ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏఐ ఇంపాక్ట్ సదస్సులో కృత్రిమ మేధ ప్రభావం, సార్వభౌమ విధానాలు, భద్రతా విధానాలను ప్రదర్శించనున్న భారత్


బలమైన సెమీకండక్టర్ వ్యవస్థ వల్ల ప్రపంచానికి విశ్వసనీయమైన భాగస్వామిగా మారిన భారత్: దావోస్‌లో భారత్

2030 నాటికి 7 నానోమీటర్, 2032 నాటికి 3 నానోమీటర్ల టెక్నాలజీలు సిద్ధం: దావోస్‌లో భారత్

ఈ ఏడాదే నాలుగు యూనిట్లలో దేశీయంగా చిప్ ఉత్పత్తి ప్రారంభం: అశ్వనీ వైష్ణవ్

प्रविष्टि तिथि: 21 JAN 2026 4:13PM by PIB Hyderabad

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం-2026లో భాగంగా నిర్వహించిన వివిధ చర్చల్లో కేంద్ర ఎలక్ట్రానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీరైల్వేలుసమాచారప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ పాల్గొన్నారువాటిలో.. కృత్రిమ మేధసెమీకండక్టర్లుడీప్ టెక్ ఆవిష్కరణల్లో భారత్ అనుసరిస్తున్న సమగ్ర విధానాన్ని ఆయన వివరించారు.

ప్రభావంగ్లోబల్ సౌత్భద్రతపై దృష్టి సారించే ఏఐ ఇంపాక్ట్ సదస్సు

ఫలితాలపైనే స్పష్టమైన దృష్టి సారిస్తూ త్వరలో జరగబోయే ఏఐ ఇంపాక్ట్ సదస్సు రూపుదిద్దుకుందని శ్రీ వైష్ణవ్ తెలిపారుఈ సదస్సు ప్రధాన లక్ష్యం ‘ప్రభావం’ అని ఆయన తెలిపారుఅంటేసామర్థ్యాన్ని మెరుగుపరచడానికిఉత్పాదకతను పెంపొందించడానికిఆర్థికరంగంపై గుణాత్మక ప్రభావం చూపించేలా ఏఐ విధానాలుఅనువర్తనాలుమొత్తం ఏఐ వ్యవస్థను ఎలా ఉపయోగించవచ్చో తెలియజేస్తుంది.

రెండో లక్ష్యం ముఖ్యంగా భారత్గ్లోబల్ సౌత్ దేశాలకు ‘అందుబాటులో ఉండటం’ అని చెప్పారుయూపీఐడిజిటల్ ప్రజా మౌలిక వసతులు (డీపీఐస్టాక్‌ను నిర్మించడంలో భారత్ సాధించిన విజయాన్ని ఉదహరిస్తూ.. ఏఐ కోసం ఇదే తరహా సులభమైనసరసమైన ధరలకే స్టాక్‌ను అభివృద్ధి చేయడానికి ప్రపంచం భారత్ వైపు చూస్తోందని శ్రీ వైష్ణవ్ అన్నారు.

ఏఐ ఇంపాక్ట్ సదస్సు మూడో లక్ష్యం ‘భద్రత’ అని మంత్రి తెలియజేశారుతగిన భద్రతా వ్యవస్థలుమార్గనిర్దేశకాలురక్షణ సౌకర్యాలను రూపొందించడం ద్వారా ఏఐ విషయంలో నెలకొన్న ఆందోళనలను పరిష్కరించాల్సిన అవసరం ఉందనిఏఐ కోసం నియంత్రణభద్రతా స్టాక్‌ సైతం భారత్‌లోనే తయారుచేయాలన్నారు.


 

ఈ సదస్సులో ప్రపంచ నాయకులుసాంకేతిక నిపుణులు పాల్గొంటారని ఆయన చెప్పారుఅలాగే పెట్టుబడుల ప్రకటనలుభారత ఏఐ విధానాల ఆవిష్కరణ ఉంటాయని తెలిపారు.

అంకుర సంస్థల వృద్ధిడీప్ టెక్ జోరు

ప్రస్తుతం భారత్‌లో సుమారుగా 2,00,000 అంకుర సంస్థలు ఉన్నాయనిప్రపంచంలోనే మూడు అగ్ర అంకుర సంస్థల వ్యవస్థల్లో ఒకటిగా ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారుడీప్ టెక్‌పై పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో గత దశాబ్దంలో ప్రాథమిక మార్పు చోటు చేసుకుందని తెలిపారు

అంకుర సంస్థలకు అత్యంత సవాలుతో కూడుకున్న రంగాల్లో ఒకటైన చిప్ తయారీలో 24 భారతీయ అంకుర సంస్థలు నిమగ్నమయ్యాయనివాటిలో 18 సంస్థలకు మూలధన పెట్టుబడులు లభించాయని తెలియజేశారు.ఇది భారత డీప్ టెక్ సామర్థ్యాలపై పెరుగుతున్న విశ్వాసాన్ని సూచిస్తుందన్నారు.

సెమీకండక్టర్ల కోసం ప్రణాళిక

భారత దేశ సెమీకండక్టర్ల వ్యూహాన్ని శ్రీ వైష్ణవ్ వివరించారుఅంతర్జాతీయంగా తయారవుతున్నచిప్పుల్లో 75 శాతం 28 నానో మీటర్ల నుంచి 90 నానోమీటర్ల పరిధిలోకి వస్తున్నాయన్నారువీటిని విద్యుత్ వాహనాలుఆటోమొబైల్స్రైల్వేలురక్షణ వ్యవస్థలుటెలికాం పరికరాలుపెద్ద స్థాయిలో ఎలక్ట్రానిక్ వినియోగ వస్తువుల్లో ఉపయోగిస్తున్నారని తెలిపారు.

ఈ రంగంలో అధునాతన నోడ్స్ దిశగా వెళ్లడానికంటే ముందే.. తయారీపై పట్టు సాధించడంపై భారత్ దృష్టి కేంద్రీకరించిందని తెలియజేశారుఐబీఎంతో సహా పారిశ్రామిక భాగస్వాములతో కలసి పనిచేస్తూ.. 2030 నాటికి 28 నుంచి నానోమీటర్లకు, 2032 నాటికి నానోమీటర్లకు చేరుకోవాలని భారత్ స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుందని వెల్లడించారు.

విస్తారమైన ప్రతిభడిజైన్ సామర్థ్యాలువిస్తరిస్తున్న తయారీవేగంగా విస్తరిస్తున్నఎలక్ట్రానిక్స్ మార్కెట్‌‌ను ఉదహరిస్తూ.. సెమీకండక్టర్ రంగంలో అంతర్జాతీయంగా నాలుగు లేదా అయిదు అగ్రదేశాల జాబితాలో భారత్ చేరుతుందన్న విశ్వాసాన్నిఆయన వ్యక్తం చేశారు.

దావోస్‌లో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌తో శ్రీ వైష్ణవ్ సమావేశమయ్యారుఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఏఐ డేటా సెంటర్‌దేశీయ అంకుర సంస్థలతో భాగస్వామ్యాలతో సహా భారత దేశ ఏఐ వ్యవస్థను గూగుల్ బలోపేతం చేస్తోందిఅలాగే దావోస్‌లో మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ అధికారి జోయల్ కప్లన్‌తో కూడా భేటీ అయ్యారుడీప్ ఫేక్ఏఐ రూపొందించిన కంటెంట్ నుంచి సామాజిక మాధ్యమ వినియోగదారులకు భద్రత కల్పించడంపై చర్చించారువినియోగదారుల రక్షణ కోసం మెటా చేస్తున్న ప్రయత్నాల గురించి మంత్రికి మెటా వివరించింది.

మొత్తం ఏఐ మౌలిక వ్యవస్థపై పనిచేస్తున్న భారత్

ఏఐ రంగంలో అయిదు అంచెలున్నాయని శ్రీ వైష్ణవ్ వివరించారుఅవిఅనువర్తనంనమూనాసెమీకండక్టర్ లేదా చిప్డేటా సెంటర్ల వంటి మౌలికవసతులుఇంధన దశలుఆర్థిక వ్యవస్థ పరిమాణంసాంకేతిక పరిజ్ఞానం ఉన్న జనాభాప్రపంచవ్యాప్తంగా భారతీయ ఐటీ సంస్థల ఉనికి ఆధారంగా.. ఈ అయిదు దశల్లోనూ భారత్ పనిచేస్తోందని ఆయన తెలిజేశారు.

అప్లికేషన్వినియోగ దశ పెట్టుబడులపై అధిక రాబడిని అందిస్తుందని స్పష్టం చేశారుసంస్థల పనితీరును వేగంగా అర్థం చేసుకొనిఏఐ టెక్నాలజీలను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ఏఐ అప్లికేషన్లలో అగ్రస్థానానికి భారత్ చేరుకోవాలన్నారు. 33 శాతం పెరిగిన ఏఐ నియామకాలతో ఈ దిశగా భారతీయ ఐటీ సేవల సంస్థలు ముందుకు వెళుతున్నాయన్నారు.

చిన్న నమూనాలుసార్వభౌమ సామర్థ్యందక్షత

ప్రస్తుతం 95 శాతం వరకు ఏఐ పనులను చిన్న నమూనాలే చేపడుతున్నాయని కేంద్ర మంత్రి అన్నారుచాల వరకు సంస్థల అవసరాలకు 50 బిలియన్ పరామితుల విధానం సరిపోతుందన్నారుదాదాపుగా 12 ఏఐ నమూనాలను భారత్ అభివృద్ధి చేస్తోందనిఇవి చిన్న జీపీయూ వ్యవస్థలపై కూడా పనిచేయగలవనిఅధిక జనాభాకు తక్కువ ఖర్చుతోనే ఏఐ సేవలను అందిస్తాయని తెలియజేశారు.

సార్వభౌమ ఏఐ విధానాల ప్రాధాన్యాన్ని ఆయన స్పష్టం చేస్తూ.. అంతర్జాతీయ వనరులను వినియోగించుకోవడంలో ఆటంకం ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ఇలాంటి విధానాలు అవసరమన్నారుసామర్థ్యంచౌకగా లభించడంసార్వభౌమత్వం కేంద్రంగా ఉన్న ఈ విధానం అంతర్జాతీయ ఏఐ రంగంలో భారత్‌ను పోటీలో నిలుపుతుందని తెలిపారు.

వీటిలో అనేక నమూనాలను వివిధ స్థాయుల్లోవాస్తవ జీవిత వినియోగంలో పరీక్షించినట్లు శ్రీ వైష్ణవ్ తెలిపారుత్వరలోనే పూర్తి స్థాయి విధానాలను ప్రారంభించే స్థాయికి భారత్ చేరుకుంటుందన్నారు

ఏఐ మౌలిక వసతులుఇంధన సన్నద్ధత

దాదాపుగా 70 బిలియన్ల ఏఐ మౌలిక సదుపాయాల పెట్టుబడులు ఇప్పటికే ఖరారయ్యాయనిఆచరణలోకి వచ్చాయని మంత్రి చెప్పారుఏఐ రంగానికి ఇంధన రంగం కీలకమైందని వివరిస్తూ.. శాంతి చట్టం ద్వారా అణు ఇంధన రంగంలో ప్రైవేటు రంగానికి భాగస్వామ్యం కల్పించామనిఇది మొత్తం ఏఐ వ్యవస్థకు తోడ్పాటును అందిస్తుందని తెలియజేశారు.

బహుళ దశాబ్ద ఏఐ ప్రయాణంఆవిష్కరణల సామర్థ్యం 

ప్రస్తుతం ప్రపంచం ఏఐ విప్లవం ఆరంభ దశలో ఉందనిరాబోయే కొన్ని దశాబ్దాల పాటు ఇది కొనసాగుతుందని శ్రీ వైష్ణవ్ చెప్పారుకొన్ని వాట్ల విద్యుత్తుతో పనిచేసే మానవ మెదడుకువందల కొద్దీ మెగావాట్లతో పనిచేసే ఏఐ డేటా సెంటర్ల మధ్య ఉన్న భేదాన్ని తెలిజేశారుభవిష్యత్తులో ఆవిష్కరణలకున్న విస్తృత అవకాశాన్ని ఈ వ్యత్యాసం తెలియజేస్తుందన్నారు.

అధునాతన ఏఐ నమూనాలను తయారు చేసేందుకు ఇంజినీరింగ్సామర్థ్యంలో విప్లవాత్మక ఆవిష్కరణలపై అనేక భారతీయ అంకుర సంస్థలు దృష్టి సారిస్తున్నాయనిఇవి దేశానికి గణనీయమైన అవకాశాలను అందిస్తున్నాయని తెలియజేశారు.

డిమాండును సృష్టించేదిగా ప్రభుత్వంప్రధాన రంగాలు

ఏఐకు డిమాండును సృష్టించడంలోముఖ్యంగా స్పష్టమైన వాణిజ్య విధానాలు లేని రంగాల్లో ప్రభుత్వం కీలకమైన పాత్రను పోషిస్తోందని శ్రీ వైష్ణవ్ తెలిపారువాతావరణ అంచనావ్యవసాయంఆరోగ్య సేవలు లాంటి రంగాల్లో ఏఐ వినియోగానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారుప్రపంచాన్ని ముందుండి నడిపించేలా రోగ అంచనానివారణ ఆరోగ్య సేవలపై భారత్ ప్రధాన దృష్టి సారిస్తోందని వివరించారు.

సార్వభౌమ ఏఐ విధానాలు ఉపయోగించిపెద్ద ఎత్తున మౌలిక వసతుల తోడ్పాటుఏఐ సాకేంతికతల వినియోగ విస్తరణనైపుణ్యాలను బలోపేతం చేయడం ద్వారా అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిధులను సమకూరుస్తుందని ఆయన వివరించారు.

పారిశ్రామిక సహకారంనైపుణ్యాలు 

సెమీకండక్టర్ కార్యక్రమం మాదిరిగానే పరిశ్రమలతో సంప్రదింపుల అనంతరం భారత ఏఐ ప్రణాళికను రూపొందించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారుగతంలో సెమీకండక్టర్లు, 5జీలో చేసిన ప్రయత్నాల మాదిరిగానే నూతనంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ ఆధారిత పారిశ్రామిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఏఐ పాఠ్య ప్రణాళికల రూపకల్పనకు సహకరించాలని పారిశ్రామికవేత్తలను కోరారు.

 

***


(रिलीज़ आईडी: 2217307) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Kannada