కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈశాన్య భారతం, మారుమూల ప్రాంతాల్లోని ‘వైబ్రంట్ గ్రామాల’ అనుసంధానానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా


వచ్చే కొన్ని నెలల్లో దేశం మొత్తం విస్తరించనున్న 4జీ నెట్‌వర్క్‌: డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని

6.31 లక్షలకు పైగా గ్రామాల్లో 4జీ సేవలు.. సుమారు 5 లక్షల గ్రామాలకు చేరువైన 5జీ

దేశవ్యాప్తంగా గ్రామాల్లో సార్వత్రిక 4G కవరేజీ దిశగా భారత్.. వేగంగా సాగుతున్న 5జీ విస్తరణ

లక్ష స్వదేశీ టవర్లను ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్.. తుది దశలో 4జీ సంతృప్త ప్రక్రియ

నాడు పోస్టు చేయడమైనది: 11 FEB 2026 6:13PM by PIB Hyderabad

దేశంలోని మారుమూల ప్రాంతాలు సహా అన్ని ప్రాంతాలకు అనుసంధానతను విస్తరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా పునరుద్ఘాటించారు. ఈ రోజు లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. 

అష్టలక్ష్మి రాష్ట్రాల తొలి గ్రామాలకు సాధికారత

ఈశాన్య రాష్ట్రాల్లో అనుసంధానత సవాళ్ల గురించి మాట్లాడిన కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా.. అరుణాచల్ ప్రదేశ్‌లోని విజయ్‌నగర్ వంటి మారుమూల ప్రాంతాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో ‘చివరి గ్రామాలు’గా పిలిచే ఈ ప్రాంతాలను ‘వైబ్రంట్ గ్రామాల కార్యక్రమం (వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్)’ కింద ‘భారతదేశపు తొలి గ్రామాలు’గా గుర్తించేలా ప్రజల దృక్పథాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చారని ఆయన అన్నారు. ఈ ప్రాంతాలకు డిజిటల్ సాధికారత కల్పించడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు, ‘రైట్ ఆఫ్ వే’ వంటి భౌగోళిక, పర్యావరణ సవాళ్లను అధిగమించేందుకు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, సంబంధిత పార్లమెంటు సభ్యులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

అనుబంధ ప్రశ్నకు సమాధానమిచ్చిన గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని.. గ్రామాల్లో దాదాపు సార్వత్రిక 4జీ కవరేజీని భారత్ సాధించిందని, 5జీని వినియోగదారులకు వేగంగా అందుబాటులోకి తేస్తోన్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తోందని తెలిపారు. దేశంలోని సుమారు 6,40,000 గ్రామాల్లో దాదాపు 6,31,000 గ్రామాలు ప్రైవేట్ ఆపరేటర్లు, బీఎస్ఎన్ఎల్ ద్వారా 4జీ సేవల పరిధిలోకి వచ్చాయని ఆయన తెలిపారు. మిగిలిన 10,000 గ్రామాలు ప్రస్తుతం కొనసాగుతున్న '4జీ సంతృప్త' ప్రాజెక్టుల కింద ఉన్నాయని.. రాబోయే నెలల్లో వాటి అనుసంధానం కూడా పూర్తవుతుందని ఆయన వెల్లడించారు.

ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీలకు వాణిజ్యపరంగా లాభసాటిగా అనిపించని ప్రాంతాలలో బీఎస్ఎన్ఎల్ స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి 1,00,000 టవర్లను ఏర్పాటు చేసిందని డాక్టర్ పెమ్మసాని వివరించారు. ఇప్పటికే సుమారు 5,00,000 గ్రామాలు 5G సేవల పరిధిలోకి వచ్చాయని.. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5జీ విస్తరణలలో ఒకటిగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు.

లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు కూడా ఉన్నాయి:

గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో (1.4.2022 నుంచి 31.3.2025 వరకు) దేశవ్యాప్తంగా 8,50,284 రూట్ కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ) వేశాం. రాష్ట్రాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

