గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
తెలంగాణలో అటవీ హక్కుల చట్టం అమలు
నాడు పోస్టు చేయడమైనది:
11 FEB 2026 2:14PM by PIB Hyderabad
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ దుర్గాదాస్ ఉయికే ఈ రోజు రాజ్యసభలో కీలక సమాచారాన్ని వెల్లడించారు. షెడ్యూల్డ్ తెగలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం-2006 (ఎఫ్ఆర్ఏ) నిబంధనల ప్రకారం.. ఈ చట్టంలోని వివిధ అంశాలను అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపారు. ఈ చట్టం 20 రాష్ట్రాలు (తెలంగాణ సహా), ఒక యూటీలో అమలవుతుందన్నారు. తెలంగాణలో అటవీ హక్కుల చట్టం అమలు తీరుపై ఇప్పటికే సమీక్ష చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిందని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్రంలోని 29 జిల్లాలో ఎఫ్ఆర్ఏ అమలవుతోంది. మొత్తం 2,31,456 పట్టాలను పంపిణీ చేయగా, వ్యక్తిగతంగా 2,30,735, సామాజిక అటవీ హక్కుల పట్టాలు 721 ఉన్నాయి. మొత్తం నిర్ణయం తీసుకోవాల్సిన దరఖాస్తులు 3,29,367 పెండింగ్‌లో ఉన్నాయి. మంజూరు చేసిన, పెండింగ్‌లో ఉన్న వ్యక్తిగత, సామాజిక అటవీ హక్కుల పట్టాల వివరాలు జిల్లాల వారీగా జతచేశారు.
అటవీ ప్రాంతాలు ఖాళీ చేయించటానికి సంబంధించి 13 ఫిబ్రవరి 2019న జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ, గౌరవ సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28న మళ్లీ ఆదేశాలిచ్చిందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. దీంతో అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన తెగలను వారి ప్రాంతాల నుంచి వెళ్లగొట్టలేదు.
ఎఫ్ఆర్ఏలోని సెక్షన్ 4(5) నిబంధనల ద్వారా బలవంతంగా ఖాళీ చేయించకుండా రక్షణ పొందవచ్చు. ఈ ప్రక్రియలో అన్యాయానికి గురైన బాధితులు ఎస్డీఎస్సీ, డీఎల్సీ (సెక్షన్ 6(2), 6(4)) ద్వారా పిటిషన్లు సమర్పించుకునే అవకాశముంది. ఎస్‌టీల ప్రయోజనాలను కాపాడటంలో రాజ్యాంగ నిబంధనలు, రక్షణ కల్పించేందుకు రూపొందించిన వివిధ చట్టాలను అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓటీఏ) గిరిజన తెగల అభివృద్ధికి సంబంధించిన విధాన రూపకల్పన, ప్రణాళిక, కార్యక్రమాల సమన్వయానికి నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తూ.. ఎస్‌టీల సంక్షేమం, అభివృద్ధికి వివిధ పథకాలను అమలు చేస్తుంది. ఇవి గిరిజన వర్గాల జీవనోపాధికి భద్రతను కల్పిస్తాయి. ఈ దిశగా ప్రధానమంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం-జన్‌మాన్), ధర్తీఆబా జన్‌జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (డీఏ-జేజీయూఏ) వంటి పలు పథకాల ద్వారా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలను చేపట్టింది.
అనుబంధం
ఈ అనుబంధం "తెలంగాణలో అటవీ హక్కుల చట్టం అమలు"కు సంబంధించి రాజ్యసభలో లిఖితపూర్వక ప్రశ్న సంఖ్య 1423లోని భాగం (b)కి 11.02.2026న ఇచ్చిన సమాధానం:
తెలంగాణ ప్రభుత్వం అందించిన నివేదిక ప్రకారం 31.12.2025 నాటికి జిల్లాల వారీగా దాఖలైన దరఖాస్తులు, మంజూరు చేసిన పట్టాలు, తిరస్కరించిన, పరిష్కరించిన వివరాలు:
|
Sr. No.
|
District
|
Claims received
|
Titles Granted
|
Claims Rejected
|
Claims Pending
|
|
Ind.
|
Com.
|
Total
|
Ind.
|
Com.
|
Total
|
|
1
|
BhadradriKothagudem
|
139250
|
441
|
139691
|
68307
|
80
|
68387
|
25060
|
46244
|
|
2
|
Adilabad
|
64370
|
310
|
64680
|
26642
|
137
|
26779
|
8429
|
29472
|
|
3
|
Mahabubabad
|
65185
|
689
|
65874
|
30127
|
93
|
30220
|
13316
|
22338
|
|
4
|
Asifabad
|
59816
|
464
|
60280
|
26348
|
113
|
26461
|
4855
|
28964
|
|
5
|
Mulugu
|
47993
|
1
|
47994
|
12349
|
1
|
12350
|
7482
|
28162
|
|
6
|
khammam
|
32053
|
8
|
32061
|
12962
|
8
|
12970
|
7133
|
11958
|
|
7
|
Nirmal
|
25779
|
528
|
26307
|
10796
|
112
|
10908
|
3035
|
12364
|
|
8
|
Nalgonda
|
28742
|
0
|
28742
|
6701
|
0
|
6701
|
3969
|
18072
|
|
9
|
Nizamabad
|
20287
|
4
|
20291
|
4861
|
4
|
4865
|
4910
|
10516
|
|
10
|
Kamareddy
|
33111
|
3
|
33114
|
7133
|
3
|
7136
|
3598
|
22380
|
|
11
|
JayashankarBhopalapally
|
29811
|
401
|
30212
|
4599
|
41
|
4640
|
3381
|
22191
|
|
12
|
Mancherial
|
16830
|
171
|
17001
|
3474
|
75
|
3549
|
2639
|
10813
|
|
13
|
Warangal
|
12537
|
150
|
12687
|
5121
|
17
|
5138
|
2027
|
5522
|
|
14
|
Vikarabad
|
12617
|
0
|
12617
|
1158
|
0
|
1158
|
1929
|
9530
|
|
15
|
Medak
|
5829
|
11
|
5840
|
1969
|
11
|
1980
|
297
|
3563
|
|
16
|
Sangareddy
|
5407
|
2
|
5409
|
1685
|
2
|
1687
|
793
|
2929
|
|
17
|
Nagarkumool
|
13492
|
42
|
13534
|
2938
|
11
|
2949
|
413
|
10172
|
|
18
|
Suryapet
|
9024
|
0
|
9024
|
155
|
0
|
155
|
824
|
8045
|
|
19
|
Jagityal
|
5277
|
0
|
5277
|
421
|
0
|
421
|
0
|
4856
|
|
20
|
Yadadri
|
2412
|
0
|
2412
|
397
|
0
|
397
|
137
|
1878
|
|
21
|
RajannaSiricilla
|
6981
|
0
|
6981
|
1920
|
0
|
1920
|
0
|
5061
|
|
22
|
Peddapally
|
4651
|
0
|
4651
|
56
|
0
|
56
|
0
|
4595
|
|
23
|
Siddipet
|
297
|
13
|
310
|
41
|
12
|
53
|
11
|
246
|
|
24
|
Mahabubanagar
|
4574
|
1
|
4575
|
79
|
1
|
80
|
0
|
4495
|
|
25
|
MedchalMalkangiri
|
0
|
188
|
188
|
0
|
0
|
0
|
188
|
0
|
|
26
|
Wanaparthy
|
3256
|
0
|
3256
|
419
|
0
|
419
|
0
|
2837
|
|
27
|
Hanumakonda
|
777
|
0
|
777
|
70
|
0
|
70
|
0
|
707
|
|
28
|
Narayanapet
|
378
|
0
|
378
|
7
|
0
|
7
|
0
|
371
|
|
29
|
Ranga Reddy
|
1086
|
0
|
1086
|
0
|
0
|
0
|
0
|
1086
|
|
Total
|
651822
|
3427
|
655249
|
230735
|
721
|
231456
|
94426
|
329367
|
***
(రిలీజ్ ఐడి: 2226546)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17