పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కృష్ణా సర్క్యూట్‌ అభివృద్ధి

నాడు పోస్టు చేయడమైనది: 05 FEB 2026 3:42PM by PIB Hyderabad

పర్యాటక ప్రాంతాలుఉత్పత్తుల అభివృద్ధిప్రచారం ప్రధానంగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోకి వస్తుందిదేశంలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పాటు అందించడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ 2014-15లో స్వదేశ్ దర్శన్ (ఎస్ డీఎస్పథకాన్ని ప్రారంభించిందిఈ పథకం కింద కృష్ణా సర్క్యూట్‌తో సహా గుర్తించిన వివిధ నేపథ్య సర్క్యూట్లలో రూ. 5,290.33 కోట్ల వ్యయంతో 76 ప్రాజెక్టులను మంజూరు చేసిందిస్వదేశ్ దర్శన్ పథకం కింద కృష్ణా సర్క్యూట్‌లో మంజూరైన ప్రాజెక్టులు భౌతికంగా పూర్తయ్యాయివాటి వివరాలు అనుబంధంగా ఉన్నాయి.

 

సుస్థిర పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో స్వదేశ్ దర్శన్ పథకాన్ని ‘స్వదేశ్ దర్శన్ 2.0’గా పర్యాటక మంత్రిత్వ శాఖ పునరుద్ధరించిందిరూ. 2,208.31 కోట్లతో 53 ప్రాజెక్టులను మంజూరు చేసిందిదీనికి అదనంగా స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్ (సీబీడీడీకార్యక్రమం కింద రూ. 697.94 కోట్ల నిధులతో 38 ప్రాజెక్టులను కూడా మంజూరు చేసిందిపైన పేర్కొన్న పథకాల కింద గుజరాత్ రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు మంజూరయ్యాయి.

ఈ సమాచారాన్ని కేంద్ర పర్యాటకసాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ నేడు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు

 

కృష్ణా సర్క్యూట్‌లో స్వదేశ్ దర్శన్ పథకం కింద మంజూరైన ప్రాజెక్టుల వివరాలు

 

 

 వరుస సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

సర్క్యూట్ / మంజూరైన సంవత్సరం

ప్రాజెక్టు పేరు

మంజూరు చేసిన మొత్తం (కోట్లలో)

  1.  

హర్యానా

కృష్ణా సర్క్యూట్‌
2016-17

కురుక్షేత్రంలోని మహాభారతానికి సంబంధించిన ప్రదేశాలలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి

77.39

  1.  

రాజస్థాన్

కృష్ణా సర్క్యూట్‌
2016-17

జైపూర్‌లోని గోవింద్ దేవ్ జీ ఆలయంసికార్‌లోని ఖాటూ శ్యామ్ జీరాజసమంద్‌లోని నాథ్ ద్వారాల అభివృద్ధి

 

 


(రిలీజ్ ఐడి: 2224192) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी