ప్రధాన మంత్రి కార్యాలయం
జాతిపిత మహాత్మాగాంధీకి ప్రధానమంత్రి నివాళి
प्रविष्टि तिथि:
30 JAN 2026 10:41AM by PIB Hyderabad
జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారు. స్వదేశీ భావనకు బాపు ఎల్లప్పుడూ ప్రాధాన్యమిచ్చేవారని, ఇదే అభివృద్ధి చెందిన, స్వావలంబన సాధించిన భారత్ అనే సంకల్పానికి మూలాధారమని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఆయన వ్యక్తిత్వం, చేసిన పనులు కర్తవ్య మార్గంలో నడిచేలా ఈ దేశ ప్రజలను ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి’’ అని శ్రీ మోదీ చెప్పారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘జాతి పిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. స్వదేశీ భావనకు పూజనీయులైన బాపు ఎల్లప్పుడూ ప్రాధాన్యమిచ్చేవారు. ఇది వికసిత్, ఆత్మనిర్భర భారత్ సాధించాలనే మన సంకల్పానికి ఆధారభూతంగా నిలిచింది. కర్తవ్య మార్గంలో నడిచేలా ఈ దేశ ప్రజలకు ఆయన వ్యక్తిత్వం, కృషి ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.’’
(रिलीज़ आईडी: 2220843)
आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam