ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పూర్వ ప్రధానమంత్రి చౌధరీ చరణ్ సింగ్ గారి జయంతి.. ప్రధానమంత్రి నివాళులు

प्रविष्टि तिथि: 23 DEC 2025 9:39AM by PIB Hyderabad

పూర్వ ప్రధానమంత్రి, భారత్ రత్న చౌధరీ చరణ్ సింగ్ గారి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ‘‘సమాజంలో ఆదరణకు నోచుకోని వర్గాల సంక్షేమం, వ్యవసాయ రంగ  పురోగతి, రైతులకు సౌభాగ్యం .. ఈ ఆశయాల సాధనకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. దేశ నిర్మాణానికి ఆయన అందించిన సేవలను, కృత‌జ్ఞులైన దేశ ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరు’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశంలో -
‘‘పూర్వ ప్రధానమంత్రి, భారత్ రత్న చౌధరీ చరణ్ సింగ్ గారికి ఆయన జయంతి సందర్బంగా గౌరవపూర్వక శ్రద్దాంజలి. సమాజంలో వంచనకు గురైన వర్గాల వారి సంక్షేమం, వ్యవసాయ రంగ పురోగతి, రైతుల సమృద్ధి కోసం  ఆయన తన జీవనాన్ని అంకితం చేశారు. దేశ నిర్మాణానికి ఆయన అందించిన సేవలను, కృతజ్ఞులైన దేశప్రజలు ఎన్నటికీ మరచిపోలేరు’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2207620) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam