ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీ20 దేశాల కార్మిక, ఉపాధి మంత్రుల సమావేశంలో ప్రధాని వీడియో సందేశం

प्रविष्टि तिथि: 21 JUL 2023 9:34AM by PIB Hyderabad

మహాశయులారాసోదరీసోదరులారానమస్కారం!

చారిత్రకమైనశక్తివంతమైన ఇండోర్‌కు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానుపాకశాస్త్ర సంప్రదాయాల పట్ల గర్వం నిండిన నగరమిదిఈ నగర సౌందర్యాన్నిరుచులను మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను.

స్నేహితులారా,

ఆర్థికసామాజిక రంగాల్లో అతి ముఖ్యమైన వాటిలో ఒకటైన ఉపాధి కల్పన గురించి మీ బృందం చర్చిస్తోందిఉపాధి కల్పనా రంగంలో వస్తున్న కొన్ని ప్రధాన మార్పుల ముంగిట మనం ఉన్నాంఈ వేగవంతమైన మార్పులను పరిష్కరించేలా ప్రతిస్పందనతో కూడినసమర్థవంతమైన వ్యూహాలను మనం సిద్ధం చేయాల్సిన అవసరం ఉందిఈ నాలుగో పారిశ్రామిక విప్లవ యుగంలో ఉపాధిని అందించే ప్రధాన శక్తిగా సాంకేతికత కొనసాగుతోందిగతంలో వచ్చిన సాంకేతికత ఆధారిత మార్పులో పెద్ద సంఖ్యలో సాంకేతిక ఉద్యోగాలను కల్పించిన దేశంలో ఈ సమావేశం జరగడం ముదావహంఇలాంటి మార్పులతో కూడిన నూతన అధ్యాయానికి అంకుర సంస్థలు నాయకత్వం వహిస్తున్నాయిఅలాంటి అనేక అంకుర సంస్థలకు కేంద్రమైన ఇండోర్ నగరం మీకు ఆతిథ్యమిస్తోంది.

స్నేహితులారా,

అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలనుపద్ధతులను ఉపయోగించడానికి అవసరమైన నైపుణ్యాలను శ్రామిక శక్తికి మనం అందించాలినైపుణ్యాలను సాధించడంవాటికి పదును పెట్టుకోవడమే మన భవిష్యత్ కార్మిక శక్తి అనుసరించాల్సిన మంత్రాలువీటికి భారతదేశంలో అమలు చేస్తున్న ‘‘స్కిల్ ఇండియా మిషన్’’ వాస్తవ రూపమిస్తోంది. ‘ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన’ ద్వారా ఇప్పటి వరకు 12.5 మిలియన్లకు పైగా యువత శిక్షణ పొందారుకృత్రిమ మేధరోబోటిక్స్ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్డ్రోన్లు వంటి ‘‘ఫోర్ పాయింట్ ఓ’’ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాం.

స్నేహితులారా,

కొవిడ్ సమయంలో భారత్‌లో ఆరోగ్యంఇతర రంగాల్లో విధులు నిర్వర్తించిన వారు తమ నైపుణ్యాలనుఅంకితభావాన్ని ప్రదర్శించారుసేవకరుణ అనే మా సంస్కృతిని కూడా ఇది ప్రతిబింబిస్తుందివాస్తవానికిప్రపంచం కోసం నైపుణ్యాలున్న శ్రామికశక్తిని అందించే అతిపెద్ద దేశాల్లో ఒకటిగా ఎదిగే సామర్థ్యం భారత్‌కు ఉందిభవిష్యత్తులో అంతర్జాతీయంగా ఎక్కడైనా పనిచేసే శ్రామిక శక్తి వాస్తవరూపం దాల్చనుందికాబట్టిఅభివృద్ధిని ప్రపంచీకరించాల్సిననైపుణ్యాలను పంచుకోవాల్సిన అవసరం ఆసన్నమైందిఈ అంశంలో జీ20 నాయకత్వ పాత్ర పోషించాలిఅవసరమైన నైపుణ్యాలుఅర్హతల ఆధారంగా అంతర్జాతీయంగా ఉద్యోగాలను అందించేలా మీరు ప్రారంభించిన చర్యలను అభినందిస్తున్నానుదీనికి అంతర్జాతీయ సహకారంసమన్వయంవలసరవాణాకు సంబంధించిన భాగస్వామ్యాల్లో కొత్త నమూనాలు అవసరంఈ అంశంలో యజమానులకుఉద్యోగులకు సంబంధించిన గణాంకాలుసమాచారాన్ని పంచుకోవడం ద్వారా పనిని ప్రారంభించవచ్చుఇది మెరుగైన నైపుణ్యాలుశ్రామికశక్తి ప్రణాళికలాభదాయకమైన ఉపాధి నుంచి ప్రపంచవ్యాప్తంగా సాక్ష్యం ఆధారిత విధానాలను సూత్రీకరించే శక్తిని దేశాలకు అందిస్తుంది.

స్నేహితులారా,

గిగ్ప్లాట్‌ఫామ్ ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన కార్మికుల్లో నూతన విభాగాల ఏర్పాటుతో మరో మార్పు వచ్చిందిఇది మహమ్మారి సమయంలో స్థిరత్వం సాధించేందుకు మూలాధారంగా ఉద్భవించిందిఇది అనుకూలమైన పని విధానాలనుఅదనపు ఆదాయ వనరులను అందిస్తుందిప్రధానంగా యువతకు లాభదాయకమైన ఉపాధిని అందించే సామర్థ్యం దీనికి ఉందిమహిళల సామాజిక ఆర్థిక సాధికారతకు ఇది సాధనంగా పనిచేస్తుందిదీని సామర్థ్యాన్ని గుర్తించేలా కార్మికుల కోసం ఆధునిక విధానాలనుకార్యక్రమాలను రూపొందించాలిఅలాగే నిరంతరాయంగాసరిపడినంత ఉపాధి అవకాశాలను కల్పించడానికి సుస్థిరమైన పరిష్కారాలను మనం కనుగొనాలివారికి సామాజిక భద్రతను అందించేందుకువారి రక్షణకుఆరోగ్యానికి మనం నూతన విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందిఈ కార్మికుల కోసం లక్షిత పథకాలను అమలు చేసేందుకు ‘ఈశ్రామ్ పోర్టల్’ను భారత్లో మేం తయారు చేశాంఏడాది వ్యవధిలో దాదాపు 280 మిలియన్ల మంది కార్మికులు ఈ పోర్టల్లో నమోదు చేసుకున్నారుఇప్పుడుబహుళజాతి పని విధానం ఉన్న నేపథ్యంలో ప్రతి దేశం ఇలాంటి పరిష్కారాలను స్వీకరించడం అవసరంఈ విషయంలో మా అనుభవాలను పంచుకొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.

స్నేహితులారా,

ప్రజలకు సామాజిక భద్రతను కల్పించడమే అజెండా 2030లో ఉన్న ప్రధానాంశంకానీ అంతర్జాతీయ సంస్థలు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం కొన్ని పరిమిత రూపాల్లో అందించే ప్రయోజనాలకు మాత్రమే జవాబుదారీ వహిస్తుందిఇతర రూపాల్లో లభించే ప్రయోజనాలు ఈ విధానం పరిధిలోకి రావుసార్వత్రిక ఆరోగ్యంఆహార భద్రతబీమాపింఛను కార్యక్రమాలను మనం పరిగణించడం లేదు. ఈ ప్రయోజనాలను అందించడం గురించి మనం పునరాలోచించాలిఅప్పుడే సామాజిక భద్రత కవరేజికి సంబంధించిన పూర్తి స్వరూపాన్ని మనం చూడొచ్చు. ప్రతి దేశానికి ఉన్న ప్రత్యేక ఆర్థిక సామర్థ్యాలుబలాలుసవాళ్లను మనం పరిగణనలోకి తీసుకోవాలిసామాజిక భద్రతకు సుస్థిర ఆర్థిక సాయం అందించేందుకు అందరూ ఒకటే పద్ధతిని అవలంబించడం సరికాదువివిధ దేశాలు ఇలాంటి ప్రయత్నాలను కచ్చితంగా ప్రతిబింబించే వ్యవస్థను రూపొందించడంలో మీ అనుభవాన్ని ఉపయోగిస్తారని ఆశిస్తున్నాను.

మహాశయులారా,

ఈ రంగంలో అత్యవసర సమస్యలను పరిష్కరించేలా మీ అందరూ చేసిన ప్రయత్నాలను నేను ప్రశంసిస్తున్నానుప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల సంక్షేమం కోసం బలమైన సందేశాన్ని మీరు ఈ రోజు పంపిస్తారని నేను విశ్వసిస్తున్నానుఇది మీ అందరికీ ఉత్పాదకమైనవిజయవంతమైన సమావేశం కావాలని ఆకాంక్షిస్తున్నాను.

ధన్యవాదాలు.

 

 

***


(रिलीज़ आईडी: 2207936) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam