ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో ఆత్మవిశ్వాసానికి ఉన్న శక్తిని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 03 FEB 2026 9:20AM by PIB Hyderabad

అభివృద్ధి చెందిన భారత్‌ను  తీర్చిదిద్దడంలో ఆత్మవిశ్వాసం పోషించగల పరివర్తనాత్మక పాత్రను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘ఆత్మవిశ్వాసం ఒక శక్తి.. దీని అండతో అన్నీ సాధ్యమవుతాయి. వికసిత్ భారత్ కలను పండించుకోవడంలో దేశ ప్రజలకు ఈ శక్తి ఎంతగానో ఉపయోగపడుతుంది.
శ్రీర్మంగలాత్ ప్రభవతి ప్రాగల్భ్యాత్ సంప్రవర్ధతే
దాక్ష్యాత్ తు కురుతే మూలం సంయమాత్ ప్రతితిష్ఠతి’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2222510) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam