 

***


(रिलीज़ आईडी: 2229343) आगंतुक पटल : 60
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil