పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పర్యాటకుల క్షేత్రస్థాయి భద్రత బలోపేతం కోసం పర్యాటక పోలీసుల నియామకం

प्रविष्टि तिथि: 18 DEC 2025 3:52PM by PIB Hyderabad

పర్యాటకుల కోసం క్షేత్రస్థాయి భద్రతా యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక పర్యాటక పోలీసుల నియామకం కోసం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో నిరంతరం చర్చిస్తోందిపర్యాటక మంత్రిత్వ శాఖ కృషి కారణంగా ఇప్పటికే తెలంగాణఆంధ్రప్రదేశ్ఢిల్లీగోవాకర్ణాటకకేరళమహారాష్ట్రహిమాచల్ ప్రదేశ్జమ్మూ కాశ్మీర్మధ్యప్రదేశ్ఒడిశాపంజాబ్రాజస్థాన్సిక్కింఉత్తరప్రదేశ్ రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు పర్యాటక పోలీసులను నియమించాయిప్రత్యేక పర్యాటక పోలీసుల నియమాకం కోసం రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఎటువంటి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలుసహాయం అందించలేదు.

పర్యాటక పోలీసుల అవసరాన్ని అర్థం చేసుకోవడానికిఆయా రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లో నియమించిన పర్యాటక పోలీసులకు పర్యాకటకుల అవసరాలను గురించి అవగాహన కల్పించడానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజంట్రావెల్ మేనేజ్‌మెంట్ (ఐఐటీటీఎంద్వారా పర్యాటక మంత్రిత్వ శాఖ "రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యాటక పోలీసుల కార్యాచరణ-అత్యుత్తమ పద్ధతుల డాక్యుమెంటేషన్పేరుతో ఒక అధ్యయనాన్ని నిర్వహించిందివారికి శిక్షణ ఇవ్వడానికి ఐఐటీటీఎం ఇచ్చిన శిక్షణ మాడ్యూల్‌ను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపారుదీనిని అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపిణీ చేశారు.

సమగ్ర విధాన ప్రణాళిక రూపొందించడం కోసం బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఈ పర్యాటక పోలీస్ పథకంపై ఒక అధ్యయనాన్ని నిర్వహించిసమగ్ర నివేదికను రూపొందించిందిపర్యాటకులకు సురక్షితమైన వాతావరణం కల్పించడం కోసం అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లో యూనిఫాం పర్యాటక పోలీసు విధానం అమలు లక్ష్యంగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ... హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖపీబీపీఆర్-డీల సహకారంతో అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల పోలీసు శాఖ అధిపతులు డీజీలుఐజీలతో న్యూఢిల్లీలో పర్యాటక పోలీస్ పథకంపై జాతీయ సమావేశాన్ని నిర్వహించింది.

ఈ సమాచారాన్ని కేంద్ర పర్యాటకసాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***


(रिलीज़ आईडी: 2206129) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी