శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
పార్లమెంటు ప్రశ్న: భారత్ జెన్ ఏఐ పాత్ర
నాడు పోస్టు చేయడమైనది:
05 FEB 2026 3:23PM by PIB Hyderabad
భారతీయ భాషలు, సామాజిక పరిస్థితులకు తగినట్టుగా సార్వభౌమ ఏఐ ఆధారిత విధానాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోన్న తొలి జాతీయ కార్యక్రమం భారత్‌జెన్. ఇది టెక్స్ట్ (లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ల ద్వారా), స్పీచ్ (టెక్స్ట్ టు స్పీచ్, ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్), విజన్-లాంగ్వేజ్ వ్యవస్థల వంటి బహుళ విధానాలకు విస్తరించింది.
ప్రస్తుతం మొత్తం 15 భాషలు- హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మైథిలి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగులో భారత్ జెన్ ఏఐ విధానాలు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే గుర్తింపు పొందిన 22 భారతీయ భాషలన్నింటినీ దీని పరిధిలోకి తీసుకువస్తారు.
ఆయుర్వేదం (ఆయుర్ పరమ్), భారతీయ వ్యవసాయం (అగ్రి పరమ్), భారతీయ న్యాయవ్యవస్థ (లీగల్ పరమ్) కోసం డొమైన్ నిర్దేశిత ప్రత్యేక మోడళ్లను భారత్ జెన్ విడుదల చేసింది. దీనికి అదనంగా, ఆరోగ్య సేవలు, వ్యవసాయం, విద్య, పరిపాలనలో అప్లికేషన్ల కోసం భారత్ జెన్ మోడళ్లు (టెక్స్ట్, స్పీచ్, విజన్) ఉపయోగపడతాయి.
భారత్ జెన్ నెట్‌వర్క్‌లో భాగంగా.. రెండు సాంకేతిక ఆవిష్కరణ కేంద్రాలు చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అవి ఐఐటీ బాంబేలో టీఐహెచ్ ఫౌండేషన్ ఫర్ ఐవోటీ, అండ్ ఐవోఈ, ఐఐటీ మద్రాసులో ఐఐటీఎం ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్. ఇవి శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్టీ)కు చెందిన నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ (ఎన్ఎం-ఐసీపీఎస్) పరిధిలో పనిచేస్తున్నాయి.
భారత్‌జెన్‌తో కలసి పనిచేస్తున్న సంస్థలు:
|
సంస్థ పేరు
|
భారత్‌జెన్‌లో వాటి పాత్ర
|
|
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబే
|
కన్సార్టియంలో ఉన్న భాగస్వామ్యులకు పరిశోధనలో మార్గదర్శకత్వం చేస్తూ, సమన్వయం చేసే ప్రధాన సంస్థ.
|
|
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్
|
విజన్-లాంగ్వేజ్ డాక్యుమెంట్ విధానాన్ని రూపొందించడం
|
|
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్
|
స్పీచ్ ఫౌండేషన్ మోడల్ అభివృద్ధి, మూల్యాంకనం చేయడం
|
|
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్
|
న్యాయపరమైన ఏఐ పరిశోధన, డొమైన్ నిర్దేశిత డేటాసెట్లు, బహుభాషా విధానాల కోసం టోకెనైజేషన్ వ్యూహాల అభివృద్ధి
|
|
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్
|
లార్జ్ లాంగ్వేజీ మోడళ్లు - ఎల్ఎల్ఎంల కోసం అధునాతన టోకెనైజేషన్, అనుకూలమైన పదకోశాన్ని రూపొందించడం
|
|
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మండీ
|
ఎల్ఎల్ఎంల కోసం సమర్థమైన శిక్షణా వ్యూహాలపై సమీకృత బహు భాషా విధాన అభివృద్ధి, పరిశోధన
|
|
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇండోర్
|
ఎల్ఎల్ఎంల ప్రమాణాల కోసం భారత్ కేంద్రక మార్పులు, బహుభాషా, బహుళ నమూనా డేటా సమీకరణ
|
***
(రిలీజ్ ఐడి: 2224127)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4