జౌళి మంత్రిత్వ శాఖ
వస్త్ర పరిశ్రమపై ప్రభావం
నాడు పోస్టు చేయడమైనది:
10 FEB 2026 1:51PM by PIB Hyderabad
దేశీయ వస్త్ర, దుస్తుల పరిశ్రమ పోటీతత్వాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల కారణంగా గతేడాదితో పోల్చితే 2025 ఏప్రిల్-డిసెంబర్ మధ్య రెడీమేడ్ గార్మెంట్స్‌తో సహా వస్త్ర, దుస్తుల రంగంలో దిగుమతులపై భారత్ ఆధారపడటం 13.9% తగ్గింది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చిన రెడీమేడ్ గార్మెంట్స్ సహా వస్త్ర, దుస్తుల దిగుమతులు 705.4 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
2024లో భారత్ ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద వస్త్ర, దుస్తుల ఎగుమతిదారుగా నిలిచింది. 2025 ఏప్రిల్–డిసెంబర్ కాలంలో భారత్ మొత్తం 27,312.7 మిలియన్ డాలర్ల విలువైన వస్త్ర, దుస్తులను ఎగుమతి చేసిది. ఈ కాలంలో భారత వస్త్ర, దుస్తుల ఎగుమతులు 100కిపైగా దేశాల్లో వృద్ధిని నమోదు చేశాయి. ఇది మెరుగైన మార్కెట్ విస్తరణను, ఎగుమతి వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది. వస్త్ర, దుస్తుల ఎగుమతులను ప్రోత్సహించడానికి, ప్రపంచ పోటీతత్వాన్ని పెంచడానికి భారత ప్రభుత్వం అనేక కీలక విధానాలు, కార్యక్రమాలను అమలు చేసింది.
భారత్ మొత్తం 16 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటిలో ఇటీవల సంతకాలు చేసిన భారత్–ఒమన్ ఎఫ్ టీఏ కూడా ఉంది. అలాగే న్యూజిలాండ్, యూరోపియన్ యూనియన్‌తో ఒప్పంద చర్చలను భారత్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఒప్పందాలు ద్వారా టారిఫ్, నాన్-టారిఫ్ అడ్డంకులను తగ్గించడం, వాణిజ్య ప్రక్రియలను సులభతరం చేయడం, నిర్మాణాత్మక ఇబ్బందులను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. భాగస్వామ్య దేశాల మార్కెట్లలో భారత ఎగుమతులకు మెరుగైన అవకాశాలు లభించడమే కాకుండా పోటీతత్వం కూడా పెరుగుతుంది.
దేశవ్యాప్తంగా ఆధునిక, సమగ్ర, ప్రపంచ స్థాయి వస్త్ర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ రీజియన్స్ అండ్ అపెరెల్ (పీఎం మిత్రా) పార్కుల పథకం అమలు చేస్తున్నారు. భారీ స్థాయి తయారీని ప్రోత్సహించి, పోటీతత్వాన్ని పెంపొందించేందుకు ఎఎంఎఫ్ ఫ్యాబ్రిక్, దుస్తులు, టెక్నికల్ టెక్స్ టైల్స్‌పై దృష్టి సారిస్తూ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని అమలు చేస్తున్నారు. పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధి, ప్రోత్సాహం, మార్కెట్ అభివృద్ధిపై జాతీయ టెక్నికల్ టెక్స్ టైల్స్ మిషన్ దృష్టి సారిస్తోంది. వస్త్ర రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం డిమాండుకు అనుగుణంగా ఉపాధికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు అందించేందుకు సమర్థ్ పథకాన్ని అమలు చేస్తున్నారు. పట్టు పరిశ్రమ సమగ్ర అభివృద్ధి కోసం సిల్క్ సమగ్ర-2 పథకం అమలు చేస్తున్నారు. చేనేత రంగానికి పూర్తి స్థాయి మద్దతు అందించేందుకు జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం అమల్లో ఉంది. హస్తకళల ప్రోత్సాహం కోసం జౌళీ మంత్రిత్వ శాఖ జాతీయ హస్తకళల అభివృద్ధి కార్యక్రమం, సమగ్ర హస్తకళల క్లస్టర్ అభివృద్ధి పథకాన్ని కూడా అమలు చేస్తోంది. ఎంఎస్ఎంఈలతో సహా అర్హత కలిగిన ఎగుమతిదారులకు అదనపు రుణ సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ఫర్ ఎక్స్‌పోర్టర్స్(సీజీఎస్ఈ)ను ఆమోదించింది. దీని ద్వారా నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (ఎన్ సీజీటీసీ) రుణ సంస్థలకు 100 శాతం రుణ పొందే అవకాశాన్ని అందిస్తుంది.
నేడు లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీ పబిత్రా మార్గరీటా లిఖితపూర్వకంగా ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2225889)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9