గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల (ఈఎమ్ఆర్ఎస్) విస్తరణ

నాడు పోస్టు చేయడమైనది: 04 FEB 2026 1:50PM by PIB Hyderabad

నక్షత్రం గుర్తు లేని ఒక ప్రశ్నకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ దుర్గాదాస్ ఉయికే ఈ రోజు రాజ్య సభలో సమాధానమిస్తూ2025 డిసెంబరుకు 723 ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలలు (ఈఎమ్ఆర్ఎస్‌లు) మంజూరు అయ్యాయన్నారు. వాటిలో దేశ వ్యాప్తంగా 499 ఈఎమ్ఆర్ఎస్‌లు పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. రాజస్థాన్‌‌కు 31 ఈఎమ్ఆర్ఎస్‌లను మంజూరు చేయగాఅన్నీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.

జన్ జాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా 2025 నవంబరు 15న 42 ఈఎమ్ఆర్ఎస్‌లను ప్రారంభించారు. వాటిలో రెండు ఈఎమ్ఆర్ఎస్‌లు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. నాలుగు ఈఎమ్ఆర్ఎస్‌లు తెలంగాణలో ఉన్నాయి 50 ఈఎమ్ఆర్‌ఎస్‌లకు శంకుస్థాపనలు చేశారు. అయితే ఆంధ్ర ప్రదేశ్‌ లేదా తెలంగాణలో ఏ ఈఎమ్ఆర్ఎస్‌కూ శంకుస్థాపనను చేపట్టలేదు. రాష్ట్రం వారీ స్థితిని అనుబంధ పత్రంలో చూడవచ్చు.

జార్ఖండ్‌ సహా దేశమంతటా ఈఎమ్ఆర్‌ఎస్‌లలో విద్యతో పాటు క్రీడాసదుపాయాల నాణ్యతను కూడా పెంపొందింపచేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. వీటిలో అనేక చక్కని సాధనాలు సమకూర్చిన తరగతి గదులుఆధునిక విద్యాబోధన పరికరాలుసైన్సుకంప్యూటర్ ల్యాబరేటరీలువిభిన్న విధాలైన జ్ఞానాన్ని బోధించేలా తీర్చిదిద్దిన గ్రంథాలయాలుఆట మైదానాలుక్రీడాసామగ్రిసంగీతంకళక్రీడల వంటి విద్యేతర కార్యకలాపాలకు కావలసిన సౌకర్యాలుడిజిటల్ విద్యాబోధనకు అనువుగా ఉండే స్మార్ట్ క్లాస్‌రూములుఇంటర్‌నెట్ సౌకర్యమున్న కంప్యూటర్ ల్యాబులుఉపాధి యోగ్యతను పెంపొందించే నైపుణ్యాభివృద్ధివృత్తి కళలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు తదితర హంగుల్ని సమకూర్చారు. 

అమెజాన్ భావి ఇంజినీరు (ఏఎఫ్ఈ) కార్యక్రమం ఒక సమగ్ర కార్యక్రమం. సేవలకు నోచుకోని వర్గాల వారికీ, సేవల్ని సరిపడినంత స్థాయులలో అందుకోలేక పోతున్న వర్గాల వారికీ కంప్యూటర్ సైన్సు విద్యాలభ్యతను పెంచడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఏఎఫ్ఈ కార్యక్రమాన్ని 298 ఈఎమ్ఆర్‌ఎస్‌లలో లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ (ఎల్ఎల్ఎఫ్) అమలుచేస్తోంది. దీన్లో భాగంగా అవర్ ఆఫ్ కోడ్‌తో పాటు కోడథాన్ వంటి క్రియ ప్రధాన మాడ్యూళ్ల సాయంతో కంప్యూటర్ సైన్స్ విద్యను ప్రయోగపూర్వకంగా అందిస్తారు. ఇవి ప్రోగ్రామింగ్‌లోసమస్యల పరిష్కారంలో అతి ముఖ్య నైపుణ్యాలు. నేటి డిజిటల్ మాధ్యమ  ప్రధాన ప్రపంచంలో రాణించాలంటే ఈ నైపుణ్యాలు ఎంతో కీలకం. 

                                                                                       అనుబంధ పత్రం

‘‘ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల (ఈఎమ్ఆర్ఎస్) విస్తరణ’’ గురించి శ్రీ మదన్ రాథోడ్శ్రీ ర్యాగా కృష్ణయ్యలతో పాటు శ్రీ దీపక్ యప్రకాశ్‌లు రాజ్య సభలో అడిగిన నక్షత్రం గుర్తు లేని ప్రశ్న సంఖ్యకు 2026 ఫిబ్రవరి 4 న అందించిన సమాధానంలో పార్ట్ (బి)లో పేర్కొన్న అనుబంధ పత్రంలోని వివరాలు

2025 నవంబరు 15న జన్‌జాతీయ గౌరవ్ దివస్’ సందర్భంగా  రాష్ట్రం వారీగా ప్రారంభించినశంకుస్థాపన చేసిన ఈఎమ్ఆర్ఎస్‌ల సంఖ్య వివరాలు

క్రమ సంఖ్య

రాష్ట్రం పేరు

ప్రారంభించిన

ఈఎమ్ఆర్ఎస్‌ల సంఖ్య

శంకుస్థాపన చేసిన

ఈఎమ్ఆర్ఎస్‌ల సంఖ్య

1

ఆంధ్ర ప్రదేశ్

2

-

2

అరుణాచల్ ప్రదేశ్

-

1

3

అస్సాం

2

1

4

ఛత్తీస్‌గఢ్

4

16

5

గుజరాత్

1

-

6

జార్ఖండ్

12

5

7

మధ్య ప్రదేశ్

3

-

8

మహారాష్ట్ర

1

4

9

మణిపూర్

-

5

10

మేఘాలయ

-

16

11

ఒడిశా

8

2

12

రాజస్థాన్

3

-

13

తెలంగాణ

4

-

14

త్రిపుర

2

-

 

మొత్తం

42

50

***


(రిలీజ్ ఐడి: 2223100) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil