ప్రధాన మంత్రి కార్యాలయం
బాపూ అందించిన అహింసా సందేశానికి ఉన్న ప్రాధాన్యాన్ని చాటి చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
30 JAN 2026 10:30AM by PIB Hyderabad
మానవ జాతిని రక్షించడంలో అహింసకు ఎంతయినా ప్రాధాన్యం ఉందని పూజ్య బాపూ చెప్పారు. ఈ సంగతిని ప్రస్తావించే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
‘‘అహింసా పరమో ధర్మస్తథాహింసా పరంతప:
అహింసా పరమం సత్యం యతో ధర్మ: ప్రవర్తతే’’.
అహింస పరమ ధర్మం, అహింసయే అత్యున్నత తపస్సు. అహింస ఒక్కటే పరమ సత్యం, అన్ని ధర్మాలూ ఈ భావాన్ని తలదాల్చే ఏర్పడ్డాయి.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశంలో:
‘‘పూజ్య బాపూ మానవ జాతి రక్షణను దృష్టిలో పెట్టుకొని అహింసకే ఎల్లప్పుడూ పెద్దపీట వేశారు. ఆయుధంతో అవసరం లేకుండానే, ఈ ప్రపంచాన్ని మార్చివేసే శక్తి దీన్లో ఉంది.
‘‘అహింసా పరమో ధర్మస్తథాహింసా పరంతప:
అహింసా పరమం సత్యం యతో ధర్మ: ప్రవర్తతే’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2220842)
సందర్శకుల సూచీ సంఖ్య : : 34
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam