ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్త రోగనిరోధక టీకా కార్యక్రమంపై తాజా సమాచారం
8 ఫిబ్రవరి 2026 నాటికి యు-విన్ పోర్టల్‌లో 11.12 కోట్ల మంది పిల్లలు, 3.78 కోట్ల మంది గర్భిణీల నమోదు
టీకా అనంతరం లబ్ధిదారులు క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ సర్టిఫికెట్లను నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం..
2025లో యు-విన్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న 8.01 కోట్ల మంది
ఆరోగ్య సేవల బలోపేతానికి యు-విన్ పోర్టల్‌ను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, పోషణ్ ట్రాకర్,
సేఫ్ వాక్(ఎస్ఏఎఫ్ఈవీఏసీ)తో అనుసంధానం
నాడు పోస్టు చేయడమైనది:
13 FEB 2026 1:38PM by PIB Hyderabad
11.12 కోట్ల మంది పిల్లలు, 3.78 కోట్ల మంది గర్భిణీలు 2026 ఫిబ్రవరి 8 నాటికి యు-విన్ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ప్రతి టీకా కార్యక్రమం తరువాత లబ్ధిదారులు యు-విన్ పోర్టల్ నుంచి క్యూఆర్ కోడ్ ఆధారిత వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రాన్ని స్వయంగా తీసుకోవచ్చు. కేవలం 2025లోనే 8.01 కోట్ల మంది లబ్ధిదారులు ఈ పోర్టల్‌లో నమోదయ్యారు. వారికి డిజిటల్ ధ్రువీకరణ పత్రాలను అందుబాటులో ఉంచారు.
2025లో దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు యు-విన్ పోర్టల్ నుంచి మొత్తం 29.42 కోట్ల సంక్షిప్త సందేశాలను పంపించారు. టీకాలు వేయించుకోవాల్సిన పిల్లల జాబితాను రూపొందించడంలో యు-విన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ పిల్లలను పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా వారికి వేయాల్సిన డోసుల గురించి సంక్షిప్త సందేశాలను పంపడం ద్వారా క్రమ తప్పకుండా వారిని చైతన్యవంతం చేయడడం సాధ్యమవుతోంది. క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బంది గుర్తించిన పిల్లలకు తగిన సమయంలో టీకాలు వేయడం, వివరాలను క్రమం తప్పకుండా యు-విన్ వేదికలో నమోదు చేయడం ద్వారా పిల్లలకు పూర్తిస్థాయిలో వ్యాధి నిరోధక శక్తిని అందిస్తున్నారు.
ఆరోగ్య సేవల నాణ్యతను పెంచడానికి యు-విన్ పోర్టల్‌ను ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, పోషణ్ ట్రాకర్ , సేఫ్ వాక్ ఆన్‌లైన్ వేదికలతో అనుసంధానించారు.
ఈ సమాచారాన్ని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ నేడు లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2227521)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10