ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భూమాత ఆశీర్వాదాలను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 10 FEB 2026 10:40AM by PIB Hyderabad

ధరణీమాత ఆశీర్వాదాలను చాటిచెప్పే ఈ కింది సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

‘‘అస్మే వోఅస్త్వింద్రియమస్మే నృమ్ణమృత్ క్రతురస్మే వర్చాంసి సన్తు వ:

నమో మాత్రే పృథ్వివ్యై నమో మాత్రే పృథివ్యా ఇయన్తే రాడ్ యన్తాసి యమనో ధ్రువోసి ధరుణ: కృష్ణ్యై త్వా క్షేమాయ త్వా రయ్యై త్వా పోషాయ త్వా’’

ఈ సుభాషితం ‘‘ మనం భూమాతకు శిరసు వంచి ప్రణామం చేద్దాం.. మనం సంపదనీ, జీవితానికి అత్యవసరమైన సాధనాల్నీ పొందుతోంది భూమి నుంచే. తల్లీ, నీవు దృఢంగానూ, సర్వాధారంగానూ ఉంటూ, అన్నీ సమతౌల్య స్థితిలో ఉండేలా చూస్తున్నావు. మేం వ్యవసాయం కోసం, సమృద్ధి కోసం, మా పోషణ కోసం నీవు సురక్షితంగా ఉండాలనే ప్రార్థిస్తున్నాం తల్లీ’’ అని పేర్కొంటోంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ అందులో -

‘‘అస్మే వోఅస్త్వింద్రియమస్మే నృమ్ణమృత్ క్రతురస్మే వర్చాంసి సన్తు వ:

నమో మాత్రే పృథ్వివ్యై నమో మాత్రే పృథివ్యా ఇయన్తే రాడ్ యన్తాసి యమనో ధ్రువోసి ధరుణ: కృష్ణ్యై త్వా క్షేమాయ త్వా రయ్యై త్వా పోషాయ త్వా’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2225819) సందర్శకుల సూచీ సంఖ్య : : 86