శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పర్యావరణ పరిరక్షణ నుంచి ఉపాధి కల్పన దాకా... భారత అభివృద్ధికి విద్యుత్తు వాహనాల దన్ను


భారత్ మండపంలో ఈవీ ఎక్స్‌పోను సందర్శించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్..

స్వచ్ఛ ఆధునిక రవాణా వ్యవస్థతో పాటు యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా దేశానికి అవసరమంటున్న ప్రధానమంత్రి
శ్రీ నరేంద్ర మోదీ దృష్టికోణాన్ని
ప్రముఖంగా ప్రస్తావించిన మంత్రి

పరిమిత పెట్టుబడితోనే భారీ టర్నోవరును సాధించే ఈవీ సంబంధిత వాణిజ్య సంస్థల స్థాపనలో యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు
ప్రభుత్వ మద్దతు గల అనుబంధ విస్తారిత వ్యవస్థ ద్వారా అవకాశాలు
: డాక్టర్ జితేంద్ర సింగ్

प्रविष्टि तिथि: 21 DEC 2025 4:12PM by PIB Hyderabad

పర్యావరణ పరిరక్షణ మొదలు ఉపాధి కల్పన వరకూ..విద్యుత్తు వాహనాలు (ఈవీలు) భారత సరికొత్త అభివృద్ధికి చోదకశక్తిగా ఉంటున్నాయని సైన్సు, టెక్నాలజీ, భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పీఎంఓ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇక్కడి భారత్ మండపంలో ఏర్పాటైన విద్యుత్తు వాహనాల (ఈవీ) ఎక్స్‌పోను ఈ రోజు సందర్శించిన సందర్భంగా మాట్లాడారు.
ఎగ్జిబిటర్లతో కూడా మంత్రి మాట్లాడారు. దేశీయ కంపెనీలు ప్రదర్శించిన ‘భారత్ లో తయారీ’ ఈవీ ఉత్పాదనలనూ,  వివిధ రకాల విద్యుత్తు రవాణా సాధనాలనూ ఆయన సమీక్షించారు.
మంత్రి తన సందర్శనలో ఎగ్జిబిషన్‌లోని అనేక స్టాళ్లను పరిశీలించారు. విద్యుత్తు వాహనాలు, విడి భాగాలతో పాటు స్వచ్ఛ రవాణా సాంకేతికతలలో భారతీయ తయారీ సంస్థలు సాధించిన సత్వర పురోగతిని గమనించారు. దేశీయ ఈవీ కంపెనీల సామర్థ్యం, విశ్వాసం అంతకంతకూ పెరుగుతుండడాన్ని ప్రశంసించారు. ఈ రంగం స్వచ్ఛ, హరిత, మరింత స్థిర భవిష్యత్తు వైపు భారత్ పయనిస్తుండటంలో కీలక పాత్రను పోషిస్తోందని ఆయన వర్ణించారు.
ప్రసార మాధ్యమాలను ఉద్దేశించి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న కొత్త సాంకేతిక ఐచ్ఛికాలను గురించి ప్రధానంగా ప్రస్తావించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఈ-మొబిలిటీ పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహనను ఏర్పరచాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. ప్రపంచంలో సరికొత్తగా తెర మీదకు వస్తున్న ఈ నవ కల్పనల ప్రయోజనాలను భారత్ పొందడమే కాకుండా స్వచ్ఛ ఇంధనం, సుస్థిర ప్రాతిపదిక కలిగిన రవాణా దిశగా సాగుతున్న పరివర్తన ప్రధాన ప్రయాణంలో ఇండియా చురుకైన భాగస్వామిగా మారుతోందని కూడా ఆయన అన్నారు.  
