మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వికసిత భారత్@2047 దార్శనికతకు అనుగుణంగా వికసిత్ భారత్-జీ రామ్ జీ: డాక్టర్ సుకాంత మజుందార్


భవిష్యత్తు నాయకత్వం పంచాయతీలదే... గ్రామ సభ, పంచాయతీల చేతుల్లో
ప్రణాళికాధికారం: డాక్టర్ సుకాంత మజుందార్

प्रविष्टि तिथि: 10 JAN 2026 7:33PM by PIB Hyderabad

వికసిత్ భారత్ -  గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఔర్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (వీ బీ– జీ రామ్ జీచట్టం, 2025 గ్రామీణ భారత ముఖ చిత్రం మార్పులో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని కేంద్ర విద్యఈశాన్య ప్రాంత అభివృద్ధి  శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ అన్నారు.

ఈ రోజు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూఈ చట్టం గ్రామీణ కుటుంబాలకు ఒక ఆర్థిక సంవత్సరానికి చట్టబద్ధమైన వేతన ఉపాధి హామీని 125 రోజుల వరకు పెంచుతుందని డాక్టర్ సుకాంత మజుందార్ తెలిపారుఈ చట్టం సాధికారతసమగ్ర వృద్ధిఅభివృద్ధి చర్యల సమన్వయాన్నిసంతృప్త స్థాయి సేవలను ప్రోత్సహించే లక్ష్యంతో రూపుదిద్దుకుందితద్వారా సంపన్నమైనసుస్థిరస్వావలంబన గల గ్రామీణ భారతదేశానికి పునాదిని బలోపేతం చేస్తుంది.

భారతదేశ గ్రామీణ ఉపాధి,  అభివృద్ధి రంగంలో నిర్ణయాత్మక సంస్కరణకు నాంది పలుకుతూపార్లమెంట్ వికసిత్ భారత్ -  గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఔర్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్చట్టం, 2025 ను ఆమోదించిందని డాక్టర్ మజుందార్ తెలిపారుసాధికారతఅభివృద్ధిఏకీకరణసంతృప్తత అనే సూత్రాలతో ఈ చట్టం గ్రామీణ ఉపాధిని కేవలం ఒక స్వతంత్ర సంక్షేమ కార్యక్రమంగా గాకుండా  సమగ్ర అభివృద్ధి సాధనంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ చట్టం గ్రామీణ కుటుంబాల ఆదాయ భద్రతను బలోపేతం చేస్తుందనిపాలనజవాబుదారీతనం యంత్రాంగాలను ఆధునికీకరిస్తుందనివేతన ఉపాధిని నాణ్యమైనఉత్పాదక గ్రామీణ ఆస్తుల  సృష్టితో అనుసంధానిస్తుందని మంత్రి వివరించారుతద్వారా సంపన్నమైన,  సుస్థిరమైన గ్రామీణ భారతదేశానికి పునాది వేస్తుందని తెలిపారు.

విద్యారంగంపై దృష్టి

వీ బీ జీ రామ్ జీ చట్టం గ్రామీణ విద్యా మౌలిక సదుపాయాలను నేరుగా బలోపేతం చేసేందుకుభౌతిక సౌకర్యాలు,  ప్రాథమిక వసతులలో దీర్ఘకాలంగా ఉన్న లోపాలను పూడ్చేందుకు వీలుగా అనేక రకాల పనులకు వీలు కల్పిస్తుందని మంత్రి తెలియజేశారుప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులుప్రయోగశాలలుఆట స్థలాలుప్రహరీ గోడలుమరుగుదొడ్లువంటశాలల నిర్మాణంనిర్వహణకు సంబంధించిన నిబంధనలు సురక్షితమైనమరింత క్రియాత్మకమైన,  బాలల-స్నేహపూర్వక అభ్యాస వాతావరణాలను సృష్టించడానికి సహాయపడతాయి.

అదేవిధంగాఅంగన్‌వాడీ భవనాలు,  మరుగుదొడ్ల నిర్మాణంనిర్వహణ గౌరవాన్నిపరిశుభ్రతను,  నిరంతర సేవలను అందించడం ద్వారా బాల్య దశ విద్యా మౌలిక సదుపాయాల పునాదిని బలోపేతం చేస్తాయి.

గ్రామీణ గ్రంథాలయ భవనాలు,  శిక్షణ-నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఇందులో చేర్చడం వల్ల అభ్యాస అవకాశాలు  పాఠశాల విద్య స్థాయిని  దాటి విస్తరిస్తాయనితద్వారా గ్రామంలోనే విజ్ఞాన వనరులువృత్తిపరమైన మార్గాలకు ప్రవేశం కల్పించడం ద్వారా యువతమహిళలు,  వయోజన అభ్యాసకులకు మద్దతు లభిస్తుందని డాక్టర్ మజుందార్ చెప్పారు.

వికసిత్ భారత్ -  గ్యారంటీ ఫర్ రోజ్‌గార్,  ఆజీవికా మిషన్ (గ్రామీణ్చట్టం, 2025 ఆమోదం భారత గ్రామీణ ఉపాధి హామీలో ఒక ముఖ్యమైన పునరుద్ధరణకు సంకేతమని మంత్రి స్పష్టం చేశారుచట్టబద్ధమైన ఉపాధిని 125 రోజులకు పెంచడం ద్వారావికేంద్రీకృత,  భాగస్వామ్య ప్రణాళికను పొందుపరచడంజవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం,  సంబంధిత పథకాల విలీనం,  సంతృప్తత-ఆధారిత అభివృద్ధిని సంస్థాగతం చేయడం ద్వారాఈ చట్టం గ్రామీణ ఉపాధిని సాధికారతసమ్మిళిత వృద్ధిసంపన్నమైనసుస్థిరమైన గ్రామీణ భారత్ సృష్టికి ఒక వ్యూహాత్మక సాధనంగా తిరిగి స్థానం కల్పిస్తుందిదీనిని వికసిత్ భారత్ @2047 విజన్‌కు పూర్తి అనుగుణంగా రూపొందించారు

 

***


(रिलीज़ आईडी: 2213639) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Tamil