రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రోడ్డు దుర్ఘటన బాధితులకు నగదు రహిత చికిత్స

నాడు పోస్టు చేయడమైనది: 29 JAN 2026 4:17PM by PIB Hyderabad

మోటారు వాహనాల చట్టం-1988 లోని 162వ సెక్షన్లో భాగంగా ఉన్న చట్టపరమైన నియమానికి అనుగుణంగా రోడ్డు దుర్ఘటన బాధితులకు నగదు రహిత చికిత్సను అందుబాటులోకి తీసుకు రావడానికి ‘‘రోడ్డు దుర్ఘటన బాధితుల కోసం నగదు రహిత చికిత్స పథకం-2025’’ను 2025 మే 5వ తేదీతో ఎస్.ఒ. 2015 (ఈ)గా పేర్కొంటూ, నోటిఫై చేశారు. దీనికి అదనంగా, ఈ పథకాన్ని ప్రభావవంతంగా అమలు చేసే దిశగా ప్రక్రియ, వివిధ లబ్దిదారులు  పోషించాల్సిన పాత్రలు, బాధ్యతలతో పాటు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీస్) విస్తృత వివరణను అందించే సమగ్ర మార్గదర్శకాల్ని కూడా 2025 మే 5వ తేదీతో ఎస్.ఒ. 2489 (ఈ)గా పేర్కొంటూ, జారీ చేశారు.
ఈ పథకంలోని ప్రధాన అంశాలు ఈ కింద ప్రస్తావించిన విధంగా ఉన్నాయి:
దుర్ఘటన జరిగిన రోజు మొదలు గరిష్ఠంగా 7 రోజుల లోపల, బాధితుల్లో ప్రతి ఒక్కరికీ రూ.1.5 లక్షల వరకూ చికిత్స కవరేజిని అందిస్తారు. ఏ శ్రేణి రహదారిపైన అయినా సరే మోటారు వాహనాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రమేయమున్న బాధితులకు చికిత్స సదుపాయం అందుబాటులో ఉంటుంది.    
రోడ్డు దుర్ఘటనలో గాయపడ్డ  మోటారు వాహన బాధితుల్లో ప్రతి ఒక్కరికీ పోలీసుల శీఘ్ర ప్రతిస్పందనను బట్టి, ప్రాణాంతకం కాని కేసుల్లో 24 గంటల వరకూ, ప్రాణాంతక కేసుల్లో 48 గంటల వరకూ డిజిగ్నేటెడ్ ఆసుపత్రుల్లో స్థిరీకరణ ప్రధానమైన చికిత్సను అందిస్తారు. ఈ చట్టబద్ధ పథకానికి కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లోని మరే ఇతర పథకాల కన్నా ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చారు.
ప్రస్తుతమున్న డిజిటల్ వేదికలు రెండింటిని ఏకీకరించి ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. ఈ వేదికల్లో మొదటిది.. రోడ్డు ప్రమాదాల రిపోర్టింగ్ కోసం పోలీస్ అధికారులు ఉపయోగిస్తున్న ఈడీఏఆర్ (ఎలక్ట్రానిక్ డిటెయిల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్..eDAR) కాగా, రెండోది.. చికిత్స, క్లెయిము సమర్పణ, చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేయడానికి గాను ఆసుపత్రులు ఉపయోగిస్తున్న జాతీయ ఆరోగ్య ప్రాధికరణ సంస్థ (ఎన్‌హెచ్ఏ)కు చెందిన టీఎంఎస్ 2.0 (ట్రాన్సాక్షన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ 2.0).
మోటారు వాహనాల దుర్ఘటన నిధి (ఎంవీఏఎఫ్) ద్వారా ఆసుపత్రులకు రీయింబర్స్‌మెంటు చేస్తారు. ఈ నిధికి సాధారణ బీమా కంపెనీల తోడ్పాటుతో ఆర్థిక సహాయాన్ని సమకూరుస్తారు.. దీన్లో దుర్ఘటనలో ప్రమేయమున్న మోటారు వాహనం బీమా సదుపాయాన్ని కలిగివుంటుంది. బీమా సదుపాయం లేని కేసుల్లో, ప్రభుత్వ బడ్జెటరీ సహాయం రూపేణా ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.
2025 జూన్ 4వ తేదీ తో కూడిన ఎస్.ఒ. 2489(ఈ) ద్వారా నోటిఫై చేసిన పథకం మార్గదర్శకాల్లో పేర్కొన్న ప్రకారం, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై)లో భాగంగా సూచీలో చేర్చుకున్న (ఎంప్యానల్డ్) అన్ని ఆసుపత్రులనూ ఈ పథకం ప్రయోజనాల రీత్యా స్వీయ నామనిర్దేశిత (డిజిగ్నేటెడ్) ఆసుపత్రులుగా పరిగణిస్తారు. దీనికి తోడు రాష్ట్రాలకూ, కేంద్ర పాలిత ప్రాంతాలకూ అదనపు ఆసుపత్రుల డిజిగ్నేషన్ కోసమూ, సూచీలో చేర్చుకోవడం కోసమూ విస్తృత మార్గదర్శకాల్ని 2025 మే 20 తేదీ తో ఎన్‌హెచ్ఏ జారీ చేసిన ఓఎమ్ ఎస్-12018/81/2024 లో పేర్కొన్నది.    
