పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జనవరి 31న భారత్ పర్వ్- 2026 ముగింపు వేడుకలు ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా హాజరుకానున్న భారత ఉపరాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 30 JAN 2026 2:53PM by PIB Hyderabad

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఏడాది ఢిల్లీలోని ఎర్రకోట ముందున్న జ్ఞాన్ పథ్మైదానాల్లో జనవరి 26 నుంచి 31 వరకు పర్యాటక మంత్రిత్వ శాఖ ‘భారత్ పర్వ్’ను నిర్వహిస్తోంది.

ఈ భారత్ పర్వ్ 2026 ముగింపు వేడుకలు జనవరి 31న సాయంత్రం 5:30 గంటలకు జరగనున్నాయిఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా విచ్చేయడానికి అంగీకరించారు.

భారతదేశపు సాంస్కృతికసృజనాత్మక వారసత్వాన్ని సజీవంగా ప్రతిబింబించే విస్తృత వేదికగా భారత్ పర్వ్ నిలుస్తోందిఇందులో గణతంత్ర దినోత్సవ శకటాలుసాయుధ దళాల బ్యాండ్ ప్రదర్శనలువివిధ రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలుఉత్తర ప్రాంత సాంస్కృతిక కేంద్రాలుఢిల్లీకి చెందిన సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ వేడుకల్లో అఖిల భారత ఆహార ప్రదర్శనహస్తకళలుచేనేత బజార్కేంద్ర మంత్రిత్వ శాఖలురాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయివీటితో పాటు సందర్శకులను ఆకట్టుకునేలా స్టూడియో కిచెన్ సెషన్లువీధి నాటకాలుసొంతంగా తయారు చేయడం(డీఐవైకార్యశాలల వంటి ఆసక్తికరమైన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమం 31 జనవరి 2026 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంటుందిభారత్ పర్వ్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందిప్రతిరోజూ సుమారు 35,000 నుంచి 40,000 మంది సందర్శకులు హాజరవుతున్నారు.


(రిలీజ్ ఐడి: 2220837) సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , हिन्दी