పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2025 డిసెంబర్ 23, 24 తేదీల్లో జరగనున్న భారీ పెసా మహోత్సవం కోసం సిద్ధమవుతున్న విశాఖపట్నం


ఈ ఉత్సవంలో భాగంగా ప్రారంభంకానున్న పెసా వెబ్‌సైట్, పెసా సూచికలు

ఈ సందర్భంగా అన్ని పెసా రాష్ట్రాల్లో ప్రత్యేక గ్రామ సభలు

प्रविष्टि तिथि: 21 DEC 2025 1:24PM by PIB Hyderabad

పంచాయతీల (షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరణచట్టం- 1996 (పెసాఅమల్లోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ 2025 డిసెంబర్ 23, 24 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రెండు రోజుల పాటు ‘పెసా మహోత్సవంజానపద సంస్కృతి వేడుక’ను నిర్వహించనుందిపెసా చట్టం వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 24వ తేదీని ‘పెసా దినోత్సవం’గా పరిగణిస్తున్నాంఈ మహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రిపంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారుకేంద్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్‌తో పాటు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారుఈ వేడుకల్లో 10 పెసా రాష్ట్రాలకు చెందిన పంచాయతీ ప్రతినిధులుక్రీడాకారులుసాంస్కృతిక కళాకారులతోపాటు సుమారు 2,000 మంది ప్రతినిధులు పాల్గొంటారని భావిస్తున్నారుపెసా ప్రాంతాల్లోని గిరిజన వర్గాల సాంస్కృతికసంప్రదాయ వారసత్వాన్ని వేడుక చేసుకునేందుకు ఈ పెసా మహోత్సవాన్ని ఒక జాతీయ కార్యక్రమంగా రూపొందించారు

2025 డిసెంబర్ 24న పెసా చట్టానికి సంబంధించిన పలు ముఖ్యమైన జాతీయ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయిసమాచార వ్యాప్తిపెసా అమలును పర్యవేక్షించడం కోసం పెసా వెబ్‌సైట్రాష్ట్రాల వారీగా అమలు పరిస్థితిని అంచనా వేయడానికి పెసా సూచికలుఅవగాహన క్షేత్రస్థాయి సామర్థ్యాన్ని పెంచడం కోసం గిరిజన భాషల్లో పెసా శిక్షణ మాడ్యుళ్లుహిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాకు సంబంధించిన సంప్రదాయ జ్ఞానం సంస్కృతి వారసత్వాన్ని తెలియజేసే ఒక ఈ-బుక్ వీటిలో ఉన్నాయివేడుకల్లో భాగంగా గుర్తించిన పది పెసా అంశాలపై పాల్గొనే రాష్ట్రాలకు చెందిన ఎన్నికైన ప్రతినిధుల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని పెసా గ్రామ పంచాయతీలలో ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించనున్నారుదీనితో పాటు సామాజిక న్యాయంజీవనోపాధిఆచార వ్యవహారాల పరిరక్షణసహజ వనరుల రక్షణసమాజ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తూ 2025 డిసెంబర్ 24న మొత్తం పది పెసా రాష్ట్రాల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తారు

భారతదేశ గిరిజన వారసత్వ చైతన్యంవైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఈ మహోత్సవంలో అనేక రకాల క్రీడలుసాంస్కృతిక కార్యకలాపాలను నిర్వహిస్తారువిశాఖపట్నం నగరంలోని రామకృష్ణ బీచ్ఇండోర్ స్టేడియంక్రికెట్ స్టేడియంకళావాణి ఆడిటోరియంలలో వివిధ కార్యక్రమాలకు నిర్వహించనుండగా.. ఈ మహోత్సవానికి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ క్యాంపస్ ప్రధాన వేదిక కానుంది

పెసా చట్టం-1996 : 

కొన్ని మినహాయింపులు సవరణలతో రాజ్యాంగంలోని పార్ట్-IX నిబంధనలను షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తింపజేయటం కోసం పార్లమెంటు భారత రాజ్యాంగంలోని అధికరణ 243ఎం(4)(బీప్రకారం ‘పంచాయతీల (షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరణచట్టం- 1996’ను ఆమోదించిందిదీనినే పెసా చట్టం అని పిలుస్తారుభారత రాష్ట్రపతి ప్రకటించిన ప్రాంతాలనే షెడ్యూల్డ్ ప్రాంతాలు అని అంటారుఈ ప్రాంతాలకు సంబంధించిన నిబంధనలను రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(1), ఐదో షెడ్యూల్ తెలియజేస్తాయిఈ షెడ్యూల్డ్ ప్రాంతాలను రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ కింద పేర్కొన్నందుకు వీటిని ఐదో షెడ్యూల్ ప్రాంతాలు అని కూడా అంటారుప్రస్తుతం ఈ ఐదో షెడ్యూల్ ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ఛత్తీస్‌గఢ్గుజరాత్హిమాచల్ ప్రదేశ్జార్ఖండ్మధ్యప్రదేశ్మహారాష్ట్రఒడిశారాజస్థాన్తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నాయి.

 

***


(रिलीज़ आईडी: 2207227) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Gujarati