గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వికసిత్‌ భారత్‌- గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌ వేతన రేట్లు

నాడు పోస్టు చేయడమైనది: 03 FEB 2026 6:04PM by PIB Hyderabad

వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ-జీ రామ్‌ జీచట్టం 2025 సెక్షన్‌ 10 ప్రకారం అందించే శారీరక శ్రమ పనులకు సంబంధించి నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వేతన రేటును నిర్ణయించవచ్చుఅయితే ఈ వేతన రేటు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005లోని సెక్షన్ ప్రకారం ఉన్న ప్రస్తుత వేతన రేటు కంటే తక్కువ ఉండకూడదుఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టంలోని సెక్షన్‌ 10 ద్వారా ప్రత్యేక వేతన రేటును ఇంకా నిర్ణయించకపోతే.. అప్పటి వరకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005లోని సెక్షన్ కింద ఉన్న వేతన రేట్లే వర్తిస్తాయి.

 

ఈ చట్టంలోని సెక్షన్ 4 (3) ప్రకారం దినసరి వేతనాలను వారానికోసారి లేదా ఏ పరిస్థితిలోనైనా సరే పని పూర్తి చేసిన తేదీ నుంచి 15 రోజులకు మించకుండా వేతనాలను చెల్లించాలిచట్టంలోని షెడ్యూల్ II పేరా ప్రకారం మస్టర్ రోల్ (హాజరు జాబితాముగిసిన తేదీ నుంచి పదిహేను రోజులలోపు వేతనాల చెల్లింపు జరగకపోతే వేతన దారులు ఆ ఆలస్యానికి సంబంధించి పరిహారాన్ని పొందేందుకు అర్హులు.

 

ఈ సమాచారాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ కమలేష్ పాశ్వాన్ నేడు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంగా తెలియజేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2223116) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी