కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఉపగ్రహ సమాచార సేవలు
నాడు పోస్టు చేయడమైనది:
29 JAN 2026 6:31PM by PIB Hyderabad
గుజరాత్‌తో సహా దేశవ్యాప్తంగా గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్) సేవలను అందించడానికి ఏకీకృత లైసెన్సు (యూఎల్)ను జారీ చేయాలని కోరుతూ గత అయిదేళ్ల వ్యవధిలో నెల్కో లిమిటెడ్, యోటా నెట్వర్క్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ వెబ్ ఇండియా కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, స్టార్ లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ కైపర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, కనెక్ట్ 4 ష్యూర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ సమాచారాన్ని కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్ రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా వెల్లడించారు.
ఈ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం, వన్ వెబ్ ఇండియా కమ్యూనికేషన్స్ ప్రైవేటు లిమిటెడ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, స్టార్ లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు జీఎంపీసీఎస్ సేవలకు అధికారికంగా ఏకీకృత లైసెన్సు (యూఎల్)ను డీవోటీ జారీ చేసింది. నెల్కో లిమిటెడ్, యోటా నెట్వర్క్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ దరఖాస్తులను తిరస్కరించగా... కనెక్ట్ 4 ష్యూర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ తన దరఖాస్తును ఉపసంహరించుకుంది. అమెజాన్ కైపర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దరఖాస్తు పరిశీలన దశలో ఉంది.
గ్రామీణ, సేవలు తక్కువగా అందుబాటులో ఉన్న, అసలు అందుబాటులో లేని ప్రాంతాలతో పాటుగా మారుమూల, సముద్ర తీర, సరిహద్దు, పర్వత ప్రాంతాలకు అనుసంధానతను శాటిలైట్ ఆధారిత సమాచార సేవలు అందిస్తాయి. ఈ ప్రాంతాలను ఆప్టికల్ ఫైబర్, మైక్రోవేవ్, తదితర భూతల పద్ధతుల ద్వారా అనుసంధానించడం కష్టతరంగా ఉంటుంది. లైసెన్సు పొందిన వారు.. అధీకృత సేవా ప్రాంతంలో దరఖాస్తు చేసుకున్న ఏ వ్యక్తికైనా ఎలాంటి వివక్ష లేకుండా శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలను అందించాలని లైసెన్సు నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.. డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో, చివరి వ్యక్తి వరకు అనుసంధానించడంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడంలో, డిజిటల్ సేవలను అందరికీ సమానంగా అందించడంలో ఇది తోడ్పడుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2221046)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16