ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆయుష్మాన్ భారత్ కార్డుల తాజా సమాచారం
ఏప్రిల్ 2020 నుంచి జనవరి 2026 వరకు ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద 35.69 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీ
2026 జనవరి 31 నాటికి ఆయుష్మాన్ భారత్- ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద
ప్రైవేటు ఆసుపత్రుల్లో 5.77 కోట్ల రోగుల చికిత్సకు రూ.1.15 లక్షల కోట్ల మంజూరు
నాడు పోస్టు చేయడమైనది:
13 FEB 2026 1:33PM by PIB Hyderabad
గత అయిదు సంవత్సరాల్లో ( ఏప్రిల్ 2020 నుంచి జనవరి 2026 వరకు) ఆయుష్మాన్ భారత్- ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) కింద సుమారు 35.69 కోట్ల ఆయుష్మాన్ కార్డులను లబ్ధిదారులకు అందించారు. ఈ పథకం కింద రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఆయుష్మాన్ కార్డుల వివరాలను https://dashboard.nha.gov.in/public/card వెబ్ సైట్ లో చూడవచ్చు.
ఈ పథకం కింద 31 జనవరి 2026 నాటికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 5.77 కోట్ల మంది రోగుల కోసం ప్రభుత్వం రూ. 1.15 లక్షల కోట్ల నిధులను మంజూరు చేసింది.
ఈ సమాచారాన్ని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావు జాదవ్ నేడు లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వివరించారు.
(రిలీజ్ ఐడి: 2227609)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12