ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీలో జరిగిన వార్షిక ఎన్‌సీసీ ర్యాలీ విశేషాలను పంచుకున్న ప్రధానమంతి

प्रविष्टि तिथि: 28 JAN 2026 9:02PM by PIB Hyderabad

నేడు ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వార్షిక ఎన్‌సీసీ పీఎం ర్యాలీ విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఎన్‌సీసీ దినోత్సవం సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాడెట్లు,  టాబ్లో కళాకారులు, జాతీయ రంగశాలకు చెందిన సహచరులు, దేశం నలుమూలలా నుంచి వచ్చిన యువకుల సమన్వయ ప్రదర్శనల్లో వారి కృషి స్పష్టంగా కనిపించిందని అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన వరుస పోస్టుల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు.

‘‘ఈ రోజు ఉదయం జరిగిన విమాన ప్రమాదం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ అజిత్ పవార్‌తోపాటు కొంతమంది సహచరులను మన నుంచి దూరం చేసింది. రాష్ట్ర, దేశ అభివృద్ధికి అజిత్‌ దాదా కీలక సేవలు అందించారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన ప్రతి కుటుంబాలకు ఈ విషాద సమయంలో మేము అండగా ఉంటాం’’.

“నేడు ప్రపంచమంతా యువ భారత్‌ యువ శక్తివైపు ఎంతో విశ్వాసంతో చూస్తోంది. ఈ నమ్మకానికి కారణం.. మాతృభూమిపై ఉన్న అపారమైన గౌరవం, కర్మభూమిపై ఉన్న అసమానమైన అంకితభావం’’

‘‘యూరోపియన్ యూనియన్‌తో కుదిరిన ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’ ఒప్పందం..అంటే భారతీయ యువతకు ఐరోపాలోని 27 దేశాల్లో సరికొత్త అవకాశాలు అందుబాటులోకి రావడమే’’

‘‘మన స్వదేశీ ఆయుధాలు ఎంత అత్యాధునికంగా, హైటెక్‌గా ఉన్నాయో ఆపరేషన్ సిందూర్ స్పష్టంగా నిరూపించింది. నేడు కృత్రిమ మేధ, రక్షణ రంగ ఆవిష్కరణలు మన సాయుధ దళాలను మరింత ఆధునికంగా మారుస్తున్నాయి. దీని వల్ల మన యువ సహచరులకు అవకాశాలు ఎంతో విస్తృతమయ్యాయి’’

‘‘యువ ఓటర్ల కోసం దేశంలో ఇప్పుడు ఒక కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్‌సీసీ-ఎన్‌ఎస్‌ఎస్‌ మేరా యువ భారత్ సంస్థలు కలిసి తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని గౌరవించేలా ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు’’.

‘‘ఏక్ పేడ్ మా కే నామ్’’ (అమ్మ పేరుతో ఒక మొక్క) ప్రచారంలో భాగంగా ఎన్‌సీసీ దాదాపు 8 లక్షల మొక్కలను నాటిందని తెలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది. మనం నాటిన మొక్కలు చక్కగా పెరిగేలా చూడటం కూడా మన బాధ్యతే’’

“రాబోయే కాలంలో మన యువత ఎంత ఫిట్‌గా ఉంటారనేది వారికి ఎదురయ్యే అతిపెద్ద పరీక్ష. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలని వారికి నా ప్రత్యేక విన్నపం’’.

 

***


(रिलीज़ आईडी: 2219865) आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Assamese , Gujarati , Malayalam