రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రయాణ సమయాన్ని తగ్గిస్తూ సామర్థ్యాన్ని పెంపొందిస్తూ ఈ ఏడాదిలో 549 రైళ్ల వేగాన్ని పెంచిన భారతీయ రైల్వే


మెరుగైన సమయపాలన, వేగవంతమైన ప్రయాణాన్ని సామాన్యులకు అందిస్తూ 2025లో 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టిన రైల్వే

प्रविष्टि तिथि: 09 JAN 2026 6:15PM by PIB Hyderabad

రైల్వే కాలమాన పట్టిక (టీఏజీ) 2026 కింద భారతీయ రైల్వే వివిధ రైల్వే జోన్లలో కొత్త రైళ్లను ప్రవేశపెట్టటంఇప్పటికే ఉన్న సేవలను విస్తరించటంపలు రైళ్ల రాకపోలను పెంచటంకొన్నింటిని సూపర్‌ఫాస్ట్‌గా మార్చుతూ రైళ్లను వేగంగా నడపడం వంటి కీలక చర్యలను తీసుకుందిసెంట్రల్ రైల్వే (సీఆర్జోన్ పరిధిలో 30 రైళ్ల వేగాన్ని పెంచిన భారతీయ రైల్వే.. 6 రైళ్లను ఇతర ప్రాంతాలకు పొడగించటంతో పాటు కొత్త రైళ్లను ప్రవేశపెట్టిందితూర్పు తీర రైల్వేలో (ఈసీఓఆర్) 3 రైళ్ల వేగాన్ని పెంచటం, 4 రైళ్లను పొడిగించడంతోపాటు కొత్త రైళ్లను ప్రవేశపెట్టిందితూర్పు మధ్య రైల్వేలో (ఈసీఆర్) 12 రైళ్ల వేగాన్ని పెంచటం, 20 రైళ్లను పొడగించటం, 20 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా గణనీయమైన సౌకర్యాలను నమోదు చేసిందితూర్పు రైల్వేలో (ఈఆర్) 32 రైళ్ల వేగాన్ని పెంచటం, 4 రైళ్లను పొడిగించటంతో పాటు కొత్త రైళ్లను భారతీయ రైల్వే ప్రవేశపెట్టింది.

 

ఒక రైలు వేగం, 2 రైళ్ల రాకపోకలను ఉత్తర మధ్య రైల్వే (ఎన్‌సీఆర్పెంచింది. 4 రైళ్లను పొడిగించడంతోపాటు కొత్త రైళ్లను ప్రవేశపెట్టిందిఈశాన్య రైల్వే (ఎన్ఈఆర్) 12 రైళ్ల వేగాన్ని పెంచటంతో పాటు రైళ్ల రాకపోకలను పెంచటం, 4 రైళ్లను పొడిగించిందిఈ జోనులో కొత్త రైళ్లను కొత్తగా ప్రవేశపెట్టారుఈశాన్య సరిహద్దు రైల్వే (ఎన్ఎఫ్ఆర్).. 36 రైళ్ల వేగాన్ని పెంచటంతో పాటు 10 కొత్త రైళ్లను ప్రవేశపెట్టిందిఉత్తర రైల్వే (ఎన్ఆర్).. 24 రైళ్ల వేగాన్ని పెంచడంతోపాటు 10 రైళ్లను పొడిగించిందిఇక్కడ 20 రైళ్లను కొత్తగా ప్రవేశపెట్టారువాయువ్య రైల్వే (ఎన్‍డబ్య్లూఆర్).. 89 రైళ్ల వేగం, 2 రైళ్ల రాకపోకలను పెంచిందిఇది రైళ్ల ప్రయాణ దూరాన్ని పొడిగించిందివీటితో పాటు 12 కొత్త రైళ్లను కొత్తగా తీసుకొచ్చింది.

 

దక్షిణ రైల్వే (ఎస్ఆర్).. 75 రైళ్ల వేగాన్ని పెంచటంతో పాటు రైళ్లను సూపర్‌ఫాస్ట్‌గా మార్చిందిఇది రైళ్లను పొడిగించింది.. 6 కొత్త రైళ్లను ప్రవేశపెట్టిందిఅన్ని జోన్ల కంటే అత్యధికంగా నైరుతి రైల్వే (ఎస్‌డబ్ల్యూఆర్).. 117 రైళ్ల వేగాన్ని పెంచటం, 8 రైళ్లను సూపర్‌ఫాస్ట్‌గా మార్చటం, 6 రైళ్లను పొడిగించటం, 8 కొత్త రైళ్ల ప్రవేశపెట్టింది.

 

పశ్చిమ మధ్య రైల్వే (డబ్ల్యూసీఆర్).. 27 రైళ్ల వేగాన్ని పెంచటంతో పాటు కొత్త రైళ్లను ప్రవేశపెట్టిందిపశ్చిమ రైల్వే (డబ్ల్యూ) 80 రైళ్ల వేగం, 2 రైళ్ల రాకపోకలను పెంచింది. 10 రైళ్లను పొడిగించటంతో పాటు 10 కొత్త రైళ్లను ఈ రైల్వే జోన్‌లో ప్రవేశపెట్టారు.

 

మొత్తంగా టీఏజీ- 2026 కింద దేశవ్యాప్తంగా 549 రైళ్ల వేగం పెరిగింది.. 10 రైళ్లను సూపర్‌ఫాస్ట్‌గా మార్చారువీటితో పాటు రైళ్ల రాకపోకలను పెంచటం, 86 రైళ్లను పొడగించటంతో పాటు 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టారు.

 

ప్రవేశపెట్టిన రైళ్ల వివరాలు

టీఏజీ 2026 కింద ప్రవేశపెట్టిన 122 కొత్త రైళ్లలో ప్రీమియంఎక్స్‌ప్రెస్ప్యాసింజర్ ఉన్నాయివీటిలో టీఏజీ-టీఓడీ కింద ప్రవేశపెట్టిన రైళ్లతో కలిపి మొత్తం 26 అమృత్ భారత్ రైళ్లు ఉన్నాయిమొత్తం 60 సర్వీసులతో మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లు అత్యధిక వాటాను కలిగి ఉన్నాయివీటిలో రైళ్లను టీఏజీ-టీఓడీ ద్వారా ప్రవేశపెట్టారువీటితో పాటు హమ్ సఫర్ రైళ్లు, 2 జన్ శతాబ్ది రైళ్లు, 2 నమో భారత్ రాపిడ్ రైల్వే సర్వీసులు, 2 రాజధాని రైళ్లను ప్రవేశపెట్టారు.

సెమీ-హైస్పీడ్ అనుసంధానతను పెంపొందించడానికి 28 వందే భారత్ రైళ్లను కూడా కొత్తగా తీసుకొచ్చారుఅన్ని విభాగాల్లో కలిపి మొత్తం 122 కొత్త రైళ్లను ఈ కాలంలో ప్రవేశపెట్టారు.

రైళ్ల వేగాన్ని పెంచటం

సమయపాలనను మెరుగుపరచటంప్రయాణ సమయాన్ని తగ్గించడానికి టీఏజీ 2026 కింద మొత్తం 549 రైళ్ల వేగాన్ని పెంచారువీటిలో 376 రైళ్లను 5-15 నిమిషాల వరకు, 105 రైళ్లను 16-30 నిమిషాల వరకు, 48 రైళ్లను 31-59 నిమిషాల వరకు, 20 రైళ్లను 60 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ ప్రయాణ సమయం తగ్గించేలా రైళ్ల వేగాన్ని పెంచారు.

 

ఈ విషయంలో నైరుతి రైల్వే (ఎస్‌డబ్ల్యూఆర్ప్రధాన సహకారం అందించిందిఈ జోన్‌లో 66 రైళ్లను 5-15 నిమిషాలు, 29 రైళ్లను 16-30 నిమిషాలు, 12 రైళ్లను 31-59 నిమిషాలు, 10 రైళ్లను 60 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ వేగవంతం చేశారుసెంట్రల్ రైల్వే (సీఆర్).. 13 రైళ్లను 5-15 నిమిషాలు, 13 రైళ్లను 16-30 నిమిషాలు, 4 రైళ్లను 31-59 నిమిషాల మేర వేగవంతం చేసిందితూర్పు తీర రైల్వే (ఈసీఓఆర్).. 2 రైళ్లను 5-15 నిమిషాలుఒక రైలును 16-30 నిమిషాల మేర వేగవంతం చేసిందితూర్పు మధ్య రైల్వే (ఈసీఆర్).. 7 రైళ్లను 5-15 నిమిషాలు, 2 రైళ్లను 16-30 నిమిషాలు, 2 రైళ్లను 31-59 నిమిషాలుఒక రైలును 60 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ వేగవంతం చేసింది. 29 రైళ్లను 5-15 నిమిషాలు, 3 రైళ్లను 16-30 నిమిషాల మేర వేగవంతం చేయడం ద్వారా తూర్పు రైల్వే (ఈఆర్సేవలను మెరుగుపరిచింది.

 

ఉత్తర మధ్య రైల్వే (ఎన్‌సీఆర్).. ఒక రైలు ప్రయాణ సమయాన్ని 5–15 నిమిషాల మేర తగ్గించింది. 9 రైళ్లను 5–15 నిమిషాలు, 3 రైళ్లను 16–30 నిమిషాల మేర ఈశాన్య రైల్వే (ఎన్‌ఈఆర్వేగవంతం చేసిందిఈశాన్య సరిహద్దు రైల్వే (ఎన్ఎఫ్ఆర్).. 20 రైళ్లను 5–15 నిమిషాలు, 10 రైళ్లను 16–30 నిమిషాలు, 3 రైళ్లను 31–59 నిమిషాలు, 3 రైళ్లను 60 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ ప్రయాణ సమయం తగ్గించేలా వేగవంతం చేసిందిఉత్తర రైల్వే (ఎన్ఆర్).. 22 రైళ్ల ప్రయాణ సమయాన్ని 5–15 నిమిషాలు, 2 రైళ్ల సమయాన్ని 16–30 నిమిషాల మేర తగ్గించిందివాయువ్య రైల్వే (ఎన్‌డబ్ల్యూఆర్) 67 రైళ్లను 5–15 నిమిషాలు, 14 రైళ్లను 16–30 నిమిషాలు, 7 రైళ్లను 31–59 నిమిషాలుఒక రైలును 60 నిమిషాల కంటే ఎక్కువ ప్రయాణ సమయం ఆదా అయ్యేలా వేగవంతం చేసింది.

 

ఆగ్నేయ మధ్య రైల్వే (ఎస్ఈసీఆర్).. 9 రైళ్లను 5-15 నిమిషాలు, 2 రైళ్లను 16-30 నిమిషాల మేర వేగవంతం చేసిందిదక్షిణ రైల్వే (ఎస్ఆర్).. 53 రైళ్లను 5-15 నిమిషాలు, 10 రైళ్లను 16-30 నిమిషాలు, 9 రైళ్లను 31-59 నిమిషాలు, 3 రైళ్లను 60 నిమిషాల కంటే ఎక్కువ ప్రయాణ సమయం ఆదా అయ్యేలా వేగవంతం చేసిందిపశ్చిమ మధ్య రైల్వే (డబ్ల్యూసీఆర్) 25 రైళ్లను 5-15 నిమిషాలుఒక రైలును 16-30 నిమిషాలుఒక రైలును 31-59 నిమిషాల మేర వేగవంతం చేసింది. 53 రైళ్లను 5-15 నిమిషాలు, 15 రైళ్లను 16-30 నిమిషాలు, 10 రైళ్లను 31-59 నిమిషాలు, 2 రైళ్లను 60 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ ప్రయాణ సమయం తగ్గించేలా పశ్చిమ రైల్వే (డబ్ల్యూఆర్) వేగవంతం చేసింది.

 

ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడంపై భారతీయ రైల్వేలు కలిగి ఉన్న బలమైన దృష్టిని టీఏజీ 2026 తెలియజేస్తోందివివిధ జోన్లలో 549 రైళ్ల వేగాన్ని పెంచడం ద్వారా ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా వేగవంతమైనమరింత నమ్మదగిన రైల్వే సేవలను అందిస్తూ సమయపాలనకార్యాచరణ సామర్థ్యం, అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2213072) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Odia , Kannada