ప్రధాన మంత్రి కార్యాలయం
వీరబాలల దినోత్సవం సందర్భంగా సాహస ‘సాహిబ్‌జాదా’ల త్యాగాన్ని సంస్మరించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
26 DEC 2025 9:27AM by PIB Hyderabad
వీరబాలల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సాహస ‘సాహిబ్‌జాదా’ల త్యాగాన్ని సంస్మరించుకున్నారు. ఇది ధైర్యం, దృఢ దీక్ష, సత్సంకల్పంతో ముడిపడిన రోజని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“సాహస ‘సాహిబ్‌జాదా’ల త్యాగ సంస్మరణకు గౌరవప్రద ప్రతీక ఈ వీరబాలల దినోత్సవం. మాతా గుజ్రీ జీ అచంచల విశ్వాసాన్ని, శ్రీ గురు గోవింద్ సింగ్ అమర ప్రబోధాన్ని ఈ రోజున మనం గుర్తు చేసుకుంటాం. ఇది ధైర్యం, దృఢ దీక్ష, సత్సంకల్పంతో ముడిపడిన రోజు. వారి జీవనం, ఆదర్శాలు తరతరాల దాకా ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2208724)
సందర్శకుల సూచీ సంఖ్య : : 57
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam