ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు- 2026: మూడు ప్రధాన అంతర్జాతీయ ఏఐ ఇంపాక్ట్ ఛాలెంజ్…. ఫైనలిస్టుల ప్రకటన
60కి పైగా దేశాల నుంచి అందిన 4,650కు పైగా దరఖాస్తులు
వినూత్న ఏఐ పరిష్కారాలను ప్రదర్శించేందుకు టాప్ 70 బృందాల ఎంపిక
నాడు పోస్టు చేయడమైనది:
15 FEB 2026 12:10PM by PIB Hyderabad
ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు ఢిల్లీలో 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026' జరగనున్న నేపథ్యంలో ‘ఏఐ ఫర్ ఆల్, ఏఐ బై హర్, యువాయ్ (వైయూవీఏఐ)’ అనే మూడు ప్రధాన అంతర్జాతీయ ఇంపాక్ట్ ఛాలెంజ్‌ల ఫైనలిస్టులను ప్రకటించారు.
ప్రపంచ ప్రాధాన్యతలకు అనుగుణంగా వినూత్నమైన, ప్రభావవంతమైన ఏఐ పరిష్కారాల స్వీకరణను ప్రోత్సహించడానికి ఈ ఛాలెంజ్‌లను ప్రారంభించారు. వీటికి 60 కంటే ఎక్కువ దేశాల నుంచి 4,650కు పైగా దరఖాస్తులు అందాయి. ఈ భారీ స్పందన అంతర్జాతీయ స్థాయిలో లభించిన బలమైన మద్దతును తెలియజేస్తోంది.
విషయ నిపుణులు, పరిశ్రమ దిగ్గజాల నేతృత్వంలో అనేక దశల్లో జరిగిన కఠినమైన పరిశీలన తర్వాత ఈ ఛాలెంజ్‌లలో టాప్ 70 బృందాలతో కూడిన ఫైనలిస్టులను ఎంపిక చేశారు. వీరు తమ పరిష్కారాలను ఫిబ్రవరి 16, 17 తేదీలలో భారత్ మండపం, సుష్మా స్వరాజ్ భవన్‌లో జరిగే గ్రాండ్ ఫైనల్, అవార్డుల ప్రదానోత్సవంలో ప్రదర్శిస్తారు.
ఏఐ ఫర్ ఆల్
ఏఐ ఫర్ ఆల్ అంతర్జాతీయ ఇంపాక్ట్ ఛాలెంజ్‌కు 60 కంటే ఎక్కువ దేశాల నుంచి 1,350కు పైగా దరఖాస్తులు అందాయి. ఇవి ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాతావరణ దృఢత్వం, పరిపాలన, విద్య - ఆర్థిక సమ్మిళితం వంటి రంగాలలో విస్తరించగలిగే ఏఐ పరిష్కారాలపై దృష్టి సారించాయి. ఎంపికైన టాప్ 20 పోటీదారులు వాస్తవ ప్రాపంచిక పరిస్థితుల్లో అధిక ప్రభావం చూపే ఆవిష్కరణలను ప్రదర్శించారు. వీటిలో ఏఐ ఆధారిత ఇన్‌ఫెక్షన్ స్క్రీనింగ్, నేల స్వభావాన్ని విశ్లేషించే నిఘా, వాతావరణ ముప్పు విశ్లేషణ, డిజిటల్ ఆరోగ్య నిర్ధారణ, సైబర్ భద్రత వంటివి ఉన్నాయి. అంతేకాకుండా పారిశ్రామిక సామర్థ్యం, అందరికీ అందుబాటులో ఉండే విద్యా సాంకేతికతలు, ఏఐ ఆధారిత పరిపాలనా వ్యవస్థలు కూడా ఇందులో చోటు దక్కించుకున్నాయి. మొత్తంగా ఈ ఆవిష్కరణలు కృత్రిమ మేధ ద్వారా సమానమైన వృద్ధిని ఎలా సాధించవచ్చో, గ్లోబల్ సౌత్ దేశాలలో ప్రభుత్వ సేవల పంపిణీని ఎలా బలోపేతం చేయవచ్చో నిరూపిస్తున్నాయి.
ఏఐ బై హర్
‘ఏఐ బై హర్’ గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్‌కు 50 కంటే ఎక్కువ దేశాల నుంచి 800కు పైగా దరఖాస్తులు వచ్చాయి. కృత్రిమ మేధ రంగంలో మహిళా నాయకత్వంలోని ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. మహిళా పారిశ్రామికవేత్తలు ఆరోగ్య సంరక్షణ, సుస్థిరత, ఆర్థిక సమ్మిళితం, ఉపాధి అభివృద్ధి, విద్య, వ్యవసాయం - డిజిటల్ వాణిజ్యం వంటి రంగాలలో చూపుతున్న అద్భుతమైన ప్రభావాలను ఎంపికైన టాప్ 30 ఫైనలిస్టులు తెలియజేస్తున్నారు. వీరి ఆవిష్కరణలలో ఏఐ ఆధారిత క్యాన్సర్- రెటినల్ నిర్ధారణ పరికరాలు, బహుభాషా క్లినికల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్, వాయిస్-టు-ఈఎంఆర్ ప్లాట్‌ఫాంలు, ఖచ్చితత్వంతో కూడిన న్యూట్రిషన్ పరిష్కారాలు, క్రెడిట్ నిఘా వ్యవస్థలు, ఈఎస్‌జీ ఆటోమేషన్ ప్లాట్‌ఫాంలు, విస్తృత స్థాయిలో సేవలందించే బహుభాషా స్థానికీకరణ సాంకేతికతలు ఉన్నాయి. 'ఏఐ బై హర్' కార్యక్రమం సమ్మిళిత డిజిటల్ వృద్ధి పట్ల, ప్రపంచ ఏఐ వ్యవస్థలో మహిళా ఆవిష్కర్తలను అగ్రగామిగా నిలబెట్టడం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటిచెబుతోంది.
యువాయ్ గ్లోబల్ యూత్ ఛాలెంజ్
దీనికి 38 దేశాల నుంచి 2,500కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇది 13 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువ ఏఐ నాయకుల సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతోంది. ఎంపికైన టాప్ 20 ఫైనలిస్టులు.. ప్రజారోగ్యం, వ్యవసాయం, వాతావరణ దృఢత్వం, అంగవైకల్యం ఉన్నవారికి సహాయక సాంకేతికతలు, స్మార్ట్ మొబిలిటీ, డిజిటల్ ట్రస్ట్ వంటి రంగాల్లో ఏఐని వినియోగిస్తున్నారు. వీరి ఆవిష్కరణలలో మలేరియా గుర్తింపు వ్యవస్థలు, మాటలు రాని వారికి సహాయపడే ఏఐ వేరబుల్, గర్భాశయ క్యాన్సర్ పరీక్ష పరికరాలు, గ్రామీణ వైద్యం కోసం టెలిమెడిసిన్ ప్లాట్‌ఫాంలు, అటవీ అగ్నిప్రమాదాలు, వరదల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, డీప్‌ఫేక్ గుర్తింపు సాధనాలు, అంధుల కోసం ప్రత్యేక సహాయక సాంకేతికతలు ఉన్నాయి. సమాజ అవసరాలు, అభివృద్ధి ప్రాధాన్యతలకు అనుగుణంగా యువత నేతృత్వంలోని ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో యువాయ్ ఒక శక్తిమంతమైన వేదికగా నిలుస్తోంది.
ఈ మూడు పోటీల్లో ఎంపికైన మొత్తం 70 బృందాలు తమ పరిష్కారాలను ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు- 2026లో ప్రదర్శిస్తాయి. ఇక్కడ విధానకర్తలు, పరిశ్రమ దిగ్గజాలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలతో సంభాషించే అవకాశాన్ని ఆయా పోటీదారులు పొందుతారు. తమ ఆవిష్కరణలను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి వీరికి తగిన గుర్తింపు, మద్దతు లభిస్తుంది. ఈ భారీ అంతర్జాతీయ స్పందన.. 'ప్రజలు, పృథ్వీ, ప్రగతి' అనే దార్శనికతతో బాధ్యతాయుతమైన ఏఐ ఆవిష్కరణలకు భారత్ ఒక ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని నిరూపిస్తోంది.
ఏఐ ఫర్ ఆల్ -
టాప్ 20 ఫైనలిస్టులు:
-
ఏ వన్ (భారత్) – పారిశ్రామిక పనితీరు పర్యవేక్షణ, ఇంధన పొదుపుకు సంబంధించిన ఐఓటీ, ఏఐ ప్లాట్‌ఫాం
-
బయోమ్ మేకర్స్ ఇంక్ (బీ క్రాప్) (అమెరికా) – నేల ఆరోగ్యంపై ముందస్తు సమాచారాన్ని అందించే ఏఐ ఆధారిత సాయిల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం
-
కార్బ్ జీఈఎం ఇంక్ (బిట్టే) (జపాన్) – ఇన్‌ఫెక్షన్లను వేగంగా గుర్తించే స్మార్ట్‌ఫోన్ ఆధారిత ఏఐ సాధనం
-
కోర్ స్టాక్ (భారత్) – శాటిలైట్, క్షేత్రస్థాయి డేటాను భూమి, నీటి నిర్వహణ సమాచారంగా మార్చే ఏఐ ప్లాట్‌ఫాం
-
క్రాప్ స్కాన్ స్మార్ట్ ఫార్మింగ్ ఐఓటీ టెక్నాలజీ (కెన్యా) – పంటల వ్యాధులు, పోషకాలను గుర్తించే ఏఐ ఆధారిత హ్యాండ్‌హెల్డ్ పరికరం
-
ఎలిమెంటెక్ సర్కిల్ ప్రైవేట్ లిమిటెడ్ (భారత్) – ఏఐ ఆధారిత డిమాండ్ సూచనలు, ఆటోమేటెడ్ డిమాండ్ రెస్పాన్స్ వ్యవస్థ
-
ఈక్విట్విన్ బై ఇన్ఫియస్ హెల్త్ (కామెరూన్) – ఏఐ ఆధారిత డిజిటల్ పేషెంట్ ట్విన్ సాంకేతికత
-
ఫోరస్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ (భారత్) – తక్కువ ఖర్చుతో కూడిన ఏఐ ఆధారిత మెడికల్ ఇమేజింగ్ ట్రయేజ్ సాధనం
-
హీలియోస్ 2.0 (థింకర్‌బెల్ ల్యాబ్స్) (భారత్) – అందరికీ అందుబాటులో ఉండే ఏఐ ఆధారిత విద్యా ప్లాట్‌ఫాం
-
ఇన్ఫీహీల్ హెల్త్‌టెక్ (భారత్) – రిస్క్ ట్రయేజ్ సదుపాయం గల బహుభాషా ఏఐ మానసిక ఆరోగ్య ప్లాట్‌ఫాం
-
ఇంటెల్లో ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (భారత్) – డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌తో అనుసంధానమైన ఏఐ ఆధారిత పంట గ్రేడింగ్ వ్యవస్థ
-
కిడౌరా ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (భారత్) – ఆటిజం, ఎదుగుదల లోపాలను గుర్తించే ఏఐ ఆధారిత సాధనం
-
మధునేత్ర ఏఐ (భారత్) – డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ కోసం ఏఐ పరిష్కారం
-
వన్ గ్లోబల్ మెడికల్ టెక్నాలజీ (హీలియం హెల్త్) (నైజీరియా) – ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తల కోసం ఏఐ క్లినికల్ అసిస్టెంట్
-
పర్సెప్ట్ సీటీఈఎం (భారత్) – ఏఐ ఆధారిత సైబర్ సెక్యూరిటీ విజిబిలిటీ ప్లాట్‌ఫాం
-
రెసిలెన్స్ 360 (భారత్) – ఏఐ ఆధారిత వాతావరణ ముప్పు, దృఢత్వ ప్రణాళికా సాధనం
-
శాట్ సోర్స్ (శాట్ సూర్) (భారత్) – శాటిలైట్, ఏఐ ఆధారిత ఫార్మ్ రిస్క్ స్కోరింగ్ ప్లాట్‌ఫాం
-
టార్చిట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (భారత్) – ఏఐ ఆధారిత సులభతర విద్యా కంటెంట్ ప్లాట్‌ఫాం
-
వజ్ర గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీసెస్ ఎల్ ఎల్ పి (భారత్) – నిర్మాణాత్మక పరిపాలన డేటా కోసం సెమాంటిక్ ఏఐ ప్లాట్‌ఫాం
-
వైసా (భారత్) – ఏఐ ఆధారిత సంభాషణాత్మక మానసిక ఆరోగ్య మద్దతు ప్లాట్‌ఫాం
ఏఐ బై హర్-
దీనికి ఎంపికైన టాప్ 30 ఫైనలిస్టులు:
-
జెకో ఏఐ – ఖచ్చితత్వంతో కూడిన నియామకాలను మెరుగుపరిచే ఎంటర్‌ప్రైజ్-గ్రేడ్ ఏఐ టాలెంట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం.
-
మ్యాజిక్‌రోల్ ఏఐ – వ్యక్తిగతీకరించిన వీడియోల సృష్టిని ఆటోమేట్ చేసే జనరేటివ్ ఏఐ ప్లాట్‌ఫాం.
-
ఓపెన్ లింక్స్ ఫౌండేషన్ (వినోబా) – ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్ర నైపుణ్యాలను మెరుగుపరిచే ఏఐ ఆధారిత ప్లాట్‌ఫాం
-
సోడైట్ – ఏఐ ఆధారిత ఖచ్చితమైన పోషకాహారం, జీవక్రియ ఆరోగ్య ప్లాట్‌ఫాం.
-
పెరివింకిల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (స్మార్ట్ స్కోప్ సీఎక్స్) – గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం రూపొందించిన పోర్టబుల్ ఏఐ పరికరం.
-
శబ్ద్ ఏఐ – 22 భారతీయ భాషలలో పనిచేసే బహుభాషా ఏఐ స్థానికికీకరణ ప్లాట్‌ఫాం
-
గూయీ ఏఐ (అమెరికా) – సామాజిక ప్రభావం కోసం రూపొందించిన లో-కోడ్ బహుభాషా ఏఐ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్‌ఫాం
-
హ్యాపీకిడ్స్ ఏఐ (లక్సెంబర్గ్) – విద్యార్థుల సంక్షేమం , మానసిక అక్షరాస్యతను ప్రోత్సహించే రెస్పాన్సిబుల్ ఏఐ ప్లాట్‌ఫాం
-
వోలార్ ఆల్టా – డ్రోన్ ఆధారిత పారిశ్రామిక తనిఖీల కోసం ఏఐ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం
-
ఏయిజో ఏఐ – ఎంఎస్ఎంఈ డిజిటల్ ఆన్‌బోర్డింగ్ కోసం మొబైల్-ఫస్ట్ ఏఐ కామర్స్ ప్లాట్‌ఫాం
-
ఇంటెలెహెల్త్ – ఆయు 2.0 – ఏఐ ఆధారిత బహుభాషా క్లినికల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్.
-
న్యూరా ఏఐ – పునరావాసం కోసం మార్కర్-లెస్ ఏఐ మోషన్ అనాలిసిస్ ప్లాట్‌ఫాం
-
రెమిడియో మీడియోస్‌హెచ్ఐ – స్మార్ట్‌ఫోన్ ఆధారిత ఏఐ రెటినల్ స్క్రీనింగ్ ప్లాట్‌ఫాం
-
లైట్‌బీస్ – ఏబుల్‌క్రెడిట్ – ఏఐ ఆధారిత ప్రత్యామ్నాయ క్రెడిట్ ఇంటెలిజెన్స్ సిస్టమ్
-
ఎన్‌వైబ్స్ (కేఎన్‌కే స్క్వేర్) – రోగుల సౌకర్యం కోసం డెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ చేసే ఎడ్జ్-ఏఐ సిస్టమ్
-
ఈజెడ్‌స్పీచ్ (ఉజ్బెకిస్తాన్) – ఏఐ ఆధారిత స్పీచ్ థెరపీ , గైడెడ్ హోమ్ ప్రాక్టీస్ ప్లాట్‌ఫాం
-
ప్రాజెక్ట్ రైజ్ (కెన్యా) – ఏఐ ఆధారిత శిశు సంరక్షణ , ట్రామా-ఇన్ఫార్మ్డ్ సపోర్ట్ సిస్టమ్
-
ఫార్మర్ లైఫ్‌లైన్ (కెన్యా) – పొలాల్లో తెగుళ్లు , వాతావరణ సమాచారాన్ని అందించే సోలార్ ఏఐ ప్లాట్‌ఫాం
-
సూపర్ హ్యూమన్ రేస్ ఫౌండేషన్ – డిఫైన్ – వాతావరణ డేటా , ఉద్గారాల సమాచారాన్ని అందించే ప్లాట్‌ఫాం
-
ప్రోసికల్ (వాయిస్ ఏఐ ఓఆర్ఎఫ్ అసెస్‌మెంట్) – బహుభాషా ఏఐ అక్షరాస్యత అంచనా ప్లాట్‌ఫాం
-
వర్డ్ వర్క్స్ ఏఐ – స్వయంప్రతిపత్తి కలిగిన మల్టీచానల్ ఏఐ కాన్వర్సేషనల్ ఏజెంట్ ప్లాట్‌ఫాం.
-
ఎకోరేటింగ్స్ – సస్టైనింగ్.ఏఐ – ఏఐ ఆధారిత ఈఎస్‌జీ , కార్బన్ అకౌంటింగ్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం
-
టాలెంటి (పోలాండ్) – కెరీర్ మొబిలిటీ , మెంటరింగ్ కోసం రెస్పాన్సిబుల్ ఏఐ ప్లాట్‌ఫాం
-
టాప్ పేరెంట్ - బాల్య అభ్యాసాన్ని బలోపేతం చేసే స్థానిక భాషా ఏఐ ప్లాట్‌ఫాం
-
మెవ్న్ఏ – నైపుణ్య ఆధారిత బహుభాషా ఏఐ లెర్నింగ్ ప్లాట్‌ఫాం.
-
వాసర్ ల్యాబ్స్ - ఫీల్డ్‌వైజ్ - వ్యవసాయ మేధస్సు , విధానపరమైన విశ్లేషణలను అందించే ఏఐ ప్లాట్‌ఫాం
-
అశ్విన్ ఏఐ – హెల్త్‌కేర్ డాక్యుమెంటేషన్ కోసం బహుభాషా వాయిస్-టు-ఈఎంఆర్ సిస్టమ్
-
సివి ఏఐ – బహుభాషా బ్రాండ్ కంటెంట్ కోసం జనరేటివ్ ఏఐ డిజైన్ ప్లాట్‌ఫాం
-
కాండిడ్ ఏఐ – ఏఅమ్మకాలు, స్టోర్ ఆప్టిమైజేషన్ కోసం ఏఐ కాన్వర్సేషనల్ ఏజెంట్.
-
డేటా పిజియన్ (అమెరికా) – ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం ఏఐ ఆధారిత ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ ప్లాట్‌ఫాం
యువాయ్ అంతర్జాతీయ యూత్ ఛాలెంజ్
దీనికి ఎంపికైన టాప్ 20 ఫైనలిస్టులు:
-
మలేరియా ఎక్స్ (థాయిలాండ్, 13–15 ఏళ్లు) – గ్రామీణ ప్రాంతాల్లో మలేరియా రకాలను గుర్తించే మల్టీ-మోడల్ ఏఐ వ్యవస్థ
-
పారాస్పీక్ (భారత్, 16–18 ఏళ్లు) – అస్పష్టమైన మాటలను రియల్ టైమ్‌లో స్పష్టమైన మాటలుగా మార్చే ఏఐ ఆధారిత వేరబుల్ పరికరం
-
ఆరోగ్య ఏఐ (భారత్, 19–21 ఏళ్లు) – వైద్యపరమైన విశ్లేషణలకు మద్దతు ఇచ్చే క్లినికల్ లాంగ్వేజ్ మోడల్
-
సైటోస్కాన్ జెడ్ (థాయిలాండ్, 16–18 ఏళ్లు) – ఏఐ ఆధారిత గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్, క్లౌడ్ డయాగ్నోస్టిక్స్ ప్లాట్‌ఫాం
-
సేఫ్‌పాత్ ఏఐ (భారత్, 16–18 ఏళ్లు) – కూడళ్ల వద్ద భద్రత విషయంలో హెచ్చరికలు ఇచ్చే ఏఐ ఆధారిత వ్యవస్థ
-
అగ్రిటెక్ ప్రో (భారత్, 19–21 ఏళ్లు) – ఏఐ ఆధారిత పంట పర్యవేక్షణ, దిగుబడిని పెంచే ప్లాట్‌ఫాం.
-
కెడోవో ఏఐ (భారత్, 13–15 ఏళ్లు) – ఏఐ ఆధారిత ఇంటరాక్టివ్ ఎన్‌సీఈఆర్‌టీ అభ్యాస వ్యవస్థ.
-
మూ యాప్స్ (ఇండోనేషియా, 19–21 ఏళ్లు) – ఏఐ ఆధారిత సుస్థిర పశుసంవర్ధక నిర్వహణ వ్యవస్థ.
-
వైల్డ్‌ట్రాక్ 360 – మిషన్ త్రిశూల్ (భారత్, 19–21 ఏళ్లు) – వన్యప్రాణుల రక్షణ, గ్రామీణ భద్రత కోసం రూపొందించిన ఏఐ ప్లాట్‌ఫాం.
-
అగ్నిసేన (భారత్, 19–21 ఏళ్లు) – అడవి మంటలను ముందుగానే హెచ్చరించే ఏఐ ఆధారిత వ్యవస్థ.
-
వేవ్ (భారత్, 19–21 ఏళ్లు) – బ్రెయిలీ లిపిని నేర్చుకోవడానికి సహాయపడే ఏఐ వేరబుల్ గ్లోవ్
-
సర్కాడియన్ ఏఐ (అమెరికా, 13–15 ఏళ్లు) – స్మార్ట్‌ఫోన్ ఆధారిత ఏఐ గుండె సంబంధిత అసాధారణతలను గుర్తించే పరికరం
-
మెడికేర్ (భారత్, 19–21 ఏళ్లు) – గ్రామీణ ఆరోగ్య సంరక్షణ కోసం ఏఐ ఆధారిత టెలిమెడిసిన్ ప్లాట్‌ఫాం
-
ట్రస్ట్ ట్రేస్ (భారత్, 19–21 ఏళ్లు) – మల్టీమీడియా ఏఐ డీప్‌ఫేక్ గుర్తింపు ప్లాట్‌ఫాం
-
ఏఐ ఆధారిత రియల్ టైమ్ క్లైమేట్ ఇంటెలిజెన్స్ , ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (భారత్, 19–21 ఏళ్లు) – ముందస్తు వరద పర్యవేక్షణ వ్యవస్థ
-
థర్డ్ ఐ (భారత్, 19–21 ఏళ్లు) – దృష్టి లోపం ఉన్నవారికి దారి చూపించే ఏఐ పర్సెప్షన్ వ్యవస్థ.
-
హైబ్రిడ్ డీప్ న్యూరల్ ఆర్కిటెక్చర్ ఫర్ డైసార్థ్రిక్ స్పీచ్ అనాలిసిస్ (భారత్, 19–21 ఏళ్లు) – మాటల లోపాన్ని (డైసార్థ్రియా) గుర్తించే ఏఐ ఆధారిత వ్యవస్థ.
-
ఇండెక్స్ – ఇంటెలిజెంట్ న్యూరో అడాప్టివ్ డయాగ్నోస్టిక్ ఎన్‌హాన్స్‌మెంట్ (థాయిలాండ్, 16–18 ఏళ్లు) – నరాల సంబంధిత స్క్రీనింగ్, పునరావాసానికి మద్దతు ఇచ్చే ఏఐ ప్లాట్‌ఫాం
-
డీప్ లెర్నింగ్ ఫర్ సస్టైనబుల్ టూరిజం ఇన్ విష్ణుపూర్ (భారత్, 19–21 ఏళ్లు) – వారసత్వ సంపద గుర్తింపు, పర్యాటక రంగం కోసం ఏఐ ప్లాట్‌ఫాం.
-
జెడ్-ట్రాక్స్ – జీక్స్ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అనలిటిక్స్ అండ్ స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ (భారత్, 19–21 ఏళ్లు) – ఏఐ ఆధారిత స్మార్ట్ నగర ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ
***
(రిలీజ్ ఐడి: 2228475)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5