ఈ పథకాన్ని ప్రస్తుతమున్న ఈడీఏఆర్, టీఎంఎస్ 2.0 అనే రెండు వేదికలనూ కలిపేసి.. అమలు చేస్తున్నారు. తప్పు చేసిన వాహనం తాలూకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ స్టాటస్‌ను ఈడీఏఆర్‌లో నమోదు చేస్తారు.. ఎందుకంటే ఇది ‘వాహన్’ (VAHAN) పోర్టల్‌తో మిళితమై ఉంటుంది.    
హిట్ అండ్ రన్ మోటార్ దుర్ఘటన బాధితుల కోసం ఒక ప్రత్యేక పరిహార పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకు వచ్చింది. ఈ పథకంలో భాగంగా.. దుర్ఘటనలో మరణం సంభవించిన పక్షంలో రూ.2 లక్షలు. తీవ్ర గాయం బారిన పడిన స్థితిలో రూ.50,000 అందజేస్తారు. పథకంలో భాగంగా హిట్ అండ్ రన్ మోటార్ దుర్ఘటన బాధితులకు పరిహారాన్ని నిర్ధారిత సమయ బద్ధ ప్రక్రియ ప్రకారం అందిస్తారు.
ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) ఒక లాభాధారిత ఆరోగ్య బీమా పథకం. దీన్లో భాగంగా లబ్ధిదారుల గుర్తింపు ముందుగానే నిర్ధారితం కావడంతో పాటు ప్రమాణీకరణ కూడా పూర్తి అవుతుంది. దీనికి భిన్నంగా, రోడ్డు దుర్ఘటన బాధితుల కోసం నగదు రహిత చికిత్స పథకమనేది మోటారు వాహన చట్టం-1988 లో సెక్షన్ 162లో భాగంగా ఒక చట్టపరంగా అనివార్యమైన పథకంగా ఉంది. ఇది ఎలాంటి పథకమంటే, దీన్లో ఏ శ్రేణికి చెందిన రోడ్డు పైన అయినా సరే మోటారు వాహనం వల్ల రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధిత వ్యక్తి లేదా వ్యక్తులు ఎవరైనా లబ్ధిదారు కావచ్చు.
రోడ్డు ప్రమాద బాధిత వ్యక్తి నిర్ధారిత సమయం లోపల ఆసుపత్రికి చేరుకోవడానికి వీలుగా 112 అత్యవసర ప్రతిస్పందన సమర్థన వ్యవస్థ (ఈఆర్ఎస్ఎస్)తో సమన్వయాన్ని కల్పించారు. బాధిత వ్యక్తి, లేదా వ్యక్తులకు దగ్గరి డిజిగ్నేటెడ్ ఆసుపత్రి వరకు చేరుకోవడానికి 112 కు చెందిన ఆపరేటరు మార్గదర్శనం చేస్తారు. అవసరమైతే అంబులెన్స్ సదుపాయాన్ని కూడా సమకూరుస్తారు.
చికిత్సను ఎన్‌హెచ్ఏ నిర్ధారించిన ప్రామాణిక ఆరోగ్య ప్రయోజన ప్యాకేజీలకు అనుగుణంగా బాధితులకు అందిస్తారు. చికిత్స పూర్తి అయ్యి బాధిత వ్యక్తి పథకం నుంచి బయటకు వచ్చిన తరువాత, ఆసుపత్రికి అవసరమైన డాక్యుమెంట్లతో పాటు స్టేట్ హెల్త్ ఏజెన్సీ (ఎస్‌హెచ్ఏ)కు క్లెయిమును సమర్పించవలసి ఉంటుంది.
క్లెయిమును సరి చూడడం, ఆమోదించడం ఎస్‌హెచ్ఏ ద్వారా పూర్తి చేస్తారు. ఆసుపత్రుల్లో సమయానికి చెల్లింపు జరిగేటట్టు చూడడానికి క్లెయిమును ఎస్‌హెచ్ఏ ఆమోదించిన తరువాత జిల్లా కలెక్టర్లకు గాని, లేదా జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్‌కు గాని సంబంధిత ఆసుపత్రులకు చెల్లింపు చేయడానికి గాను 10 రోజుల గడువును నిర్ధారించారు.
ఈ పథకంలో భాగంగా దుర్ఘటనను గురించి తెలియజేయడం మొదలు బాధితులను చేర్చుకోవడం, చికిత్స అందించడం, పోలీసు ప్రమాణీకరణ, క్లెయిము ప్రోసెసింగుతో పాటు తుది చెల్లింపు వరకూ పూర్తి డిజిటల్ ప్రక్రియను రికార్డు చేయడమనేది 112 ఈఆర్ఎస్ఎస్ ప్లాట్‌ఫారం ద్వారా జరుగుతుంది.
రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చైతన్యాన్ని పెంచడంతో పాటు దీనికి అదనంగా సెంట్రల్ కమ్యూనికేషన్ బ్యూరో ద్వారా కూడా సడక్ సురక్షా అభియాన్‌ను (రహదారి భద్రత ఉద్యమం) తీసుకువచ్చారు. పథకం సహా సంబంధిత కార్యక్రమాలు, విధానాల్ని గురించి సామాన్య ప్రజల్లో అవగాహనను విస్తరింపచేయడమే ఈ అభియాన్ ఉద్దేశం.
రోడ్డు రవాణా, హైవేల శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ జైరాం గడ్కరీ గారు లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారాన్ని తెలియజేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2221044) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी