ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బ్యాగేజీ నియమాలు-2026ను నోటిఫై చేసిన ప్రభుత్వం, నూతన కస్టమ్స్ బ్యాగేజీ (డిక్లరేషన్, ప్రాసెసింగ్) నిబంధనలు - 2026, మాస్టర్ సర్క్యులర్ జారీ


కొత్త నియమాలతో విధానాల సరళీకరణ, పారదర్శకత పెంపు, ఎలక్ట్రానిక్, ముందస్తు డిక్లరేషన్ల ఆమోదం, అవరోధాలు లేని క్లియరెన్స్‌కు హామీ

సాధారణ ఉచిత అలవెన్స్ పరిమితి పెంపు, విదేశాల నుంచి నివాసం మారేవారికి ప్రయోజనాలు, నగలపై ప్రత్యేక మినహాయింపులకు వీలు కల్పించే కొత్త మార్పులు

తాత్కాలిక దిగుమతులకు కొత్త నిబంధనలు, ఎలాంటి సుంకం లేకుండా ఒక ల్యాప్‌టాప్ (18 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న ప్రయాణికులకు), పెంపుడు జంతువుల దిగుమతి

మెరుగైన ప్రయాణ సౌలభ్యం

నాడు పోస్టు చేయడమైనది: 02 FEB 2026 9:58PM by PIB Hyderabad

బ్యాగేజి నియమాలు-2026ను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. అలాగే నూతన కస్టమ్స్ బ్యాగేజి (డిక్లరేషన్, ప్రాసెసింగ్) నియంత్రణలు-2026ను, మాస్టర్ సర్క్యులర్‌ను కూడా జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులకు సులభతరమైన, సవరించిన నిబంధనలను ఈ చర్యలు ప్రతిబింబిస్తాయి. అలాగే నూతన ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న ప్రయాణాలు, ప్రయాణికుల అంచనాలకు అనుగుణంగా ఇవి ఉంటాయి. మంత్రిత్వశాఖలు, ఎయిర్‌పోర్టు ఆపరేటర్లు, సంబంధిత నిపుణులతో సంప్రదింపులతో పాటు ప్రయాణికుల నుంచి స్వీకరించిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఈ మార్పులు చేపట్టారు. ఈ నియమాలు విధానాలను సులభతరం చేస్తాయి. పారదర్శకతను మెరుగుపరుస్తాయి. ఎలక్ట్రానిక్, ముందస్తు డిక్లరేషన్లకు అనుమతినిస్తాయి. అలాగే క్లియరెన్స్ సజావుగా జరిగేలా భరోసానిస్తాయి.

ప్రధానాంశాలు

1.  సాధారణ ఉచిత అలవెన్స్ పరిమితి పెంపు:

         I.   (i) సవరించిన నియమాలు ప్రస్తుత ప్రయాణ పరిస్థితులకు అనుగుణంగా సుంకం మినహాయింపు పరిమితిని పెంచాయి. వివిధ విభాగాలకు అందించే ప్రయోజనాలను దిగువ పేర్కొన్న విధంగా సవరించారు:

(రూపాయల్లో)

క్రమ సంఖ్య

ప్రయాణికుల విభాగం

సుంకం మినహాయింపు పరిమితి

1.

దేశ పౌరులు

75,000/-

2.

భారతీయ సంతతికి చెందిన పర్యాటకులు

75,000/-

3.

పర్యాటక వీసా కాకుండా.. చెల్లుబాటయ్యే వీసా ఉన్న విదేశీయులు

75,000/-

4.

విదేశాలకు చెందిన పర్యాటకులు

25,000/-

5.

సిబ్బంది

2,500/-

 

(ii) భూమార్గాల ద్వారా దేశంలోకి వచ్చే ప్రయాణికులకు ఎలాంటి మినహాయింపు ప్రయోజనాలుండవు.

  (iii)  విదేశాల నుంచి ఇక్కడకు నివాసం మారే వారికి ప్రయోజనాలు:

·  12 నెలల వరకు: రూ 1.5 లక్షలు

·  1–2 ఏళ్లు: రూ. 3 లక్షలు

·  2 ఏళ్లు దాటితే: రూ. 7.5 లక్షలు

అర్హత ప్రకారం మొత్తం విలువ ఆధారంగా సుంకం నుంచి మినహాయింపు ఉన్న వస్తువులన్నింటికీ కలిపి హేతుబద్దీకరించిన జాబితాను రూపొందించారు. దీని ద్వారా నివాస మార్పు ప్రయోజనాలను సరళీకరించి, ఆధునికీకరించారు. నూతన బ్యాగేజి నియమాలు - 2026లో ఈ వివరాలను పొందుపరిచారు.

 (నియమాలకు సంబంధించిన లింక్: https://taxinformation.cbic.gov.in/view-pdf/1010571/ENG/Notifications)

2.  ఆభరణాలకు ప్రత్యేక మినహాయింపు: పాత విలువ పరిమితులను తొలగించి బరువు ఆధారంగా ఆభరణాల కోసం ప్రత్యేక మినహాయింపులను కల్పించారు. దీని ద్వారా దేశానికి తిరిగి వస్తున్న పౌరులు/భారతీయ సంతతికి చెందిన పర్యాటకులకు (ఏడాది కంటే ఎక్కువ సమయం విదేశాల్లో నివసించిన అనంతరం) బరువు ఆధారంగా మాత్రమే సుంకం లేకుండా ఆభరణాలకు అనుమతినిస్తారు.

1.  మహిళలకు: 40 గ్రా. వరకు;

ఇతరులకు: 20 గ్రా. వరకు

3.  తాత్కాలిక దిగుమతికి కొత్త నిబంధనలు

తాత్కాలిక బ్యాగేజీ దిగుమతి లేదా ఎగుమతులకు సంబంధించిన తాత్కాలిక ధ్రువపత్రాన్ని జారీ చేసే సౌకర్యాన్ని ఇది కల్పిస్తుంది. అలాగే, ఆగమన సమయంలో ఎలాంటి అవరోధాలు లేని క్లియరెన్స్‌ అందించడానికి, వస్తువుల అనవసర జప్తును తగ్గించేందుకు సాయపడుతుంది.

4.  ఏకీకృత మినహాయింపులు:

ఈ నిబంధనలు ఒక ల్యాప్‌టాప్ (18 ఏళ్లు పైబడిన ప్రయాణికులకు), జంతువులకు సుంకం నుంచి మినహాయింపులను ఇస్తాయి.

5.  అమల్లోకి వచ్చే కొత్త నియమాలకు సంబంధించిన పూర్తి వివరాలను నూతన కస్టమ్స్ బ్యాగేజి (డిక్లరేషన్స్, ప్రాసెసింగ్) నిబంధనలు- 2026, మాస్టర్ సర్క్యులర్ అందిస్తాయి. గతంలోని 35 ఉత్తర్వులను ఏకీకృతం చేసి సవరించిన మాస్టర్ సర్క్యులర్‌‌ను రూపొందించారు.

(నియంత్రణలకు సంబంధించిన లింకు: https://taxinformation.cbic.gov.in/view-pdf/1010572/ENG/Notifications)

(ఉత్తర్వులకు సంబంధించిని లింకు: https://taxinformation.cbic.gov.in/view-pdf/1003304/ENG/Circulars)

6.  ప్రయాణికులకు సౌలభ్యం

సుంక రహిత పరిమితుల పెంపు, వస్తువుల అనవసర జప్తును తగ్గించడం, డిజిటల్, సరళీకరించిన విధానాలపై ఈ సవరించిన నియమాలు దృష్టి సారిస్తాయి. ఇవి ప్రయాణికులకు సౌకర్యాన్ని పెంపొందిస్తాయి. అదే సమయంలో కస్టమ్స్ విభాగాల్లో ఏకీకృత అమలు ద్వారా అంతర్జాతీయంగా అనుసంధానమై ఉన్న, పర్యాటక మిత్ర గమ్యస్థానంగా భారత దేశ స్థానాన్ని బలోపేతం చేస్తాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2222512) సందర్శకుల సూచీ సంఖ్య : : 173
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , हिन्दी