వరుస సంఖ్య

రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం

గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో (

1.4.2022 నుంచి 31.3.2025 వరకు) వేసిన ఓఎఫ్‌సీ రూట్ కిలోమీటర్లలో

మొత్తం వేసిన ఓఎఫ్‌సీ (31.12.2025 నాటికి) రూట్ కిలోమీటర్లలో

1

అండమాన్, నికోబార్

దీవులు

390

1,544

2

ఆంధ్రప్రదేశ్

81,307

2,51,753

3

అరుణాచల్ ప్రదేశ్

2,627

9,913

4

అస్సాం

27,523

93,234

5

బీహార్

17,210

1,29,992

6

చండీగఢ్

2,073

24,763

7

ఛత్తీస్‌గఢ్

18,399

1,18,793

8

దాద్రా నాగర్ హవేలి, డామన్ డయ్యూ

217

1,328

9

ఢిల్లీ

10,830

77,409

10

గోవా

648

5,065

11

గుజరాత్

24,235

2,90,429

12

హర్యానా

8,253

83,932

13

హిమాచల్ ప్రదేశ్

5,802

35,787

14

జమ్మూ కాశ్మీర్

10,809

44,479

15

జార్ఖండ్

16,720

82,034

16

కర్ణాటక

27,629

2,26,763

17

కేరళ

88,591

2,59,252

18

లడఖ్

1,209

5,663

19

లక్షద్వీప్

20

59

20

మధ్యప్రదేశ్

30,374

2,63,453

21

మహారాష్ట్ర

70,178

4,06,637

22

మణిపూర్

2,500

10,499

23

మేఘాలయ

3,580

11,952

24

మిజోరం

1,718

8,332

25

నాగాలాండ్

2,277

10,057

26

ఒడిశా

26,406

1,56,298

27

పుదుచ్చేరి

137

138

28

పంజాబ్

60,654

1,97,105

29

రాజస్థాన్

45,058

2,39,458

30

సిక్కిం

474

4,827

31

తమిళనాడు

1,02,865

3,08,907

32

తెలంగాణ

65,691

2,37,946

33

త్రిపుర

1,460

11,294

34

ఉత్తర ప్రదేశ్

55,672

4,06,697

35

ఉత్తరాఖండ్

9,428

50,178

36

పశ్చిమ బెంగాల్

27,320

1,87,364

 

మొత్తం

8,50,284

42,53,334

 

దేశవ్యాప్తంగా నమోదైన కొలవదగిన పురోగతి వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

  1. మొబైల్ బ్రాడ్‌బాండ్ వేగం: ఓక్లా గ్లోబల్ స్పీడ్‌టెస్ట్ ఇండెక్స్ ప్రకారం సగటు మొబైల్ బ్రాడ్‌బాండ్ డౌన్‌లోడ్ వేగం మార్చి 2022లో 13.67 ఎంబీపీఎస్ ఉండగా డిసెంబర్ 2025 నాటికి అది 132.00 ఎంబీపీఎస్‌లకు పెరిగింది.

  2. నెట్‌వర్క్ విశ్వసనీయత: టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) డిసెంబర్ 2025 నివేదిక ప్రకారం అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (టీఎస్‌పీ) 4జీ లేదా 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించిన క్వాలిటీ ఆఫ్ సర్వీస్ (క్యూఓఎస్) ప్రమాణాలన్నింటినీ అందుకున్నాయి.

  3. 4జీ లేదా 5జీ సంసిద్ధత: 4జీ లేదా 5జీ బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్ల (బీటీఎస్) సంఖ్య 31.03.2022 నాటికి 16.91 లక్షలు ఉండగా.. 31.12.2025 నాటికి 25.59 లక్షలకు పెరిగింది (అంటే 51.33% వృద్ధి నమోదైంది). దీనికి సంబంధించిన రాష్ట్రాల వారీ వివరాలు అనుబంధం-IIలో ఉన్నాయి.

  4. లేటెన్సీ: ట్రాయ్ నివేదిక ప్రకారం 2025 సెప్టెంబర్‌లో లేటెన్సీ 75 మిల్లీ సెకన్ల కంటే తక్కువగా ఉంది. అలాగే పూర్తి డౌన్‌టైమ్ (నెట్‌వర్క్ సేవలు అందుబాటులో లేని సమయం) నిర్ణీత పరిమితి అయిన 2 శాతం కంటే తక్కువగానే ఉంది.

పైన పేర్కొన్న సమాచారం కర్ణాటక, బెంగళూరుతో సహా దేశం మొత్తానికి సంబంధించినది. 

గ్రామీణ, సరిహద్దు ప్రాంతాలలో భారత్‌నెట్ కింద ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌తో (ఓఎఫ్‌సీ) అనుసంధానమై సేవలకు సిద్ధంగా ఉన్న గ్రామ పంచాయతీల జిల్లా వారీ వివరాలు (బులంద్‌షహర్ జిల్లా, భివానీ మహేందర్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గంతో సహా) టెలికమ్యూనికేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.(https://www.dot.gov.in/static/uploads/2026/02/1f908efb879806628e9f32bf4b966c30.pdf).

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 4,830 రూట్ కిలోమీటర్ల మేర ఓఎఫ్‌సీ వేయటం పూర్తైంది. అయితే స్థానిక మున్సిపల్ అధికారులు చేపట్టిన రోడ్ల విస్తరణ పనులు, పైప్‌లైన్ పనులు, ఇతర ప్రజా ప్రయోజన పనుల సమయంలో ఓఎఫ్‌సీ కేబుల్స్‌ను తెగటం వల్ల బ్రాడ్‌బాండ్ వేగం, నెట్‌వర్క్ విశ్వసనీయత తాత్కాలికంగా ప్రభావితం కావచ్చు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ) అనుసంధానత విస్తరించటం వల్ల దేశవ్యాప్తంగా డిజిటల్ సేవల వినియోగం గణనీయంగా పెరిగింది. హై-స్పీడ్ బ్రాడ్‌బాండ్ అందుబాటులోకి రావడం వల్ల సేవలను అందించటంతో పాటు వాటి లభ్యత మరింత మెరుగుపడింది. దీనివల్ల గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని పౌరులు కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్‌సీ), ఆన్‌లైన్ పోర్టల్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫా‌మ్‌ల ద్వారా ప్రభుత్వ సేవలను సులభంగా పొందగలుగుతున్నారు. కొన్ని కీలకమైన ఈ-గవర్నెన్స్ కార్యక్రమాలు ప్రస్తుతం ఈ విధంగా ఉన్నాయి:

  1. ఆధార్ అనేది బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డేటా ఆధారంగా విశిష్టమైన డిజిటల్ గుర్తింపును అందించే ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ గుర్తింపు వ్యవస్థ. ఇప్పటివరకు 143 కోట్లకు పైగా ఆధార్ సంఖ్యలు జారీ అయ్యాయి. 

  2. సాధారణ పౌరులు డిజిటల్ పత్రాలను ఎప్పుడైనా, ఎక్కడి నుండైనా జారీ చేసిన అసలైన సంస్థల ద్వారా ధ్రువీకరించుకోవటానికి డిజిలాకర్ వీలు కల్పిస్తోంది. డిజిలాకర్ సేవల కోసం ఇప్పటివరకు 65.01 కోట్లకు పైగా వినియోగదారులు నమోదు చేసుకున్నారు.

  3. అన్ని రకాల ప్రభుత్వ సేవలను ఒకే చోట అందించేందుకు ఉమాంగ్ (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్) మొబైల్ యాప్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇది పౌరుల విషయంలో 2,390కి పైగా వివిధ సేవలను అందిస్తోంది. ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా మొత్తం 726.43 కోట్ల లావాదేవీలు జరిగాయి.

  4. సహాయక డిజిటల్ విధానంలో సీఎస్‌సీలు ప్రభుత్వ, వ్యాపార సేవలను అందిస్తున్నాయి. ప్రస్తుతం సీఎస్‌సీల ద్వారా 800లకు పైగా సేవలు అందుతున్నాయి. 2025 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 5.87 లక్షల సీఎస్‌సీలు పని చేస్తున్నాయి. వీటిలో 4.57 లక్షల కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీ స్థాయిలోనే అందుబాటులో ఉన్నాయి.

  5. దేశవ్యాప్తంగా 6 కోట్ల గ్రామీణ కుటుంబాలలో (కుటుంబానికి ఒక వ్యక్తి చొప్పున) ప్రాథమిక డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యంతో ప్రారంభించిన 'ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్' (పీఎంజీ-దిశ) ఇప్పటికే 6.39 కోట్ల మందికి చేరువైంది.

  6. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు 23,834 కోట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.2.2026 నాటికి ఈ లావాదేవీల సంఖ్య ఇప్పటికే 20,856 కోట్లకు చేరుకుంది.

భారత్‌నెట్ ప్రాజెక్ట్ కింద మెరుగైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ) అనుసంధానత కారణంగా 31.12.2025 నాటికి మొత్తం 2,14,904 గ్రామ పంచాయతీలు సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా దేశంలోని మొత్తం 6,44,131 గ్రామాలలో (రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం) సుమారు 6,34,955 గ్రామాలు మొబైల్ అనుసంధానతను కలిగి ఉన్నాయి. ఇందులో 6,31,834 గ్రామాలు 4జీ మొబైల్ సేవలను పొందుతున్నాయి. దీని ప్రకారం దేశంలోని 98.09 శాతం గ్రామాలు ఇంటర్నెట్ సదుపాయాన్ని కలిగి ఉన్నాయి.

30.09.2025 నాటికి భారతదేశంలోని మొత్తం 101.78 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారుల్లో 42.77 కోట్ల మంది గ్రామీణ ప్రాంతంలోని వారు కాగా 59.01 కోట్ల మంది పట్టణాలకు చెందినవారు.

వరుస సంఖ్య

రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం

31.3.2022 నాటికి 4జీ లేదా 5జీ బేస్

ట్రాన్స్‌సీవర్ స్టేషన్లు

(బీటీఎస్)

31.12.2025 నాటికి 4జీ లేదా 5జీ బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్లు (బీటీఎస్)

1

అండమాన్, నికోబార్

దీవులు

399

 

 


(రిలీజ్ ఐడి: 2226721) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी