అంతరిక్ష విభాగం
పార్లమెంటు ప్రశ్న: భారత అంతరిక్ష రంగంలో అంకుర సంస్థలు
నాడు పోస్టు చేయడమైనది:
11 FEB 2026 12:49PM by PIB Hyderabad
అంతరిక్ష రంగంలో నమోదయిన అంకుర సంస్థల సంఖ్య 2014లో 1 మాత్రమే ఉండగా, ప్రస్తుతం 400కు పైగా పెరిగింది. 2016లో ప్రకటించిన స్టార్టప్ ఇండియా కార్యక్రమం ద్వారా అవసరమైన తోడ్పాటును, నిధులను, సులభతరమైన నియంత్రణ విధానాలను అందించి ఆవిష్కరణలను ప్రోత్సహించడం, విస్తృతమైన అంకుర సంస్థల వ్యవస్థను నిర్మించడమే లక్ష్యం. అంతరిక్ష రంగంలో సైతం అంకుర సంస్థలకు సంబంధించి గణనీయమైన వృద్ధి నమోదయింది. పిక్సెల్, ధ్రువ, స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ 2014 తర్వాత దేశంలో ప్రముఖ అంతరిక్ష సంస్థలుగా ఎదిగాయి.
అంతరిక్ష అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి, తోడ్పాటు అందించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, విధానాలు, సంస్థాగత కార్యక్రమాల వివరాలు సంవత్సరాల వారీగా:
|
క్రమ సంఖ్య
|
పథకం/విధానం
|
సంవత్సరం
|
|
1.
|
భారతీయ అంతరిక్ష విధానం
|
2023
|
|
2.
|
ఉదార ఎఫ్‌డీఐ విధానం
|
2024
|
|
3.
|
అనుమతుల మంజూరుకు నిబంధనలు, మార్గదర్శకాలు, విధానాలు
|
2024
|
|
4.
|
ఇన్-స్పేస్ సీడ్ ఫండ్ పథకం
|
2023
|
|
5.
|
ఇన్-స్పేస్ ప్రి-ఇంక్యుబేషన్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ (పీఐఈ) కార్యక్రమం
|
2024
|
|
6.
|
రూ.1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ నిధి ఏర్పాటు
|
2024
|
|
7.
|
రూ.500 కోట్లతో టెక్నాలజీ స్వీకరణ నిధి (టీఏఎఫ్) ఏర్పాటు
|
2025
|
|
8.
|
హెచ్ఏఎల్‌కు స్మాల్ శాటిలైట్ లాంఛ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్‌వీ) సాంకేతికత బదిలీ
|
2025
|
|
9.
|
పీపీపీ పద్దతిలో ఎర్త్ అబ్జర్వేషన్ (ఈవో) ఉపగ్రహ వ్యవస్థ ఏర్పాటు
|
2026
|
అంతరిక్ష సాంకేతిక రంగంలో అన్ని విభాగాల్లోనూ స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఈ అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యం పెరుగుతున్న నేపథ్యంలో సాధిస్తున్న విజయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సాధించిన ఘనతలు:
-
అంతరిక్ష రంగంలో అంకుర సంస్థల సంఖ్య 400కు పైగా ఉంది.
-
అంతరిక్ష అంకుర సంస్థల్లో పెట్టుబడులు 500 మిలియన్ల అమెరికన్ డాలర్లను దాటాయి.
-
2022 నవంబర్లో, 2024 మేలో రెండు ప్రైవేటు రంగ సంస్థలు తమ ప్రయోగ వాహక నౌకలను ఉపకక్ష్య స్థాయికి ప్రయోగించి పరీక్షించాయి.
-
పీఎస్ఎల్వీ ఆర్బిటాల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ (పీవోఈఎం) ద్వారా మొత్తం 25 పేలోడ్లను ప్రయోగించారు/ప్రయోగించబోతున్నారు. ఇది ఎన్‌జీఈలు తమ పేలోడ్‌ల అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాన్ని పరీక్షించి, నిరూపించుకోవడానికి సహాయపడుతుంది
-
మొత్తం ఆరు భారతీయ ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జీఈ)లు కక్ష్యలో 18 ఉపగ్రహాలను ప్రయోగించాయి.
-
పీపీపీ నమూనాలో ఎర్త్ అబ్జర్వేషన్ (ఈవో) ఉపగ్రహ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మన భారతీయ సంస్థల ఆవిష్కరణలు పెరుగుతాయి. అంతర్జాతీయంగా వాటి పట్ల విశ్వాసం పెరుగుతుంది.
-
ఎస్ఎస్ఎల్‌వీ సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ద్వారా ప్రయోగ వాహకాల తయారీ భారీ స్థాయిలో పెరుగుతుంది.
-
పీవోఈఎం లాంటి వేదికల ద్వారా 25 సంస్థలు తమ ఉపగ్రహాలను/ఉపవ్యవస్థలను వాస్తవ వాతావరణంలో పరీక్షించాయి.
-
అభివృద్ధి చెందుతున్న రంగంగా అంతరిక్షాన్ని ప్రభుత్వం గుర్తించింది. ప్రోత్సాహక పథకాల ద్వారా ఈ రంగంలో సంస్థలను ప్రోత్సహించేందుకు చురుకైన విధానాలను రూపొందిస్తోంది.
-
అంతర్జాతీయ ఏరోస్పేస్, అంతరిక్ష సరఫరా వ్యవస్థల్లో భారతీయ సంస్థలు నెమ్మదిగా తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నాయి.
ఈ సమాచారాన్ని లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, ప్రధానమంత్రి కార్యాలయం సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2226500)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13