స్వచ్ఛ ఇంధనానికి సంబంధించిన విస్తారిత అనుబంధ వ్యవస్థలో తీసుకు వచ్చిన సంస్కరణలకూ, ఇటీవల తీసుకున్న విధాన నిర్ణయాలకూ మధ్య సమతూకం ఏర్పడిందని మంత్రి అన్నారు. పరమాణు ఇంధన రంగంలో ప్రయివేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి తీసుకువచ్చిన ‘శాంతి బిల్లు-2025’ స్వచ్ఛ, విశ్వసనీయ ఇంధన వనరుల్ని పటిష్ఠపరచడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న సమగ్ర దృక్పథాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన తెలిపారు. భారత అభివృద్ధి లక్ష్యాలూ, పర్యావరణ లక్ష్యాల సాధనకు విద్యుత్తు ఆధారిత రవాణా సాధనాలు తోడ్పడుతూనే, మరో వైపు స్వచ్ఛ ఇంధనం పట్ల ప్రపంచ దేశాలలో కనుపిస్తున్న మొగ్గుతో ఈ రవాణా సాధనాలు సరిపోలుతున్నాయని ఆయన చెప్పారు.
విద్యుత్తు వాహనాలు వినియోగదారులు ఉపయోగించుకోవడానికి అనుకూలమైనవిగా ఉంటున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. సంప్రదాయ వాహనాల కన్నా ఈవీలను నడపడం ఎంతో సులభం, శారీరకంగా పెద్దగా శ్రమించనక్కరలేదని ఆయన అన్నారు. అంబులెన్సులు, ఈ-రిక్షాలు, ప్రయాణికుల వాహనాలతో పాటు వాణిజ్య అవసరాల వంటి వివిధ విభాగాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, దీంతో ఇవి భిన్న రకాలైన రవాణా అవసరాలను తీర్చడానికి అనుకూలమైనవిగా మారాయని ఆయన తెలిపారు.  
రవాణా, పర్యావరణం, స్వచ్ఛ ఇంధన దృష్టికోణాల నుంచి చూసినప్పుడు విద్యుత్తు ఆధారిత రవాణా కీలకమైందే కాకుండా ఔత్సాహిక పారిశ్రామికత్వం, ఉపాధి.. ప్రత్యేకించి యువతకు ఉద్యోగాల కల్పన పరంగా ఒక శక్తిమంతమైన సాధనంగా కూడా మారుతోందని మంత్రి ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో రూపొందించిన అనుబంధ విస్తారిత వ్యవస్థ.. పరిమిత పెట్టుబడులతోనే ఈవీ సంబంధిత వాణిజ్య వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి యువ పారిశ్రామికవేత్తలకు అవకాశాలను కల్పించిందనీ, దీనికి ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తోందనీ, దీంతో వారు తక్కువ కాలంలో తమ వాణిజ్య వ్యవస్థల్ని ఎక్కువ టర్నోవర్ కలిగిన వ్యవస్థలుగా విస్తరించ గలుగుతున్నారనీ మంత్రి అన్నారు.
విద్యుత్తు వాహనాల రంగంలో ఉన్న అవకాశాలను గురించి యువజనులు మరింత విస్తృత అవగాహనను ఏర్పరుచుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. నవకల్పనలు దన్నుగా నిలిచే అభివృద్ధి సాధనకీ, స్వావలంబనకీ, సుస్థిరాభివృద్ధికీ విద్యుత్తు ఆధారిత రవాణా వ్యవస్థ ఆశాజనకమైన బాటను వేయగలుగుతుందని మంత్రి అన్నారు.
భారత్ మండపంలో నిర్వహిస్తున్న ఈవీ ఎక్స్‌పో‌లో ప్రధాన విద్యుత్ వాహన తయారీ సంస్థలు, అంకుర సంస్థలు, సాంకేతిక సేవా ప్రదాత సంస్థలతో పాటు విధాన రూపకల్పనలో భాగస్వామ్య వర్గాలు పాల్గొంటున్నాయి. ఈ ఎక్స్‌పో నవకల్పనల ప్రదర్శనకీ, ఆలోచనల మార్పిడికీ ఓ ఉమ్మడి వేదికగా నిలుస్తోంది. దీంతో పాటు ‘మేక్ ఇన్ ఇండియా’, ‘వికసిత్ భారత్’ దార్శనికతలకు అనుగుణంగా స్వచ్ఛ రవాణా, స్మార్ట్ రవాణాల దిశలో భారత్ పయనాన్ని ఈ ఈవీ ఎక్స్‌పో వేగవంతంగా మారుస్తోంది.

 

***


(रिलीज़ आईडी: 2207447) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil