ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వారణాసిలో 72 వ జాతీయ వాలీబాల్ పోటీలను వీడియో మాధ్యమం ద్వారా ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 04 JAN 2026 3:00PM by PIB Hyderabad

హర హర మహాదేవ్!

ఉత్తరప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్యూపీ ప్రభుత్వ మంత్రులు సోదరులు రవీంద్ర జైస్వాల్దయాశంకర్గిరీష్ యాదవ్బనారస్ మేయర్ -  సోదరుడు అశోక్ తివారీఇతర ప్రజాప్రతినిధులువాలీబాల్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులుదేశం నలుమూలల నుంచి నుండి విచ్చేసిన క్రీడాకారులు,  కాశీలో ఉన్న నా కుటుంబ సభ్యులకు  నమస్కారం.

వారణాసి పార్లమెంటు సభ్యునిగా క్రీడాకారులందరినీ స్వాగతించిఅభినందించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందిఈ రోజు కాశీలో జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభమవుతోందిమీలో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి ఈ జాతీయ టోర్నమెంట్‌కు చేరుకున్నారురాబోయే రోజుల్లోకాశీ మైదానంలో మీ ప్రయత్నాలకు పరీక్ష ఎదురుకానుందిదేశంలోని 28 రాష్ట్రాల నుంచి జట్లు ఇక్కడకు చేరుకున్నాయని నాకు తెలియజేశారుఇది ఏక భారత్శ్రేష్ఠ భారత్ భావనకు అందమైన ప్రతిబింబంగా నిలుస్తోందిఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

మిత్రులారా

ఇక్కడ బనారస్‌లో ఒక మాట తరచూ ఇలా చెబుతారు. బనారస్‌ను నిజంగా తెలుసుకోవాలంటే బనారస్‌కు రావాల్సిందే అనిమీరు అందరూ ఇక్కడికి వచ్చారు... ఇప్పుడు మీరు కూడా బనారస్‌ను తెలుసుకోబోతున్నారుమా బనారస్ క్రీడలను ప్రేమించే నగరంఇక్కడ మల్ల యుద్ధంకుస్తీ మైదానాలుబాక్సింగ్పడవ పోటీలుకబడ్డీ వంటి అనేక క్రీడలు ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయిబనారస్ అనేక జాతీయ స్థాయి క్రీడాకారులను దేశానికి అందించిందిబనారస్ హిందూ విశ్వవిద్యాలయంయూపీ కాలేజ్కాశీ విద్యాపీఠానికి చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో కూడా తమ ప్రతిభను చాటారువేలాది సంవత్సరాలుగాఇక్కడకు విజ్ఞానంకళలను అన్వేషించడానికి వచ్చే వారందరినీ కాశీ నగరం స్వాగతించిందిఈ జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ జరుగుతున్న సమయంలో కూడా బనారస్‌లో ఉత్సాహం అధికంగా ఉంటుందని నా నమ్మకంమీకు ఉత్సాహంతో ప్రోత్సాహాన్నిచ్చే ప్రేక్షకులను మీరు చూస్తారుకాశీ ఆతిథ్య సంప్రదాయాలను కూడా మీరు తెలుసుకుంటారు.

మిత్రులారా

వాలీబాల్ ఒక సాధారణ క్రీడ మాత్రమే కాదునెట్‌కు ఇరువైపులా సమతుల్యతకు ప్రతీకగా నిలిచే ఆటసహకారంతో సాగే ఆటదృఢ సంకల్పాన్ని ప్రతిబింబించే ఆటవాలీబాల్ అసలైన భావం ఏమిటంటే -  ఎలాంటి పరిస్థితుల్లోనైనా బంతిని ఎప్పుడూ పైన ఉంచాల్సిందేవాలీబాల్ మనలను సమష్టి భావనతో అనుసంధానిస్తుందిప్రతి వాలీబాల్ క్రీడాకారుడి మంత్రం “జట్టు ముందుగా” అన్నదేప్రతి ఆటగాడికి తనదైన నైపుణ్యం ఉండవచ్చుకానీ అందరూ తమ జట్టు విజయం కోసమే ఆడతారుభారతదేశ అభివృద్ధి గాథకువాలీబాల్ ఆటకు మధ్య నాకు అనేక పోలికలు కనిపిస్తాయివాలీబాల్ మనకు ఏ విజయమూ కూడా ఒంటరిగా సాధ్యం కాదని నేర్పుతుందిమన విజయానికి సమన్వయంపరస్పర విశ్వాసంజట్టు సిద్ధత ఎంతో అవసరంప్రతి ఒక్కరికీ తనదైన పాత్ర ఉంటుందితనదైన బాధ్యత ఉంటుందిప్రతి వ్యక్తి తన బాధ్యతను నిజాయితీగాకష్టపడి నిర్వర్తించినప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం.

మన దేశం కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతోందిపరిశుభ్రత నుంచి డిజిటల్ చెల్లింపుల వరకుతల్లి పేరుతో మొక్క నాటడం నుంచి అభివృద్ధి చెందిన భారత్ కోసం చేపట్టిన ఉద్యమం వరకు ప్రతి పౌరుడుప్రతి సమాజంప్రతి రాష్ట్రం “దేశమే ముందు” అనే భావనతోసామూహిక చైతన్యంతో కలిసి పనిచేస్తున్నందువల్లనే మనం పురోగమిస్తున్నాం

మిత్రులారా

ఈ రోజు భారతదేశ వృద్ధిమన ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోందిఅయితే ఒక దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడుఆ పురోగతి కేవలం ఆర్థిక రంగానికే పరిమితం కాదుఆ విశ్వాసం క్రీడా మైదానాల్లో కూడా స్పష్టంగా ప్రతిబింబిస్తుందిగత కొన్ని సంవత్సరాలుగా ప్రతి క్రీడలోనూ మనం ఇదే దృశ్యాన్ని చూస్తున్నాం. 2014 తర్వాత వివిధ క్రీడా విభాగాల్లో భారతదేశ ప్రదర్శన క్రమంగా మెరుగుపడిందిక్రీడామైదానాల్లో నేటి తరం క్రీడాకారులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తుంటే మనందరికీ మనసు ఉప్పొంగుతుంది.

మిత్రులారా

ఒకప్పుడు ప్రభుత్వంసమాజం కూడా క్రీడల పట్ల పెద్దగా శ్రద్ధ చూపని పరిస్థితి ఉండేదిఅందువల్ల క్రీడాకారులు తమ భవిష్యత్తు గురించి అనిశ్చితిలో ఉండేవారు. క్రీడలను వృత్తిగా ఎంచుకునే యువత సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండేదికానీ గత పదేళ్లలో ప్రభుత్వంసమాజం రెండింటి ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు వచ్చిందిప్రభుత్వం క్రీడల కోసం కేటాయించే బడ్జెట్‌ను గణనీయంగా పెంచిందిఈ రోజు భారతదేశ క్రీడా నమూనా పూర్తిగా క్రీడాకారుల కేంద్రంగా మారిందిప్రతిభను గుర్తించడంశాస్త్రీయ శిక్షణపోషకాహారం నుంచి పారదర్శక ఎంపిక వరకు ప్రతి స్థాయిలోక్రీడాకారుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.

మిత్రులారా

ఈ రోజు దేశం మొత్తం సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌పై ప్రయాణిస్తోందిప్రతి రంగంప్రతి అభివృద్ధి లక్ష్యం ఈ సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌తో అనుసంధానమై ఉందిక్రీడా రంగం కూడా అందులో ఒకటిక్రీడల రంగంలో కూడా కీలకమైన సంస్కరణలు అమలులో ఉన్నాయిజాతీయ క్రీడల నిర్వహణ చట్టంఖేలో భారత్ పాలసీ–2025 వంటి విధానాలు నిజమైన ప్రతిభకు అవకాశాలు లభించేలా చేస్తాయిక్రీడా సంస్థల్లో పారదర్శకతను పెంచుతాయిఅదే సమయంలో దేశ యువత క్రీడలువిద్య రెండింటిలోనూ ఏకకాలంలో ముందుకు సాగేలా చూస్తాయి.

మిత్రులారా

టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టీఓపీఎస్వంటి కార్యక్రమాల ద్వారాభారత క్రీడల వ్యవస్థలో మార్పులు జరుగుతున్నాయిఒక వైపుశక్తిమంతమైన మౌలిక సదుపాయాలునిధుల వ్యవస్థను ఏర్పరుస్తున్నాంమరోవైపు యువతకు ప్రపంచ స్థాయి అనుభవాలను అందించడానికి ప్రయత్నిస్తున్నాంగత పదేళ్లలో భారత్ 20కి పైగా ప్రధాన అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇచ్చిందని మీకు తెలుసుఉదాహరణకుఫిఫా అండర్-17 వరల్డ్ కప్హాకీ వరల్డ్ కప్ప్రధాన చెస్ టోర్నమెంట్లు మొదలైనవి. 2030 కామన్‌వెల్త్ గేమ్స్ కూడా భారతదేశంలోనే జరగనున్నాయి. 2036 ఒలింపిక్స్‌ కు ఆతిథ్యం ఇచ్చేందుకు దేశం పూర్తి శక్తితో సిద్ధంగా ఉందిమరింతమంది క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించడమే ఈ ప్రయత్నాల ఉద్దేశం

మిత్రులారా

పాఠశాల స్థాయి క్రీడాకారులకు కూడా ఒలింపిక్ క్రీడలలో అనుభవాన్ని అందించడానికి మేము కృషి చేస్తున్నాంఖేలో ఇండియా కార్యక్రమం వల్ల వందలాది మంది యువత జాతీయ స్థాయికి ఎదగడానికి అవకాశం లభించిందికొద్ది రోజుల క్రితందాదాపు కోటి మంది యువకులు తమ ప్రతిభను ప్రదర్శించిన సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగిసిందిఈ మహోత్సవంలో నా కాశీ నుంచి  దాదాపు మూడు లక్షలమంది యువకులు తమ శక్తినినైపుణ్యాలను మైదానంలో ప్రదర్శించారని వారణాసి పార్లమెంటు సభ్యుడిగానేను సగర్వంగా చెప్పదలచుకున్నాను.

మిత్రులారా

క్రీడా మౌలిక సదుపాయాలలో వచ్చిన మార్పులు కాశీకి కూడా ప్రయోజనం కలిగిస్తున్నాయిఇక్కడ ఆధునిక క్రీడా సౌకర్యాలు కల్పిస్తున్నారువివిధ క్రీడల కోసం స్టేడియాలు వస్తున్నాయికొత్త క్రీడా సముదాయాలు చుట్టుపక్కల జిల్లాల క్రీడాకారులకు శిక్షణ అవకాశాలను అందిస్తున్నాయిమీరు ఈ రోజు నిలబడి ఉన్న సిగ్రా స్టేడియం కూడా ఇప్పుడు అనేక ఆధునిక సౌకర్యాలతో నిండి ఉంది

మిత్రులారా

కాశీ ప్రధాన కార్యక్రమాల కోసం సిద్ధమవుతున్నందుకు నేను సంతోషిస్తున్నానుఈ జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ ద్వారా భారతదేశ క్రీడా పటంలో ఒక స్థానాన్ని పొందడం కాశీకి చాలా ముఖ్యమైనదిదీనికి ముందు కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు జరిగాయిస్థానిక ప్రజలకుస్థానిక ఆర్థిక వ్యవస్థకు గొప్ప అవకాశాలను ఇచ్చాయిఉదాహరణకుబనారస్ ముఖ్యమైన జి-20 సమావేశాలుకాశీ తమిళ సంగమంకాశీ తెలుగు సంగమం వంటి సాంస్కృతిక ఉత్సవాలుభారతీయ ప్రవాసుల సదస్సులకు ఆతిథ్యం ఇచ్చిందిషాంఘై సహకార సంస్థ సాంస్కృతిక రాజధానిగా కూడా కాశీ గుర్తింపు పొందిందిఈ రోజుఈ ఛాంపియన్‌షిప్ ఈ విజయాలకు మరో ఆభరణంగా చేరుతోందిఈ కార్యక్రమాలన్నింటి ద్వారాఇటువంటి గొప్ప వేదికలకు ఒక ప్రధాన గమ్యస్థానంగా కాశీ ఆవిర్భవిస్తోంది.

మిత్రులారా

ఈ సమయంలో బనారస్ లో ఆహ్లాదకరమైన చలికాల వాతావరణాన్ని మీరు చూడొచ్చుఈ సీజన్‌లో కొన్ని అత్యుత్తమ వంటకాలను మీరు ఆస్వాదించగలుగుతారుసమయం ఉంటేమలైయోను తప్పక ఆస్వాదించండిబాబా విశ్వనాథుడి ఆశీస్సులు తీసుకోండిగంగా నదిపై పడవ ప్రయాణం చేయండిఈ అనుభవాలను మీతో పాటు తీసుకువెళ్లండిఅన్నిటికంటే ముఖ్యంగాఈ టోర్నమెంట్‌లో మీ అత్యుత్తమ ఆటను ప్రదర్శించండిఈ కాశీ నేల నుంచి మీ ప్రతి స్పైక్ప్రతి బ్లాక్ప్రతి పాయింట్ భారతదేశ క్రీడా ఆకాంక్షలను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరుకుంటున్నాను.  ఈ ఆకాంక్షతో మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.  

ధన్యవాదాలువందే మాతరం

 

***


(రిలీజ్ ఐడి: 2211528) సందర్శకుల సూచీ సంఖ్య : : 42
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Gujarati , English , Urdu , हिन्दी , Manipuri , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Odia , Kannada , Malayalam