పర్యటక మంత్రిత్వ శాఖ
కేంద్ర రంగ పథకం ‘‘ప్రసాద్’’లో తెలంగాణ ప్రాజెక్టులు ఇవీ
నాడు పోస్టు చేయడమైనది:
06 FEB 2026 11:09AM by PIB Hyderabad
పర్యాటక మంత్రిత్వ శాఖ తన కేంద్ర రంగ పథకం ‘‘పిల్‌గ్రిమేజ్ రీజూవనేషన్ అండ్ స్పిరిచువల్, హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్’’ (ప్రసాద్.. PRASHAD)లో భాగంగా తీర్థయాత్ర స్థలాల్లో, వారసత్వ ప్రదేశాల్లో పర్యటన సంబంధిత మౌలిక సదుపాయాలను సంపూర్ణంగా తీర్చిదిద్ది ఆధ్యాత్మిక, తీర్థయాత్రానుభూతిని ఇప్పటి కన్నా ఎంతో మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రసాద్ స్కీములో భాగంగా ఈ మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రంలో రూ. 146.50 కోట్లు వ్యయమయ్యే 4 ప్రాజెక్టుల్ని మంజూరు చేసింది. ఆయా ప్రాజెక్టుల వివరాలు అనుబంధ పత్రంలో చూడవచ్చు.
ఈ సమాచారాన్ని కేంద్ర పర్యటన, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ 2026 ఫిబ్రవరి 5న రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.
**
అనుబంధ పత్రం
ప్రసాద్ స్కీములో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మంజూరు చేసిన ప్రాజెక్టుల జాబితా:
(రూ. కోట్లలో)
|
క్రమ
సంఖ్య
|
ప్రాజెక్టు పేరు
|
మంజూరు చేసిన
సంవత్సరం
|
మంజూరు చేసిన
మొత్తం
|
విడుదల చేసిన
మొత్తం
|
స్థితి
|
|
1.
|
అలంపూర్‌లోని జోగుళాంబా దేవి దేవస్థానం అభివృద్ధి
|
2020-21
|
38.90
|
33.07
|
పనులను పూర్తి చేశారు
|
|
2.
|
ములుగులోని రుద్రేశ్వర (రామప్ప) దేవాలయంలో తీర్థయాత్రా, వారసత్వ పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి
|
2022-23
|
62.00
|
32.73
|
పనులు పురోగమిస్తున్నాయి
|
|
3.
|
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో తీర్థయాత్రా ప్రధాన మౌలిక సదుపాయాల అభివృద్ధి
|
2022-23
|
41.38
|
8.43
|
పనులు పురోగమిస్తున్నాయి
|
|
4.
|
రేణుకా ఎల్లమ్మ దేవి దేవస్థానంలో మౌలిక వసతుల అభివృద్ధి
|
2024-25
|
4.22
|
0.00
|
పనులు పురోగమిస్తున్నాయి
|
***
(రిలీజ్ ఐడి: 2224769)
సందర్శకుల సూచీ సంఖ్య : : 34